tsunami alerts
-
జపాన్లో సునామీ హెచ్చరికలు
టోక్యో: ద్వీప దేశమైన జపాన్లో నూతన సంవత్సరం తొలిరోజే శక్తివంతమైన భూకంపం సంభవించింది. వాయవ్య జపాన్ తీరంలో సోమవారం సాయంత్రం 4 గంటల తరువాత పలుమార్లు భూప్రకంపనలు నమోదయ్యాయి. కనీసం 21 సార్లు భూమి కంపించినట్లు స్థానిక మీడియా తెలియజేసింది. ఇషిగావా రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాల్లో వరుసగా భూప్రకంపనలు సంభవించాయి. తొలుత సాయంత్రం 4.06 గంటల ప్రాంతంలో మొదలైన ప్రకంపనలు 4.32 గంటల వరకు కొనసాగాయి. ఈ భూకంప తీవ్రత సాయంత్రం 4.10 గంటలకు రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ ప్రకటించింది. భూకంపం దాటికి సముద్రంలో ఐదు అడుగుల మేర అలలు ఎగిసిపడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. పశి్చమ కోస్తా తీరంలోని ఇషిగావా, నిగాటా, టొమయా జిల్లాలకు జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇషిగావాకు మేజర్ సునామీ హెచ్చరిక, మిగిలిన పశి్చమ తీర ప్రాంతానికి తక్కువ తీవ్రత కలిగిన సునామీ హెచ్చరిక జారీ చేసింది. కొన్ని గంటల తర్వాత సముద్రంలో అలల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సాధారణ సునామీ హెచ్చరికలను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. తీర ప్రాంతాల్లోని జనం తక్షణమే సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని సూచించింది. నిగాటా, టొమయాలో 3 మీటర్ల మేర అలలు ఎగిసిపడుతున్నాయి. ఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని ప్రధాని కిషిడా చెప్పారు. శిథిలాల కింద బాధితులు! ఇషిగావా జిల్లాతోపాటు సమీప ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయని వాతావరణ సంస్థ ప్రకటించింది. ఇషిగావాలోని నోటో ప్రాంతం నుంచి 300 కిలోమీటర్ల మేర సునామీ అలలు విస్తరించే అవకాశం ఉందని స్థానిక వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. భూకంపం వల్ల ఇళ్లు కంపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. భూప్రకంపనలతో భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు కుర్చీలు, టేబుళ్ల కింద దాక్కున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. మరికొన్ని ఇళ్లకు పగుళ్లు కనిపించాయి. ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు. రాజధాని టోక్యోతోపాటు కాంటో ఏరియాలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. అధికారులతో పాటు సైన్యమూ సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఉభయ కొరియాలతో పాటు రష్యాలోనూ సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. టోక్యోలోని భారత రాయబార కార్యాలయం బాధితులకు సమాచారం, సహాయం అందించేందుకు ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. -
ఫిలిప్పీన్స్లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
మనీలా: ఫిలిప్పీన్స్లోని మిండనావో దీవిని శనివారం శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. భూమిలో 32 కిలోమీటర్ల లోతులో రాత్రి 10.37 గంటల సమయంలో ఇది సంభవించింది. దక్షిణ ఫిలిప్పీన్స్, ఇండోనేసియాలోని కొన్ని ప్రాంతాలు, మలేసియాలో సునామీ అలలు మీటరు ఎత్తున ఎగసిపడే అవకాశముందని అంచనా వేసినట్లు పసిఫిక్ సునామీ వారి్నంగ్ సెంటర్ తెలిపింది. -
మరో సునామీ రావచ్చు
కార్టియా: ఇండోనేసియాపై మరోసారి సునామీ విరుచుకుపడే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు గురువారం హెచ్చరికలు జారీ చేశారు. గతవారం విస్పోటనం చెందిన ఆనక్ క్రకటోవా అగ్ని పర్వతం వద్ద ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మరో భారీ సునామీకి సంకేతంగా వారు భావిస్తున్నారు. దీని కారణంగానే రెండో తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా అనేక విస్పోటనాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆ దేశ జాతీయ విపత్తు సంస్థ అధికార ప్రతినిధి సుటోపో పుర్వో నుగ్రోహో తెలిపారు. ఇప్పటివరకు ఆనక్ క్రకటోవా అగ్ని పర్వత ప్రదేశం నుంచి రెండు కిలోమీటర్ల వరకు నిషేధిత ప్రాంతం(నో గో జోన్)గా ఉండగా.. తాజాగా దీనిని ఐదు కిలోమీటర్లకు పెంచారు. గత శనివారం విస్పోటనం ధాటికి భారీగా ఎగిసిన బూడిద, వేడి వాయువులు, ఇతర అగ్ని పర్వత మిశ్రమాలు అక్కడి ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నాయి. బూడిద, ఇసుక ఎగిసిపడుతున్న నేపథ్యంలో సిలేగాన్, సెరాంగ్ పట్టణ ప్రజలు మాస్కులు, కళ్లద్దాలు ధరించాలని అధికారులు తెలిపారు. -
సాల్మన్ దీవుల్లో భూకంపం.. సునామీ అలర్ట్
సిడ్నీ: దక్షిణ పసిఫిక్ సముద్రంలోని సాల్మన్ దీవుల్లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేశారు. శుక్రవారం తెల్లవారుజామున 4.38 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.08 గంటలకు) సముద్రంలో 49కి.మీ. లోతున భూకంపం ఏర్పడిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సాల్మన్ ఐలాండ్స, వనౌటు, పపువా న్యూగినియా, నౌరు, తువలు, కోషయ్ ్రదీవుల వెంట సునామీ అలలు తాకవచ్చని హెచ్చరించింది. హవాయ్ ద్వీపానికి కూడా ముప్పు ఉండవచ్చని భావిస్తున్నారు.