దక్షిణ పసిఫిక్ సముద్రంలోని సాల్మన్ దీవుల్లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
సిడ్నీ: దక్షిణ పసిఫిక్ సముద్రంలోని సాల్మన్ దీవుల్లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేశారు. శుక్రవారం తెల్లవారుజామున 4.38 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.08 గంటలకు) సముద్రంలో 49కి.మీ. లోతున భూకంపం ఏర్పడిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సాల్మన్ ఐలాండ్‌స, వనౌటు, పపువా న్యూగినియా, నౌరు, తువలు, కోషయ్ ్రదీవుల వెంట సునామీ అలలు తాకవచ్చని హెచ్చరించింది. హవాయ్ ద్వీపానికి కూడా ముప్పు ఉండవచ్చని భావిస్తున్నారు.