శత్రు దేశాలకు ఇరాన్ గట్టి హెచ్చరిక
ఇరాన్ : ఇరాన్ తన శత్రు దేశాలకు గట్టి హెచ్చరికలు పంపింది. ఏ శత్రుదేశమైనా పరిధి దాటి ప్రవర్తిస్తే ఆ దేశాలకు తమ క్షిపణి సమాధానం చెబుతుందని ఇరాన్ ఎలైట్ రెవల్యూషనరీ గార్డ్ ఎయిర్ స్పేస్ విభాగం జనరల్ అమీర్ అలీ తెలిపారు. రివల్యూషనరీ గార్డ్ మిలిటరీ ఇటీవల చేసిన క్షిపణి, రాడార్ వ్యవస్థల్ని పరీక్షించడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ పై ఆంక్షలు విధిస్తామన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ తాజాగా హెచ్చరించింది. శత్రుదేశాలు హద్దు మీరినట్లైతే తమ క్షిపణులు ఆ దేశాలకు సమాధానం చెబుతాయని హజిజదె వ్యాఖ్యానిం చారు.
ఇదిలా ఉండగా కేవలం ఆత్మరక్షణ చర్యల్లో భాగం గానే క్షిపణి పరీక్షలు జరిపామని, భద్రతామండలిలోని 2231 తీర్మానాన్ని గానీ, పశ్చిమ దేశాలతో అణు ఒప్పం దాల్ని ఉల్లంఘించలేదని ఇరాన్ చెబుతోంది. తమ ప్రజల కు భద్రతనిచ్చేందుకు వారిలో భయాందోళనలు పారద్రో లేందుకే మేము క్షిపణి పరీక్షలు జరిపామని..ముందుగా మేం యుద్ధాన్ని కోరుకోమని ఇరాన్ విదేశాంగ మంత్రి జావద్ జరీఫ్ ట్వీట్‌లో తెలిపారు.