Russia-Ukraine War: Russian President Vladimir Putin warnings To Ukraine Check Details - Sakshi
Sakshi News home page

Russia-Ukraine War: అసలు యుద్ధం ముందే ఉంది

Published Sat, Jul 9 2022 5:41 AM | Last Updated on Sat, Jul 9 2022 11:39 AM

Russia-Ukraine War: Russian President Vladimir Putin warnings to Ukraine - Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌ తమ షరతులకు త్వరగా ఒప్పుకోకుంటే మరింత విధ్వంసం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరికలు చేశారు. తామింకా పూర్తి స్థాయి సైనిక చర్య ప్రారంభించనే లేదన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు ఐదు నెలలుగా కొనసాగుతున్న వేళ ఆయన ఈ వార్నింగ్‌ ఇవ్వడం గమనార్హం. పుతిన్‌ శుక్రవారం దేశ పార్లమెంట్‌నుద్దేశించి మాట్లాడారు. క్రిమియా, వేర్పాటువాదుల ప్రాబల్యప్రాంతాలతో పాటు ఆక్రమిత ప్రాంతాలపై తమ సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని ఉక్రెయిన్‌ను రష్యా డిమాండ్‌ చేస్తోంది.  

ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధ సాయం
వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌కు అమెరికా మరో రూ.3,100 కోట్ల విలువైన ఆయుధ సాయం అందజేసింది. ఇందులో అత్యాధునిక రాకెట్‌ వ్యవస్థలు తదితరాలున్నాయని అధికారులు చెప్పారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement