military attacks
-
పాలస్తీనా మా సొంతం
న్యూయార్క్: గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక దాడులను పాలస్తీనా అథారిటీ చీఫ్ మహ్మూద్ అబ్బాస్ తీవ్రంగా ఖండించారు. పాలస్తీనా మా సొంతం. పాలస్తీనా నుంచి వెళ్లిపోవాల్సిన వారు ఎవరూ అంటే ఆక్రమణదారులు మాత్రమే’ అని ఆయన అన్నారు. గురువారం అబ్బాస్ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఆయన స్టేడియం వైపు వెళ్తుండగా కరతాళధ్వనులు, చప్పట్లు హాలంతా మారుమోగాయి. అర్థంకాని కేకలు వినిపించాయి. పోడియం వద్దకు చేరుకున్న అబ్బాస్..మేం వదిలి వెళ్లం. మేం వదిలి వెళ్లం. మేం వదిలి వెళ్లం..అంటూ ప్రసంగం మొదలుపెట్టారు.గాజాను, అక్కడి ప్రజలను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న నరమేధాన్ని ఆపాలంటూ ప్రపంచ నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గాజాను నివాసయోగ్యం కాకుండా చేస్తోంది. యుద్ధానంతరం ఏర్పడే గాజాను మేమే పాలిస్తాం. పాలస్తీనా మా మాతృ భూమి. మా తండ్రులు, తాతలది. అది ఎప్పటికీ మాదే. వెళ్లిపోవాల్సింది ఎవరైనా ఉంటే వారు ఆక్రమిత వడ్డీవ్యాపారులు మాత్రమే’అని వ్యాఖ్యానించారు. -
అవును, రష్యాపై దాడి చేశాం: జెలెన్స్కీ
కీవ్: రష్యాలోని సరిహద్దు ప్రాంతం కస్క్‌లో ఉక్రెయిన్ ఆకస్మిక సైనిక దాడులు చేసినట్టు అధ్యక్షుడు జెలెన్స్కీ నిర్ధారించారు. తమ సైన్యం పోరాటాన్ని రష్యా భూభాగంలోకి తీసుకెళ్లిందన్నారు. కస్క్‌లో తమ దళాలు ముందుకు దూసుకెళుతున్నాయని చెప్పారు. ఈ యుద్ధంతో రష్యా గడ్డపై ఉక్రెయిన్ చేసిన అతిపెద్ద దాడి ఇది.దాడిలో బాలుడు సహా ముగ్గురు మృతిఆదివారం రాత్రి కీవ్‌పై రష్యా డ్రోన్, క్షిపణి దాడుల్లో ఓ నాలుగేళ్ల బాలుడు, మరో ఇద్దరు మరణించారు. 53 డ్రోన్లను కూల్చేసినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ దాడిలో రష్యా వాడిన క్షిపణులు ఉత్తరకొరియావని జెలెన్స్కీ అన్నారు. -
మెగా మిలిటరీ విన్యాసాలకు సిద్ధమవుతున్న ఇండియన్ నేవీ
ప్రపంచ భౌగోళిక రాజకీయ వాతావరణం, గ్లోబల్‌గా జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో భారతనౌకాదళం తొమ్మిది రోజులపాటు నావికా విన్యాసాలు చేపట్టనుంది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అరేబియా మహాసముద్రంలో జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం 50కి పైగా దేశాల భాగస్వామ్యం కానున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా మిలిటరీ విన్యాసాలు పెంచడం కూడా ఇందుకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న 'మిలన్' విన్యాసాల్లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాలకు చెందిన నౌకాదళాలు పాల్గొంటాయని అధికారులు తెలిపారు. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ విన్యాసాల్లో భాగంగా అధునాతన వైమానిక రక్షణ కార్యకలాపాలు, యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్, యాంటీ-సర్ఫేస్ డ్రిల్లు ఉంటాయని సమాచారం. మిలన్‌ను 1995లో భారత నావికాదళం ప్రారంభించింది. 2022లో 39 దేశాలు ఈ మిలన్లో పాల్గొన్నాయి. -
Russia-Ukraine War: అసలు యుద్ధం ముందే ఉంది
మాస్కో: ఉక్రెయిన్ తమ షరతులకు త్వరగా ఒప్పుకోకుంటే మరింత విధ్వంసం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు చేశారు. తామింకా పూర్తి స్థాయి సైనిక చర్య ప్రారంభించనే లేదన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు ఐదు నెలలుగా కొనసాగుతున్న వేళ ఆయన ఈ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. పుతిన్ శుక్రవారం దేశ పార్లమెంట్‌నుద్దేశించి మాట్లాడారు. క్రిమియా, వేర్పాటువాదుల ప్రాబల్యప్రాంతాలతో పాటు ఆక్రమిత ప్రాంతాలపై తమ సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని ఉక్రెయిన్ను రష్యా డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధ సాయం వాషింగ్టన్: ఉక్రెయిన్‌కు అమెరికా మరో రూ.3,100 కోట్ల విలువైన ఆయుధ సాయం అందజేసింది. ఇందులో అత్యాధునిక రాకెట్ వ్యవస్థలు తదితరాలున్నాయని అధికారులు చెప్పారు. -
ఉక్రెయిన్‌తో యుద్ధం.. రష్యాకు షాక్!.. 5 విమానాలు, హెలికాప్టర్ కూల్చివేత
మాస్కో: రష్యా దాడులతో అప్రమత్తమైన ఉక్రెయిన్ ఎదురుదాడి ప్రారంభించింది. రష్యాకు ధీటుగా భారీగా బలగాలను మోహరించి కీలక ప్రాంతాల్లో తిరుగుబాటు మొదలు పెట్టింది. రష్యా ఫైటర్ జెట్‌ను ఉక్రెయిన్ బలగాలు కూల్చివేశాయి. 5 రష్యా విమానాలు, హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్ ప్రభుత్వం మార్షల్ లా విధించింది. పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని ఉక్రెయిన్ ఆదేశించింది. ఇది దురాక్రమణ చర్య: ఉక్రెయిన్ రష్యా దాడులపై ఉక్రెయిన్ స్పందించింది. రష్యా పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించిందని, ఇది దురాక్రమణ చర్యగా అధ్యక్షుడు జెలెన్స్కీ వర్ణించారు. శాంతియుత నగరాలపై దాడులకు పాల్పడుతున్నారని, ప్రపంచ దేశాలు పుతిన్‌ను నిలువరించాన్నారు. యుద్ధం ఆపడం ఐరాస బాధ్యతనని పేర్కొన్నారు. రష్యా దాడుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ముందుగా దౌత్యపరమైన ప్రయత్నాలే చేస్తామన్న జెలెన్ స్కీ.. రెండో ప్రణాళికగా బలగాలను దింపుతామని తెలిపారు. రష్యా మిలిటరీ ఆపరేషన్ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలకు అధ్యక్షడు జెలెన్ స్కీ సందేశం అందించారు. రష్యా కేవలం సైనిక స్థావరాలపైనే దాడి చేస్తోందని, సైన్యం తన పని తాను చేసుకుబోతుందన్నారు. ఉక్రెయిన్ ప్రజలు భయాందోళనకు గురికావొద్దని తెలిపారు. #AirRaid #sirens in #Kiev as the oligarchs and the elite flee the #country in the face of the advancing #Russian peacekeeping forces. #UkraineRussianConflict https://t.co/iNxZ7vnFk0 pic.twitter.com/mK3HaJtAgA — 🇦🇺 The Cynical Hun 🇭🇺 (@TheCynicalHun) February 24, 2022 మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడితో అమెరికా ప్రెసిడెంట్ ఫోన్లో చర్చలు జరిపారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని జో బైడెన్ తెలిపారు. ఇప్పటికే ఉక్రెయిన్‌కు బ్రిటన్,ఫ్రాన్స్ మద్దతు తెలిపాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శుక్రవారం జీ-7 దేశాలతో జో బైడెన్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. నాటో కూటమికి సహకరిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు రష్యా దాడి చేసిన ఉక్రెయిన్ ప్రాంతాలు Sound of an explosion in #Mariupol. Reports of explosions in #Kharkiv. #Russia announces military operations to demilitarise #Ukraine. Reporting from Groundzero. @aajtak @IndiaToday pic.twitter.com/2heTkRfIyx — GAURAV C SAWANT (@gauravcsawant) February 24, 2022 కాగా రష్యా బలగాలు చుట్టుముట్టిన వేళ ఉక్రెయిన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. నెలరోజుల పాటు దేశమంతా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అయితే గురువారం తెల్లవారుజామున నుంచి రష్యా ఉక్రెయిన్‌పై భీకర దాడులు జరుపుతోంది. కీవ్, ఖర్కీవ్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ను మూడు వైపుల రష్యా బలగాలు చుట్టుముట్టాయి. రష్యా దాడులతో కీవ్ ఎయిర్‌పోర్టును ఉక్రెయిన్ ఖాళీ చేసింది. BREAKING: Air raid sirens wail across Ukraine's capital pic.twitter.com/jclNZ5h7kx — BNO News (@BNONews) February 24, 2022 -
మయన్మార్‌లో ఆగని అరాచకం.. 550 మంది మృతి
యాంగాన్: మయన్మార్‌లో మిలటరీ అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. నిరసనకారుల్ని అణిచివేయడానికి సైన్యం ప్రతీ రోజూ కాల్పులకు దిగుతోంది. శనివారం సైన్యం కాల్పుల్లో మరో ఇద్దరు పౌరులు బలయ్యారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ కాల్పులకు సంబంధించిన వీడియోని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అందులో కొంతమంది తల నుంచి రక్తం ధారగా కారుతున్న ఒక యువకుడిని తీసుకొని పరుగుల తీస్తున్న దృశ్యంతో పాటు కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఫిబ్రవరి 1న అంగసాన్ సూకీ ప్రభుత్వాన్ని గద్దె దింపిన తర్వాత మిలటరీ కాల్పుల్లో ఇప్పటివరకు 550 మంది ప్రాణాలు పోయాయని స్థానిక హక్కుల సంస్థ వెల్లడించింది. మరణించిన వారిలో 46 మంది చిన్నారులు ఉండడం తీవ్రంగా కలకలం రేపే అంశం. మయన్మార్ అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 2,751 మందిని సైన్యం అదుపులోనికి తీసుకొని జైలు పాలు చేసింది. మిలటరీ ప్రజా ఉద్యమాన్ని ఎంతలా అణగదొక్కాలనుకుంటుందో అంతే బలంగా అది పైకి లేస్తోంది. మిలటరీ తూటాలకు భయపడేది లేదంటున్న ప్రజలు రోడ్లపైకి వచ్చి మిలటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. అందరిపైనా తుపాకీ గురి పెడుతున్నారు ఇల్లు దాటి బయటకి వచ్చిన ప్రతీ ఒక్కరిపైనా మయన్మార్ సైనికులు తుపాకీ గురి పెడుతున్నట్టుగా సీఎన్ఎన్ చానెల్‌కి కొందరు నిరసనకారులు చెప్పారు. ‘‘దుకాణాలకి వెళ్లినా, రోడ్డుపై నడిచి వెళుతున్నా సైనికులు పిస్టల్ని గురి పెట్టి బెదిరిస్తున్నారు. ఎవరైనా సాయం కోరినా అందించే పరిస్థితి లేదు’’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా మిలటరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మైనార్టీ రెబెల్ గ్రూపు కరేన్ నేషనల్ యూనియన్ తమకు పట్టున్న గ్రామాలపై మిలటరీ నిరంతరాయంగా బాంబుల వర్షం కురిపిస్తోందని తెలిపింది. చదవండి: తల్లి టీవీ ఆఫ్ చేసిందని కొడుకు ఆత్మహత్య ఇండోనేషియాలో భారీ వరదలు.. 44మంది మృతి -
మయన్మార్‌లో బాంబుల వర్షం
-
Myanmar: గ్రామంపై బాంబుల వర్షం
మయన్మార్: మయన్మార్‌లో మిలటరీ, ప్రజల మధ్య జరుగుతున్న పోరు కారణంగా ఉద్రిక్త పరిస్థితులు చెలరేగుతూ ఉండటంతో అది అంతర్యుద్ధానికి దారి తీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిలటరీ అరాచకాలకు నిరసనగా వేలాదిమంది రోడ్లపైకి వస్తున్నారు. కాగా, కేఎన్‌యూ సాయుధ సంస్థ నియంత్రణలో ఉన్న గ్రామంపై సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినట్లు స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. గ్రామంపై మయన్మార్ ఆర్మీ బాంబుల వర్షం యాంగాన్: మయన్మార్‌లో మిలటరీ కరేన్ నేషనల్ యూనియన్ (కేఎన్‌యూ) సాయుధ సంస్థ నియంత్రణలో ఉన్న గ్రామంపై బాంబుల వర్షం కురిపించింది. మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనకారులు ఆదివారం రోడ్లపైకి వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిం చాలని నినదించారు. మరోవైపు థాయ్ సరిహద్దుల్లోని గ్రామంపై మయన్మార్ మిలటరీ ప్రతీకార దాడులకు దిగింది. పపూన్ జిల్లాలో ఓ గ్రామంపై వైమానిక దాడులు చేసి బాంబుల వర్షం కురిపించింది. దీంతో గ్రామస్తులు ప్రాణాలరచేతుల్లో పట్టుకొని పరుగులు తీశారు. ఈ దాడిలో పిల్లలు సహా పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఓ సంస్థ వెల్లడించింది. కేఎన్‌యూకి చెందిన కొంతమంది శనివారం ఒక ఆర్మీ బేస్‌పై దాడి చేసి లెఫ్ట్‌నెంట్ కల్నల్ సహా 10 మంది సైనికుల్ని చంపేశారు. ప్రతీకారంగా సైన్యం ఈ దాడి చేసింది. యాంగాన్‌లో రోడ్లపై ప్రజాస్వామ్యవాదులు ఏర్పాటు చేసిన అడ్డంకులు -
అమాయకులను చంపినందుకే..
బాగ్దాద్/వాషింగ్టన్/బ్రస్సెల్స్: వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నందునే ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. న్యూఢిల్లీ, లండన్ వంటి ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల వెనుక అతని హస్తముందన్నారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ఉగ్రవాది సులేమానీని తన ఆదేశాలతోనే అమెరికా సైన్యం మట్టుబెట్టిందని, దీంతో అతని శకం అంతమైందని చెప్పారు. ఫ్లోరిడాలోని సొంత రిసార్ట్‌లో శనివారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. గడిచిన 20 ఏళ్లలో పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించేందుకు కుట్రపన్నారని, అతని కనుసన్నల్లోనే ఇటీవల ఇరాక్‌లోని తమ సైనికులు, ఎంబసీపై దాడులు జరిగాయన్నారు. సులేమానీ మరణంతో ఈ ప్రాంతంలో యుద్ధం ప్రారంభమవుతుందన్న ఆందోళనలను ట్రంప్ కొట్టిపారేశారు. ఇరాన్ సహా తమను బెదిరించే వారిపై ఎలాంటి చర్య అయినా తీసుకునేంతటి శక్తి అమెరికాకు ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పరిమితం సులేమాని మృతితో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో..ఉగ్రవాదులపై పోరులో ఇరాక్ సైన్యానికి సహకరిస్తున్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు, నాటో తమ కార్యక్రమాలను నిలిపి వేశాయి. ‘సంకీర్ణ బలగాలను కాపాడుకోవడమే ఈ సమయంలో మాముందున్న లక్ష్యం. ప్రస్తుతానికి సైనిక శిక్షణ, ఉగ్రవాదులపై పోరు వంటి కార్యక్రమాలను పరిమితం చేసుకున్నాం. దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఓ సైనికవర్గాలు వెల్లడించాయి. అమెరికా తాజా డ్రోన్ దాడి ఈ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయని విశ్లేకులు అంటున్నారు. 2011లో అల్ ఖాయిదా చీఫ్ లాడెన్, 2019లో ఐఎస్ చీఫ్ బాగ్దాదీ హతమైనప్పటి కంటే తాజా దాడి ఎక్కువ ప్రభావం చూపనుందని పేర్కొంటున్నారు. సులేమానీకి అశ్రు నివాళి సులేమానీ(62)కి వేలాది మంది ప్రజలు అశ్రు నివాళులర్పించారు. శుక్రవారం బాగ్దాద్‌లో విమానాశ్రయం వద్ద అమెరికా డ్రోన్ దాడిలోæ సులేమాని, ఇరాకీ పారా మిలటరీ అధిపతి అబుæ ముహందిస్ మరణించడం తెల్సిందే. వీరి శవ పేటికలను బాగ్దాద్‌లోని ప్రముఖ షియా మసీదుకు తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఇరాక్ ప్రధాని అదెల్ అబ్దుల్ మహ్దీ, షియాల మత పెద్ద అమ్మర్ అల్ హకీం, ఇరాక్ మాజీ ప్రధాని నూరి అల్ మాలికితోపాటు ఇరాన్ అనుకూల ప్రముఖులు పాల్గొన్నారు. మృతదేహాలను షియాల పవిత్ర నగరం నజాఫ్‌కు, అటునుంచి ఇరాన్‌కు తీసుకెళ్లనున్నారు. సులేమానీ హత్యపై ఐరాసలోని ఇరాన్ రాయబారి మజీద్ తఖ్త్ రవంచి స్పందిస్తూ.. తమ బద్ధ విరోధి పాల్పడిన యుద్ధచర్యగా అమెరికానుద్దేశించి పేర్కొన్నారు. ఇరాన్ అనుకూల కాన్వాయ్‌పై మళ్లీ దాడి అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధ భయాలు అలుముకున్న నేపథ్యంలో శనివారం మరోసారి ఇరాన్ అనుకూల ఇరాకీ పారామిలటరీ అధికారి వాహన శ్రేణి లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో హషీద్ సురక్షితంగా బయటపడగా ‘కొందరు గాయపడ్డారు, కొందరు చనిపోయారు’ అంటూ ఓ అధికారి తెలిపారు. అంతకుమించి వివరాలు వెల్లడి కాలేదు. ముస్లిం తీవ్రవాద సంస్థలపై పోరాటంలో ఇరాక్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే అక్కడ 5,200 మంది అమెరికా సైనికులు ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరికితోడు మరో 3,500 మందిని అక్కడకు తరలించనున్నట్లు అమెరికా ప్రకటించింది. బాగ్దాద్‌లోని అమెరికా స్థావరంపై రాకెట్ దాడి ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని బలాడ్ అమెరికా వైమానిక స్థావరంపై శనివారం రాత్రి రాకెట్ దాడి జరిగింది. ఒక రాకెట్ సురక్షిత ప్రాంతంగా ప్రకటించిన గ్రీన్జోన్లో పేలగా రెండోది వెలుపల ప్రాంతాన్ని తాకిందని ఇరాక్ సైన్యం తెలిపింది. వీటివల్ల నష్టంపై వివరాలను వెల్లడించలేదు. అయితే, రాకెట్ల ప్రయోగ స్థానాన్ని గుర్తించేందుకు డ్రోన్లను పంపినట్లు వివరించింది. టెహ్రాన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను తగలబెడుతున్న నిరసనకారులు -
ఉ. కొరియాపై సైనిక దాడే మార్గం: అమెరికా
వాషింగ్టన్: ఉత్తర కొరియా అణ్వాయుధాలను కచ్చితత్వంతో గుర్తించి, స్వాధీనం చేసుకోవడానికి సైనిక దాడి చేయడమే ఏకైక మార్గమని అమెరికా రక్షణ కార్యాలయం పేర్కొంది. అమెరికాతో యుద్ధం తలెత్తితే ఉ.కొరియా జీవ, రసాయన ఆయుధాలను ప్రయోగించే వీలుందని విశ్లేషించింది. ఈ మేరకు పెంటగాన్ అమెరికా చట్ట సభ్యులకు రాసిన లేఖలో...ఉ.కొరియాను ఎదుర్కొని, వారి అణ్వాయుధాలను ధ్వంసం చేయడానికి అమెరికాకున్న సామర్థ్యాలపై చర్చలు జరపడం గోప్యంగా ఉంచాల్సిన విషయమని అభిప్రాయపడింది. అమెరికాను తక్కువ అంచనా వేయిద్దు: ట్రంప్ ఏ నియంత కూడా అమెరికాను తక్కువ అంచనా వేయొద్దని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఆసియా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం జపాన్ చేరుకున్నారు. టోక్యోలోని యొకోటా ఎయిర్ బేస్‌లో మాట్లాడుతూ...‘ఏ నియంత, ఏ ప్రభుత్వం, ఏ దేశం కూడా అమెరికా దృఢ సంకల్పాన్ని తక్కువగా చూడొద్దు’ అని అన్నారు. మరోవైపు, జపాన్ పర్యటనలో ఉన్న ట్రంప్.. జపాన్ ప్రధాని షింజో అబేతో భేటీ అయ్యారు. -
'జిహాదీ జాన్'పై అమెరికా బాంబుల వర్షం!
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌కు సంబంధించిన కరడుగట్టిన ఉగ్రవాది జిహాదీ జాన్(మహ్మద్ ఎమ్వాజీ) అంతు చూసేందుకు అమెరికా బయలుదేరింది. వేలమంది కంఠాలను తెగకోసిన ఆ నరరూప రాక్షసుడిని ఎలాగైనా మట్టుపెట్టాలని అమెరికా మిలటరీ సేనలు దాడులు నిర్వహించాయి. గుట్టుచప్పుడు కాకుండా జిహాదీ జాన్ ఉన్నట్లుగా భావించిన ప్రాంతాల్లో అమెరికా వైమానిక సంస్థ దాడులు జరిపింది. ఈ మేరకు పెంటగాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ దాడుల్లో మహ్మద్ ఎమ్వాజీ చనిపోయాడా లేదా అనే విషయంపై మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 'ఆపరేషన్ (దాడులు) జరిపిన ప్రాంతంలో పరిస్థితిని ప్రస్తుతం అంచనా వేస్తున్నాం. జిహాదీ జాన్ మృతిపై ఇంకా వివరాలు తెలియలేదు. తెలిస్తే తప్పకుండా ఆ విషయాలు తెలియజేస్తాం' అని పెంటగాన్ అధికారిక ప్రకటన తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రభావం అధికంగా ఉండే రఖా అనే ప్రాంతంలో ఈ దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది. జిహాదీ జాన్ ఒక దేశం అని కాకుండా అన్ని దేశాలకు చెందిన బందీలను పశువులను వధించినట్లు వధించాడు. కువైట్ లోని ఇరాక్ కుటుంబంలో జన్మించిన ఎమ్వాజీ లండన్ లో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా పనిచేసి అనంతరం ప్రపంచంలోనే అతి క్రూరమైన ఉగ్రవాదిగా మారాడు.