కీవ్: రష్యాలోని సరిహద్దు ప్రాంతం కస్క్‌లో ఉక్రెయిన్ ఆకస్మిక సైనిక దాడులు చేసినట్టు అధ్యక్షుడు జెలెన్‌స్కీ నిర్ధారించారు. తమ సైన్యం పోరాటాన్ని రష్యా భూభాగంలోకి తీసుకెళ్లిందన్నారు. కస్క్‌లో తమ దళాలు ముందుకు దూసుకెళుతున్నాయని చెప్పారు. ఈ యుద్ధంతో రష్యా గడ్డపై ఉక్రెయిన్ చేసిన అతిపెద్ద దాడి ఇది.
దాడిలో బాలుడు సహా ముగ్గురు మృతి
ఆదివారం రాత్రి కీవ్‌పై రష్యా డ్రోన్, క్షిపణి దాడుల్లో ఓ నాలుగేళ్ల బాలుడు, మరో ఇద్దరు మరణించారు. 53 డ్రోన్లను కూల్చేసినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ దాడిలో రష్యా వాడిన క్షిపణులు ఉత్తరకొరియావని జెలెన్‌స్కీ అన్నారు.
అవును, రష్యాపై దాడి చేశాం: జెలెన్‌స్కీ
Published Mon, Aug 12 2024 6:30 AM | Last Updated on Mon, Aug 12 2024 1:03 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment