Russia Ukraine War Updates In Telugu: Ukraine Counter Attack On Russia - Sakshi
Sakshi News home page

Russia VS Ukraine: ఉక్రెయిన్‌తో యుద్ధం.. రష్యాకు షాక్‌!.. 5 విమానాలు, హెలికాప్టర్‌ కూల్చివేత

Published Thu, Feb 24 2022 11:39 AM | Last Updated on Thu, Feb 24 2022 2:20 PM

Russia Ukraine Lve Updates: Ukraine Launches Counter Attack On Russia - Sakshi

మాస్కో: రష్యా దాడులతో అప్రమత్తమైన ఉక్రెయిన్‌ ఎదురుదాడి ప్రారంభించింది. రష్యాకు ధీటుగా భారీగా బలగాలను మోహరించి కీలక ప్రాంతాల్లో తిరుగుబాటు మొదలు పెట్టింది. రష్యా ఫైటర్‌ జెట్‌ను ఉక్రెయిన్‌ బలగాలు కూల్చివేశాయి. 5 రష్యా విమానాలు, హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్‌ ప్రభుత్వం మార్షల్‌ లా విధించింది. పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని ఉక్రెయిన్‌ ఆదేశించింది. 

ఇది దురాక్రమణ చర్య: ఉక్రెయిన్‌
రష్యా దాడులపై ఉక్రెయిన్‌ స్పందించింది. రష్యా పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించిందని, ఇది దురాక్రమణ చర్యగా అధ్యక్షుడు జెలెన్‌స్కీ వర్ణించారు. శాంతియుత నగరాలపై దాడులకు పాల్పడుతున్నారని, ప్రపంచ దేశాలు పుతిన్‌ను నిలువరించాన్నారు. యుద్ధం ఆపడం ఐరాస బాధ్యతనని పేర్కొన్నారు. రష్యా దాడుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ముందుగా దౌత్యపరమైన ప్రయత్నాలే చేస్తామన్న జెలెన్‌ స్కీ.. రెండో ప్రణాళికగా బలగాలను దింపుతామని తెలిపారు.

రష్యా మిలిటరీ ఆపరేషన్‌ నేపథ్యంలో ఉక్రెయిన్‌ ప్రజలకు అధ్యక్షడు జెలెన్‌ స్కీ సందేశం అందించారు. రష్యా కేవలం సైనిక స్థావరాలపైనే దాడి చేస్తోందని, సైన్యం తన పని తాను చేసుకుబోతుందన్నారు. ఉక్రెయిన్‌ ప్రజలు భయాందోళనకు గురికావొద్దని తెలిపారు.

మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో అమెరికా ప్రెసిడెంట్‌ ఫోన్‌లో చర్చలు జరిపారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని జో బైడెన్‌ తెలిపారు. ఇప్పటికే ఉక్రెయిన్‌కు బ్రిటన్‌,ఫ్రాన్స్‌ మద్దతు తెలిపాయి. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో శుక్రవారం జీ-7 దేశాలతో జో బైడెన్‌ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. నాటో కూటమికి సహకరిస్తామని తెలిపారు. 

ఇప్పటి వరకు రష్యా దాడి చేసిన ఉక్రెయిన్‌ ప్రాంతాలు

కాగా రష్యా బలగాలు చుట్టుముట్టిన వేళ ఉక్రెయిన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. నెలరోజుల పాటు దేశమంతా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అయితే గురువారం తెల్లవారుజామున నుంచి రష్యా ఉక్రెయిన్‌పై భీకర దాడులు జరుపుతోంది. కీవ్‌, ఖర్కీవ్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌ను మూడు వైపుల రష్యా బలగాలు చుట్టుముట్టాయి. రష్యా దాడులతో కీవ్‌ ఎయిర్‌పోర్టును ఉక్రెయిన్‌ ఖాళీ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement