martial law
-
ద. కొరియాలో ముదురుతున్న సంక్షోభం
సియోల్(దక్షిణకొరియా): దేశవ్యాప్తంగా అత్యయిక స్థితి(మార్షల్ లా) ప్రకటన నేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కార్యాలయంలో సోదాలకు పోలీసులు సాహసించారు. అయితే అధ్యక్ష కార్యాలయం భద్రతా బలగాలు వెంటనే పోలీసులను అడ్డుకున్నారు. దీంతో యూన్ కార్యాలయ ప్రధాన భవనంలోకి పోలీసులు ప్రవేశించలేకపోయారు. దీంతో పౌర సేవల కార్యాలయాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆధిక్యత లేకపోవడంతో ఏ బిల్లును ప్రవేశపెట్టినా విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడం, పదవి నుంచి వైదొలగాలన్న డిమాండ్లను ఎదుర్కొంటున్న అధ్యక్షుడు యూన్ యోల్ ఇటీవల అనూహ్యంగా ‘మార్షల్ లా’ప్రకటించడం తెల్సిందే. తర్వాత విపక్షాలు పార్లమెంట్లో తీర్మానం చేసి ఎమర్జెన్సీని ఎత్తేయడం, అధ్యక్షుడు యూన్ సహా పలువురు దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం అధ్యక్షుడికి సంబంధించిన ఆఫీస్‌లలో పోలీసులు ఆకస్మిక సోదాలు చేశారు. దాడులు జరిగిన సమయంలో అధ్యక్షుడు యూన్ కార్యాలయంలో లేరు. యోన్‌కు సన్నిహితులైన పలువురు అధికారులు రాజీనామా చేశారు.మాజీ రక్షణ మంత్రి ఆత్మహత్యాయత్నం ‘మార్షల్ లా’విధించడానికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్‌ను పోలీసులు అరెస్ట్‌చేయగా అరెస్ట్‌పై మనస్తాపంతో ఆయన మంగళవారం రాత్రి జైలు గదిలో ఆత్మహత్యకు ప్రయతి్నంచినట్లు అధికారులు తెలిపారు. మార్షల్ లా విధించాలని సిఫార్సు చేసిన కిమ్‌ను రాజధాని సియోల్‌లో ఆదివారం అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. మంగళవారం అర్ధరాత్రి అధికారికంగా అరెస్టు వారెంట్ జారీ కాకముందే ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన బాత్రూమ్లో ఆత్మహత్యకు ప్రయతి్నంచగా జైలు అధికారులు ఆయనను వెంటనే అడ్డుకున్నారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడానే ఉందని రక్షణ శాఖ శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. కిమ్‌పై నేరాభియోగాలు మోపాలా వద్దా అనే దానిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 20 రోజుల్లోపు నిర్ణయం తీసుకోనున్నారు. మరోసారి అభిశంసన గత శనివారం అధ్యక్షుడిపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో ప్రధాన విపక్ష డెమొక్రటిక్ పార్టీ మరోసారి అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. మార్షల్ లా అమలు కోసం పనిచేసిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను దర్యాప్తు అధికారులు బుధవారం అరెస్ట్‌చేశారు. రెండోసారి అభిశంసన ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే ఈ ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్చేయడం గమనార్హం. -
అండర్‌వేర్‌తో మాజీమంత్రి ఆత్మహత్యాయత్నం!
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పోలీసుల సోదాలు కొనసాగుతున్నవేళ.. రక్షణ శాఖ మాజీ మంత్రి కిమ్ యోంగ్ హైయున్ అండర్‌వేర్‌తో ఆత్మహత్యాయత్నం చేశారు. విచారణ అధికారుల అదుపులో ఉన్న ఆయన.. కారాగారంలోనే ఈ ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.కిమ్ యోంగ్ హైయున్.. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు అత్యంత సన్నిహితుడు. సైనిక పాలన విధింపు ప్రకటన వెనుక ఈయన ప్రమేయమే ఉందనేది ప్రధాన ఆరోపణ. ఈ అభియోగంపై ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే సరిగ్గా అరెస్ట్‌కు ముందు బాత్రూంకు వెళ్లిన ఆయన.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో అధికారులు తలుపులు బద్ధలు కొట్టి చూశారు.అండర్‌వేర్‌తో ఆయన ఉరివేసుకునే ప్రయత్నం చేయగా.. అధికారులు నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని న్యాయ శాఖ తాజాగా పార్లమెంట్‌కు నివేదించింది.South Korean ex-defense minister Kim Yong-hyun Wednesday attempted suicide at detention facility, Yonhap news agency reported, citing a correction official. #SouthKorea https://t.co/QbHxSw64PA https://t.co/3Mat8pNHh2— 贺亮 (@HeLiang74893) December 11, 2024సైనిక పాలనపై నిర్వహించిన ఓటింగ్‌కు చట్ట సభ్యులు హాజరుకాకుండా వాళ్ల మీదకు భద్రతా బలగాలను ప్రయోగించాడనే అభియోగమూ ఉంది.దక్షిణ కొరియా డిసెంబర్ 3వ తేదీన ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ హఠాత్తుగా టీవీ ఛానెల్స్ ముందు ప్రత్యక్షమై.. అత్యవసర సైనిక పాలన ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు దాయాది దేశం ఉత్తర కొరియాతో చేతులు కలిపి కుట్రలకు తెర తీశాయని, అందుకే పరిస్థితి అదుపు తప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే దేశంలో అలజడి రేగింది. మరోపక్క.. ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షంలోని చట్ట సభ్యులూ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సంక్షోభం తలెత్తే ప్రమాదంతో.. చేసేది లేక కొన్నిగంటల తర్వాత ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంటూ ఆయన దేశానికి క్షమాపణలు చెప్పారు.అయితే ఈ అంశంపై ప్రత్యేక మండలి విచారణ జరపనుంది. ఈ మేరకు మంగళవారం చట్ట సభ్యులంతా ఆ కౌన్సిల్‌కు అనుమతులు జారీ చేశారు. సైనిక పాలన విధింపు ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనేది యూన్‌పై అభియోగం. అది గనుక రుజువైతే.. ఆయనకు మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: తప్పైంది.. నన్ను క్షమించండి -
పాక్ పరువు తీసిన ‘మార్షల్ లా’కు అంత పవర్ ఉందా?
రాజకీయాలపై ఆసక్తి కలిగినవారికి ప్రపంచ రాజకీయ చిత్రం ప్రతిరోజూ కొత్తగా కనిపిస్తుంది. తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ ఉన్నట్టుండి ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రపంచమంతా ఉలిక్కిపడింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కలకలం చెలరేగింది. అయితే ఇంతలోనే అక్కడి పార్లమెంట్లో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో దానిని రద్దు చేయాల్సి వచ్చింది.చర్చనీయాంశంగా మారి..1980 తర్వాత దక్షిణ కొరియాలో మార్షల్ లా(సైనిక పాలన) విధించడం ఇదే తొలిసారి. ఈ నేపధ్యంలో మరోసారి మార్షల్ లా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ఈ మార్షల్ లా చట్టాన్ని తరచూ అమలు చేసి, అపఖ్యాతి పాలయ్యింది. ఇంతకీ మార్షల్ లా అంటే ఏమిటి? అ చట్టాన్ని అమలు చేసినప్పుడు దేశంలోని పరిస్థితులు ఎలా ఉంటాయి?శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు..నిజానికి మార్షల్ లా అంటే దేశ అధికారమంతా సైన్యం చేతుల్లోకి వెళ్లడం. దేశంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు దీనిని అమలు చేస్తారు. ఇది దేశంలోని ఒక నిర్దిష్ట ప్రాంతానికి లేదా దేశమంతటికీ వర్తించవచ్చు. ఇది అమలైనప్పుడు పౌర పరిపాలన ముగుస్తుంది. శాంతి భద్రతల నుండి న్యాయ వ్యవస్థ వరకు సర్వం సైన్యం నియంత్రణలోకి వస్తుంది. అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్న సైన్యం అవసరమని భావించిన పక్షంలో ప్రధానిని ఉరితీసే దిశగా కూడా యోచించేందుకు ఈ చట్టంలో అవకాశాలున్నాయి. ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ పర్యవేక్షణలో..ప్రజలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో మార్షల్ లా వర్తిస్తుంది. ఇది యుద్ధం, తిరుగుబాటు లేదా పెద్ద ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో సంభవించవచ్చు. మార్షల్ లా అమలైనప్పుడు సైన్యం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది న్యాయపరమైన నిర్ణయాలను తీసుకుంటుంది. పాకిస్తాన్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు మార్షల్ లా ప్రయోగించడం ఆనవాయితీగా మారింది.పాక్‌లో నాలుగు సార్లు మార్షల్ లా పాకిస్తాన్లో ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు సార్లు మార్షల్ లా విధించారు. 1958లో మొదటిసారిగా, దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పటినప్పుడు నాటి అధ్యక్షుడు ఇస్కందర్ మీర్జా మార్షల్ లా విధించారు. అనంతరం మిలటరీ జనరల్ అయూబ్ ఖాన్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. తదనంతర కాలంలో దేశంలో సైనిక, రాజకీయ శక్తుల మధ్య విభేదాలు మొదలయ్యాయి.అడుగంటిన సామాన్యుల స్వేచ్ఛ1977, జూలై 5 న జనరల్ జియా-ఉల్-హక్ పాకిస్తాన్లో మార్షల్ లా విధించి, అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వాన్ని పడగొట్టాడు. జియా దేశ జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, తనను తాను అత్యున్నత పాలకునిగా ప్రకటించుకున్నాడు. రాజకీయ అస్థిరతతో పాటు సామాన్యుల స్వేచ్ఛ కూడా అడుగంటిపోవడంతో నాడు పాకిస్తాన్ గడ్డు రోజులను ఎదుర్కొంది. 1999లో పాకిస్తాన్లో మరోమారు మార్షల్ లా విధించారు. అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను తొలగించి, జనరల్ పర్వేజ్ ముషారఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈసారి కూడా రాజకీయ అస్థిరతను నెపంగా చూపారు. ఇతని పాలనలో సైనిక నియంతృత్వ పోకడ చాలా కాలం పాటు దేశంపై కొనసాగింది.జర్మన్, జపాన్లలో..మరికొన్ని దేశాలలోనూ మార్షల్ లా అమలయ్యింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, జర్మన్, జపాన్లలో సైన్యం పాలనను చేపట్టింది. ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో శ్రీలంకలో, యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో మార్షల్ లా విధించారు. అయితే పదే పదే మార్షల్ లా అమలు చేస్తూ పాకిస్తాన్ అపఖ్యాతి పాలైంది. ఈ చట్టం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంతగా నిర్వీర్యం చేస్తుందో పదే పదే మార్షల్ లా విధించడం చూస్తే అర్థమవుతుంది. మార్షల్ లా అమలు చేసేముందు పర్యవసానంగా వచ్చే దీర్ఘకాలిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల దక్షిణ కొరియా నిర్ణయం ద్వారా స్పష్టమైంది.ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే.. -
ఉక్రెయిన్‌తో యుద్ధం.. రష్యాకు షాక్!.. 5 విమానాలు, హెలికాప్టర్ కూల్చివేత
మాస్కో: రష్యా దాడులతో అప్రమత్తమైన ఉక్రెయిన్ ఎదురుదాడి ప్రారంభించింది. రష్యాకు ధీటుగా భారీగా బలగాలను మోహరించి కీలక ప్రాంతాల్లో తిరుగుబాటు మొదలు పెట్టింది. రష్యా ఫైటర్ జెట్‌ను ఉక్రెయిన్ బలగాలు కూల్చివేశాయి. 5 రష్యా విమానాలు, హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్ ప్రభుత్వం మార్షల్ లా విధించింది. పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని ఉక్రెయిన్ ఆదేశించింది. ఇది దురాక్రమణ చర్య: ఉక్రెయిన్ రష్యా దాడులపై ఉక్రెయిన్ స్పందించింది. రష్యా పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించిందని, ఇది దురాక్రమణ చర్యగా అధ్యక్షుడు జెలెన్స్కీ వర్ణించారు. శాంతియుత నగరాలపై దాడులకు పాల్పడుతున్నారని, ప్రపంచ దేశాలు పుతిన్‌ను నిలువరించాన్నారు. యుద్ధం ఆపడం ఐరాస బాధ్యతనని పేర్కొన్నారు. రష్యా దాడుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ముందుగా దౌత్యపరమైన ప్రయత్నాలే చేస్తామన్న జెలెన్ స్కీ.. రెండో ప్రణాళికగా బలగాలను దింపుతామని తెలిపారు. రష్యా మిలిటరీ ఆపరేషన్ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలకు అధ్యక్షడు జెలెన్ స్కీ సందేశం అందించారు. రష్యా కేవలం సైనిక స్థావరాలపైనే దాడి చేస్తోందని, సైన్యం తన పని తాను చేసుకుబోతుందన్నారు. ఉక్రెయిన్ ప్రజలు భయాందోళనకు గురికావొద్దని తెలిపారు. #AirRaid #sirens in #Kiev as the oligarchs and the elite flee the #country in the face of the advancing #Russian peacekeeping forces. #UkraineRussianConflict https://t.co/iNxZ7vnFk0 pic.twitter.com/mK3HaJtAgA — 🇦🇺 The Cynical Hun 🇭🇺 (@TheCynicalHun) February 24, 2022 మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడితో అమెరికా ప్రెసిడెంట్ ఫోన్లో చర్చలు జరిపారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని జో బైడెన్ తెలిపారు. ఇప్పటికే ఉక్రెయిన్‌కు బ్రిటన్,ఫ్రాన్స్ మద్దతు తెలిపాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శుక్రవారం జీ-7 దేశాలతో జో బైడెన్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. నాటో కూటమికి సహకరిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు రష్యా దాడి చేసిన ఉక్రెయిన్ ప్రాంతాలు Sound of an explosion in #Mariupol. Reports of explosions in #Kharkiv. #Russia announces military operations to demilitarise #Ukraine. Reporting from Groundzero. @aajtak @IndiaToday pic.twitter.com/2heTkRfIyx — GAURAV C SAWANT (@gauravcsawant) February 24, 2022 కాగా రష్యా బలగాలు చుట్టుముట్టిన వేళ ఉక్రెయిన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. నెలరోజుల పాటు దేశమంతా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అయితే గురువారం తెల్లవారుజామున నుంచి రష్యా ఉక్రెయిన్‌పై భీకర దాడులు జరుపుతోంది. కీవ్, ఖర్కీవ్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ను మూడు వైపుల రష్యా బలగాలు చుట్టుముట్టాయి. రష్యా దాడులతో కీవ్ ఎయిర్‌పోర్టును ఉక్రెయిన్ ఖాళీ చేసింది. BREAKING: Air raid sirens wail across Ukraine's capital pic.twitter.com/jclNZ5h7kx — BNO News (@BNONews) February 24, 2022 -
సైనిక పాలన కావాలంటూ పోస్టర్లు
పాకిస్థాన్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టి సైనిక పాలన విధించాలని అక్కడి ఆర్మీచీఫ్ జనరల్ రహీల్ షరీఫ్‌ను కోరుతూ 13 నగరాల్లో పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. లాహరో, కరాచీ, పెషావర్, క్వెట్టా, రావల్పిండి, ఫైసలాబాద్, సర్గోడా, హైదరాబాద్ నగరాలతో పాటు.. మరికొన్ని నగరాల్లో కూడా ఈ బ్యానర్లు కనిపించాయి. ‘మూవ్ ఆన్ పాకిస్థాన్’ అనే పార్టీ నేతృత్వంలో ఈ బ్యానర్లు పెట్టారు. ఇంతకుముందు ఇదే పార్టీ వాళ్లు షరీఫ్‌ను నవంబర్‌లో పదవీ విరమణ చేయొద్దంటూ ఓ చిన్నపాటి ఉద్యమమే నడిపించారు. అధికారుల ప్రభుత్వం ఇక చాలని.. ఆర్మీచీఫ్ నేతృత్వంలో సైనిక పాలన విధించాలని తమ పార్టీ కోరుకుంటున్నట్లు ‘మాప్’ సెంట్రల్ చీఫ్ ఆర్గనైజర్ అలీ హష్మీ తెలిపారు. జనరల్ రహీల్ షరీఫ్ స్వయంగా ప్రభుత్వాన్ని చూసుకోవాలని అన్నారు. దీనిపై ఆర్మీ అధికారిక వార్తా సంస్థ ఏమీ స్పందించకపోయినా.. అక్కడి రాజకీయ విశ్లేషకుడు అమీర్ రాణా మాత్రం ఇదంతా చూస్తుంటే త్వరలోనే సైనిక కుట్ర ఏదో జరగబోతోందన్న సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. రాత్రికి రాత్రే ప్రధాన నగరాలన్నింటిలో.. అందులోనూ కంటోన్మెంటు ప్రాంతాలలో కూడా ఈ పోస్టర్లు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు.