ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దక్షిణ కొరియా పౌరులు
సియోల్: దేశంలో స్వల్ప కాలం మార్షల్ లా అమలు చేసినందుకు అభిశంసనకు గురైన దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ వార్షిక వేతనం భారీగా పెరిగింది. అధికార ప్రమాణాలను అనుసరించి మూడు శాతం మేర పెరిగి రూ.1.27 కోట్ల నుంచి రూ.1.55 కోట్లకు చేరింది. యూన్‌కే కాదు, ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టి అభిశంసనకు గురైన తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్–సూకు వార్షిక వేతనంలో మూడు శాతం పెరిగి, రూ.1.19కోట్లకు చేరుకోవడం గమనార్హం.
యూన్‌ను డిసెంబర్‌లో పార్లమెంట్ అభిశంసించింది. దేశంలో తిరుగుబాటుకు యత్నించడం, అధికార దురి్వనియోగం ఆరోపణలపై దర్యాప్తు విభాగాలు అరెస్ట్‌కు చేస్తున్న యత్నాలను ఆయన అడ్డుకుంటున్నారు. ఫలితంగా దేశంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఆయనకు ఎలాంటి అధికారాలు లేనప్పటికీ అభిశంసనపై దక్షిణకొరియా రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించే వరకు అధికార నివాసం, కార్యాలయంలోనే కొనసాగేందుకు అవకాశముంటుంది.
సస్పెన్షన్‌కు గురైన అధ్యక్షుడికి ఇప్పటికీ వేతనం అందుకుంటున్న విషయం తెలీన ప్రజలు..తాజా పెంపు విషయం తెలిసి ఆగ్రహంతో ఉన్నారు. దేశంలో కనీస వేతనానికి రెట్టింపు మొత్తంలో యూన్ వేతనం పెరగడమేంటని ప్రశ్నిస్తున్నారు. సాధారణ ఉద్యోగులకు 1.7 శాతం మాత్రమే పెరగ్గా యూన్ 3%కి ఎలా పెంచుతారని నెటిజన్లు పళ్లు కొరుకుతున్నారు. ఈ నేపథ్యంలో యూన్‌ను ఎలాగైనా అరెస్ట్ చేసి తీరుతామని అవినీతి నిరోధక విభాగం స్పష్టం చేస్తోంది. ఈసారి పోలీసులను వెంటబెట్టుకుని వెళతామని, భద్రతా సిబ్బంది, ప్రజాప్రతినిధులు సహా అడ్డు వచి్చన వారిని సైతం అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment