South Korean president
-
యూన్ వేతనం పెరిగింది!
సియోల్: దేశంలో స్వల్ప కాలం మార్షల్ లా అమలు చేసినందుకు అభిశంసనకు గురైన దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ వార్షిక వేతనం భారీగా పెరిగింది. అధికార ప్రమాణాలను అనుసరించి మూడు శాతం మేర పెరిగి రూ.1.27 కోట్ల నుంచి రూ.1.55 కోట్లకు చేరింది. యూన్‌కే కాదు, ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టి అభిశంసనకు గురైన తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్–సూకు వార్షిక వేతనంలో మూడు శాతం పెరిగి, రూ.1.19కోట్లకు చేరుకోవడం గమనార్హం. యూన్‌ను డిసెంబర్లో పార్లమెంట్ అభిశంసించింది. దేశంలో తిరుగుబాటుకు యత్నించడం, అధికార దురి్వనియోగం ఆరోపణలపై దర్యాప్తు విభాగాలు అరెస్ట్‌కు చేస్తున్న యత్నాలను ఆయన అడ్డుకుంటున్నారు. ఫలితంగా దేశంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఆయనకు ఎలాంటి అధికారాలు లేనప్పటికీ అభిశంసనపై దక్షిణకొరియా రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించే వరకు అధికార నివాసం, కార్యాలయంలోనే కొనసాగేందుకు అవకాశముంటుంది. సస్పెన్షన్‌కు గురైన అధ్యక్షుడికి ఇప్పటికీ వేతనం అందుకుంటున్న విషయం తెలీన ప్రజలు..తాజా పెంపు విషయం తెలిసి ఆగ్రహంతో ఉన్నారు. దేశంలో కనీస వేతనానికి రెట్టింపు మొత్తంలో యూన్ వేతనం పెరగడమేంటని ప్రశ్నిస్తున్నారు. సాధారణ ఉద్యోగులకు 1.7 శాతం మాత్రమే పెరగ్గా యూన్ 3%కి ఎలా పెంచుతారని నెటిజన్లు పళ్లు కొరుకుతున్నారు. ఈ నేపథ్యంలో యూన్‌ను ఎలాగైనా అరెస్ట్ చేసి తీరుతామని అవినీతి నిరోధక విభాగం స్పష్టం చేస్తోంది. ఈసారి పోలీసులను వెంటబెట్టుకుని వెళతామని, భద్రతా సిబ్బంది, ప్రజాప్రతినిధులు సహా అడ్డు వచి్చన వారిని సైతం అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తోంది. -
ద. కొరియాలో ముదురుతున్న సంక్షోభం
సియోల్(దక్షిణకొరియా): దేశవ్యాప్తంగా అత్యయిక స్థితి(మార్షల్ లా) ప్రకటన నేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కార్యాలయంలో సోదాలకు పోలీసులు సాహసించారు. అయితే అధ్యక్ష కార్యాలయం భద్రతా బలగాలు వెంటనే పోలీసులను అడ్డుకున్నారు. దీంతో యూన్ కార్యాలయ ప్రధాన భవనంలోకి పోలీసులు ప్రవేశించలేకపోయారు. దీంతో పౌర సేవల కార్యాలయాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆధిక్యత లేకపోవడంతో ఏ బిల్లును ప్రవేశపెట్టినా విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడం, పదవి నుంచి వైదొలగాలన్న డిమాండ్లను ఎదుర్కొంటున్న అధ్యక్షుడు యూన్ యోల్ ఇటీవల అనూహ్యంగా ‘మార్షల్ లా’ప్రకటించడం తెల్సిందే. తర్వాత విపక్షాలు పార్లమెంట్లో తీర్మానం చేసి ఎమర్జెన్సీని ఎత్తేయడం, అధ్యక్షుడు యూన్ సహా పలువురు దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం అధ్యక్షుడికి సంబంధించిన ఆఫీస్‌లలో పోలీసులు ఆకస్మిక సోదాలు చేశారు. దాడులు జరిగిన సమయంలో అధ్యక్షుడు యూన్ కార్యాలయంలో లేరు. యోన్‌కు సన్నిహితులైన పలువురు అధికారులు రాజీనామా చేశారు.మాజీ రక్షణ మంత్రి ఆత్మహత్యాయత్నం ‘మార్షల్ లా’విధించడానికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్‌ను పోలీసులు అరెస్ట్‌చేయగా అరెస్ట్‌పై మనస్తాపంతో ఆయన మంగళవారం రాత్రి జైలు గదిలో ఆత్మహత్యకు ప్రయతి్నంచినట్లు అధికారులు తెలిపారు. మార్షల్ లా విధించాలని సిఫార్సు చేసిన కిమ్‌ను రాజధాని సియోల్‌లో ఆదివారం అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. మంగళవారం అర్ధరాత్రి అధికారికంగా అరెస్టు వారెంట్ జారీ కాకముందే ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన బాత్రూమ్లో ఆత్మహత్యకు ప్రయతి్నంచగా జైలు అధికారులు ఆయనను వెంటనే అడ్డుకున్నారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడానే ఉందని రక్షణ శాఖ శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. కిమ్‌పై నేరాభియోగాలు మోపాలా వద్దా అనే దానిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 20 రోజుల్లోపు నిర్ణయం తీసుకోనున్నారు. మరోసారి అభిశంసన గత శనివారం అధ్యక్షుడిపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో ప్రధాన విపక్ష డెమొక్రటిక్ పార్టీ మరోసారి అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. మార్షల్ లా అమలు కోసం పనిచేసిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను దర్యాప్తు అధికారులు బుధవారం అరెస్ట్‌చేశారు. రెండోసారి అభిశంసన ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే ఈ ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్చేయడం గమనార్హం. -
ద.కొరియా అధ్యక్షుడికి ఉపశమనం
సియోల్: ఎమర్జెన్సీ ప్రకటిస్తూ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఇంటాబయటా విమర్శలను ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు పదవీగండం కొద్దిలో తప్పింది. ఎమర్జెన్సీ(మార్షల్ లా) విధిస్తూ నిర్ణయం తీసుకుని దేశంలో రాజకీయ సంక్షోభానికి తెరలేపారని ఆరోపిస్తూ ఆయనపై విపక్షాలు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. 300 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో అభిశంసన తీర్మానం నెగ్గాలంటే మూడింట రెండు వంతుల మంది సభ్యులు అంటే కనీసం 200 మంది మద్దతు పలకాల్సి ఉంటుంది. శనివారం చేపట్టిన ఓటింగ్‌లో అభిశంసనను సమర్థిస్తూ కేవలం 192 ఓట్లు పడ్డాయి. యూన్‌కు చెందిన పీపుల్స్ పవర్ పార్టీ ఓటింగ్‌ను బహిష్కరించింది. వచ్చే బుధవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సెషన్లో మరోమారు అభిశంసన తీర్మానాన్ని పెట్టాలని విపక్ష పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. అంతకుముందు యూన్ మార్షల్ లా విధించడం తప్పేనంటూ ప్రజలకు బహిరంగ క్షమాపణ తెలిపారు. -
దక్షిణ కొరియా అధ్యక్షునికి ఎదురుదెబ్బ
సియోల్: పీపుల్ పవర్ పార్టీ నేత, దక్షిణ కొరియా దేశాధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ పరిపాలనకు రెఫరెండంగా భావిస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు తాజా సమాచారం ప్రకా రం 300 సీట్లకుగాను విపక్షాల కూటమి 175 చోట్ల విజయం సాధించింది. అధికార పీపుల్ పవర్ పార్టీ, దాని మిత్రపక్షం కలిపి 109 చో ట్ల గెలిచాయి. ప్రతిపక్షం గెలుపుతో అ ధ్యక్షుడిగా యూన్ సుక్కు కష్టాలు మొదలయ్యాయి. పార్లమెంట్లో ప్రతిపక్షం ఆధిప త్యం పెరిగిన నేపథ్యంలో అధ్యక్షుడికి కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. -
మూన్ జే-ఇన్ కీలక నిర్ణయం.. ఇక కుక్కల మాంసం బంద్!
సియోల్: దక్షణి కొరియా ప్రెసిడెంట్ మూన్ జే-ఇన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కుక్క మాంసం తినడాన్ని నిషేదిస్తున్నట్లు సోమవారం ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కుక్క మాంసం చాలాకాలంగా దక్షిణ కొరియా వంటకాలలో భాగంగా ఉంది. అక్కడ సంవత్సరానికి సుమారు 1 మిలియన్ కుక్కలు తింటారని అంచనా. అయితే మనుషులు కాలక్రమేణా పశువుల కంటే ఎక్కువగా జంతువులను సహచరులుగా చూస్తుండటంతో వీటి వినియోగం తగ్గింది. సోమవారం జరిగిన వారాంతపు సమావేశంలో మూన్ ప్రధానమంత్రి కిమ్ బూ-క్యూమ్తో మాట్లాడుతూ.. కుక్క మాంసం వినియోగం నిషేదించడాన్ని వివేకంతో పరిగణించాల్సిన సమయం రాలేదా? అంటూ ప్రశ్నించారు. మరోవైపు జంతు హక్కుల కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. దక్షిణ కొరియలో పెంపుడు జంతువులను పెంచకోవడం, ఇంట్లో కుక్కలతో నివసించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ ఒక ప్రసిద్ధ జంతు ప్రేమికుడు. ఆయన కార్యాలయంలో అనేక కుక్కలను పెంచుకుంటున్నారు. చదవండి: (సిక్కు మెరైన్‌కు తలపాగా ధరించే అవకాశం.. 250 ఏళ్ల చరిత్రలో) దక్షిణ కొరియా జంతు సంరక్షణ చట్టం.. ప్రధానంగా కుక్కలు, పిల్లుల క్రూరమైన వధను అడ్డుకోవడానికి ఉద్దేశించబడిందే కానీ వినియోగాన్ని నిషేధించదు. ఈ నెలలో చేసిన ఓ సర్వే రిపోర్ట్ ప్రకారం 78% మంది కుక్క, పిల్లి మాంసం ఉత్పత్తులను, విక్రయాలను నిషేదించాలని కోరగా, 49% మంది మాంసం వినియోగ నిషేదాన్ని సమర్థించారు. అయితే మాంసం విక్రేతలు తమ వృత్తిపై హక్కు కోసం పట్టుబడుతూ, వారి జీవనోపాధి ప్రమాదంలో ఉందని చెప్తున్నారు. చదవండి: (చైనాను బూచిగా చూపుతున్నాయి!) -
దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం
అధ్యక్షురాలిని పదవి నుంచి తొలగించిన రాజ్యాంగ న్యాయస్థానం సియోల్: అవినీతి ఆరోపణల నేపథ్యంలో అభిశంసనను ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గెన్ హేను అధికారికంగా పదవి నుంచి తొలగిస్తూ ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం చారిత్రక తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూటర్లు ఇప్పటికే పార్క్ పేరును నిందితుల జాబితాలో చేర్చడంతో ధర్మాసనం ఆమెపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌కు అనుమతిచ్చింది. పార్క్ చర్యలు రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమేనని, ప్రజల నమ్మకానికి ద్రోహం చేయడమే అని చీఫ్ జస్టిస్ జంగ్–మీ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కోర్టు ప్యానెల్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని పార్క్ గెన్ హేను పదవి నుంచి తొలగిస్తున్నామని ప్రకటించారు. తన స్నేహితురాలైన చోయ్ సూన్ సిల్‌తో కుమ్మక్కై పార్క్ అవినీతికి పాల్పడ్డారని, కంపెనీల నుంచి లక్షల డాలర్లను వసూలు చేశారని, చోయ్‌ను ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలుపంచుకునేలా అవకాశం కల్పించారని కోర్టు పేర్కొంది.