Russia-Ukraine war: రష్యాపై వందల డ్రోన్లతో ఉక్రెయిన్‌ ముప్పేట దాడి | Russia-Ukraine war: 125 Ukrainian drones reported in attack sparking fires across Russia | Sakshi
Sakshi News home page

Russia-Ukraine war: రష్యాపై వందల డ్రోన్లతో ఉక్రెయిన్‌ ముప్పేట దాడి

Published Mon, Sep 30 2024 5:10 AM | Last Updated on Mon, Sep 30 2024 5:10 AM

Russia-Ukraine war: 125 Ukrainian drones reported in attack sparking fires across Russia

కీవ్‌: రష్యా దురాక్రమణతో ఆగ్రహించిన ఉక్రెయిన్‌ మరోమారు డ్రోన్లతో ముప్పేట దాడికి తెగబడింది. డజన్ల కొద్దీ డ్రోన్లతో ఎదురుదాడిని పెంచింది. అయితే ఈ డ్రోన్లలో చాలావాటిని రష్యా విజయవంతంగా నేలకూల్చడంతో భారీ నష్టం ప్రాణ, ఆస్తినష్టం తప్పింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ మీదకు రష్యా దండయాత్ర  మొదలెట్టాక భారీ స్థాయిలో ఉక్రెయిన్‌ చేసి ప్రతిఘటనల్లో ఇదీ ఒకటని రక్షణ రంగ వర్గాలు చెబుతున్నాయి. 

అయితే అటవీప్రాంతంలో కూలిన డ్రోన్ల నుంచి చెలరేగిన మంటలతో కార్చిచ్చు వ్యాపించింది. ఒక భవనం అగ్నికీలల్లో చిక్కుకుపోయింది. రష్యావ్యాప్తంగా ఏడు రీజియన్‌లలో పెద్దసంఖ్యలో ఉక్రె యిన్‌ డ్రోన్లను ప్రయోగించిందని, వాటిలో 125 డ్రోన్లను నేలకూల్చామని రష్యా రక్షణ మంత్రిత్వి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక్క ఓల్గోగ్రేడ్‌ రీజియన్‌లోనే 67 శత్రు డ్రోన్లను పేల్చేశామని రష్యా తెలిపింది. ఓరోనెజ్, రస్తోవ్‌ ప్రాంతాల్లోనూ డ్రోన్ల దాడులు, వాటిని రష్యా గగనతల రక్షణ వ్య వస్థ కూల్చేసిన ఘటనలు నమోద య్యాయి. డ్రోన్ల మంటలు పడి దాదాపు 50 ఎకరాల్లో అడవి తగలబడిపోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement