మాస్కో: ఉక్రెయిన్(Ukraine) చేసిన డ్రోన్ దాడిలో తమ జర్నలిస్టు అలెగ్జాండర్ మరణించారని రష్యా(Russia)కు చెందిన మీడియా సంస్థ ఇజ్వెస్టియా తెలిపింది. డోనెస్క్ ప్రాంతంలో హైవేపై కారులో వెళుతుండగా అలెగ్జాండర్‌పై ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసినట్లు వెల్లడించింది. ఈ దాడిలో అలెగ్జాండర్‌తో పాటు మరో న్యూస్ ఏజెన్సీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులు గాయపడ్డారు.
ఇది కావాలని చేసిన దాడేనని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఓ ప్రకటనలో తెలిపారు. ఇది జెలెన్‌స్కీ ప్రభుత్వం చేసిన మరో దారుణ హత్య అని మండిపడ్డారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 15 మంది రష్యా జర్నలిస్టులు హత్యకు గురయ్యారని జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ తన నివేదికలో తెలిపింది.
2022 ఫిబ్రవరిలో మెదలైన రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యుద్ధం కొత్త ఏడాదిలో ముగుస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవలే ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ఈ యుద్ధం విషయంలో ఏం చర్యలు తీసుకుంటారన్నది కీలకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment