ఉక్రెయిన్‌పై 60 మిసైళ్లతో రష్యా భీకర దాడి | Russia Big Air Attack On Ukraine 60 Missiles Fired, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై 60 మిసైళ్లతో రష్యా భీకర దాడి

Published Sun, Nov 17 2024 12:06 PM | Last Updated on Sun, Nov 17 2024 3:03 PM

Russia Big air Attack on Ukraine 60 Missiles Fired

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా భారీ వైమానిక దాడి చేసింది. రాజధాని కీవ్‌పై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో రష్యా 60 క్షిపణులను ప్రయోగించింది. ఉక్రెయిన్‌పై ఇప్పటివరకు రష్యా జరిపిన దాడుల్లో ఇదే అతిపెద్దదిగా చెబుతున్నారు. ఈ దాడుల సమయంలో కీవ్‌ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలో తలదాచుకున్నారు. గత కొద్దిరోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా తరచూ దాడులు చేస్తూ వస్తోంది.

కీవ్ లోనే కాకుండా మరికొన్ని చోట్ల కూడా రష్యా దాడులు చేసింది. ఈ దాడులకు ఇరాన్ నుంచి తీసుకువచ్చిన డ్రోన్లను  రష్యా వినియోగించినట్లు సమాచారం. కీవ్‌లోని ప్రజలు ఇంకా బంకర్లలోనే  ఉన్నారని, వైమానిక దాడులు కొనసాగుతున్నంత కాలం వారు బంకుల్లోనే ఉండాలని  ఉక్రెయిన్‌ అధికారులు వారికి సూచించినట్లు తెలుస్తోంది.

మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జరిగిన ప్రాణనష్టంపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేవారు. ఈ యుద్ధాన్నిశాంతింపజేయడంపై  దృష్టి పెడతామని ట్రంప్‌ తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ట్రంప్  పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: సుదూర శ్రేణి హైపర్‌సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement