ప్రపంచ భౌగోళిక రాజకీయ వాతావరణం, గ్లోబల్‌గా జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో భారతనౌకాదళం తొమ్మిది రోజులపాటు నావికా విన్యాసాలు చేపట్టనుంది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అరేబియా మహాసముద్రంలో జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం 50కి పైగా దేశాల భాగస్వామ్యం కానున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా మిలిటరీ విన్యాసాలు పెంచడం కూడా ఇందుకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న 'మిలన్' విన్యాసాల్లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాలకు చెందిన నౌకాదళాలు పాల్గొంటాయని అధికారులు తెలిపారు.
భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ విన్యాసాల్లో భాగంగా అధునాతన వైమానిక రక్షణ కార్యకలాపాలు, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్, యాంటీ-సర్ఫేస్ డ్రిల్‌లు ఉంటాయని సమాచారం. మిలన్‌ను 1995లో భారత నావికాదళం ప్రారంభించింది. 2022లో 39 దేశాలు ఈ మిలన్‌లో పాల్గొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment