navy exercises
-
మెగా మిలిటరీ విన్యాసాలకు సిద్ధమవుతున్న ఇండియన్ నేవీ
ప్రపంచ భౌగోళిక రాజకీయ వాతావరణం, గ్లోబల్‌గా జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో భారతనౌకాదళం తొమ్మిది రోజులపాటు నావికా విన్యాసాలు చేపట్టనుంది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అరేబియా మహాసముద్రంలో జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం 50కి పైగా దేశాల భాగస్వామ్యం కానున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా మిలిటరీ విన్యాసాలు పెంచడం కూడా ఇందుకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న 'మిలన్' విన్యాసాల్లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాలకు చెందిన నౌకాదళాలు పాల్గొంటాయని అధికారులు తెలిపారు. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ విన్యాసాల్లో భాగంగా అధునాతన వైమానిక రక్షణ కార్యకలాపాలు, యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్, యాంటీ-సర్ఫేస్ డ్రిల్లు ఉంటాయని సమాచారం. మిలన్‌ను 1995లో భారత నావికాదళం ప్రారంభించింది. 2022లో 39 దేశాలు ఈ మిలన్లో పాల్గొన్నాయి. -
చైనాకు భయపడే భారత్ ఈ పని చేసిందా?
న్యూఢిల్లీ: చైనా వరుస హెచ్చరికలకు భారత్ తలొగ్గిందా?. తాజా పరిణామం ఈ విషయాన్నే సూచిస్తోంది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి సంయుక్త నేవీ కసరత్తుల్లో పాల్గొనాలనే ఆస్ట్రేలియా అభ్యర్ధనను భారత్ తిరస్కరించింది. దీనిపై మాట్లాడిన భారత్ నేవీ అధికారులు, దౌత్యవేత్తలు.. డ్రిల్స్‌పై చైనా చేసిన హెచ్చరికల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జులైలో జరిగే సంయుక్త కసరత్తులను వీక్షించేందుకు నేవీ నౌకలను పంపాలని అభ్యర్ధిస్తూ ఆస్ట్రేలియా రక్షణ మంత్రిత్వశాఖకు జనవరిలో ఓ లేఖను పంపింది. దీంతో భవిష్యత్తులో మిలటరీ విన్యాసాల్లో పాల్గొనే అవకాశం పూర్తి స్ధాయిలో కలుగుతుందని భారత నిపుణులు భావించారు. కానీ, దీనిపై మంగళవారం ప్రకటన చేసిన భారత అధికారులు సంయుక్త కసరత్తులను వీక్షించేందుకు భారత్ వెళ్లడం లేదని చెప్పారు. త్వరలో బంగాళాఖాతంలో జరగనున్న నేవీ కసరత్తులను వీక్షించేందుకు రావాలంటూ ఆస్ట్రేలియా చెంప చెళ్లుమనే ప్రకటన చేశారు. అయితే, ఆస్ట్రేలియా ఆహ్వానాన్ని తిప్పికొట్టడం వెనుక అసలు వేరే కథ ఉందని కొందరు అధికారులు అంటున్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో సముద్ర తీరాల్లో కార్యకలాపాలను చైనా మరింత ఉధృతం చేస్తుందనే భయంతోనే ఇలా చేశారని భావిస్తున్నారు. 2013 నుంచి దాదాపు ఆరు చైనా సబ్‌మెరైన్‌లో హిందూ మహాసముద్రంలో ఉంటున్నాయి. భారత్ ఈ సమావేశాలకు హాజరైతే చైనా సబ్మెరైన్ల సంఖ్యను పెంచే అవకాశం ఉండటంతోనే ప్రభుత్వం ఇలా చేసిందని మారిటైమ్ అబ్జర్వర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ హెడ్ అభిజిత్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే భారత్, చైనాల మధ్య భూభాగం, దలైలామా సమస్యలు ఉన్న విషయం తెలిసిందే.