చైనాకు భయపడే భారత్‌ ఈ పని చేసిందా? | Wary of China, India Turns Down Australia's Wargames Request | Sakshi
Sakshi News home page

చైనాకు భయపడే భారత్‌ ఈ పని చేసిందా?

Published Wed, May 31 2017 9:50 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM

చైనాకు భయపడే భారత్‌ ఈ పని చేసిందా?

చైనాకు భయపడే భారత్‌ ఈ పని చేసిందా?

న్యూఢిల్లీ: చైనా వరుస హెచ్చరికలకు భారత్‌ తలొగ్గిందా?. తాజా పరిణామం ఈ విషయాన్నే సూచిస్తోంది. అ​మెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలిసి సంయుక్త నేవీ కసరత్తుల్లో పాల్గొనాలనే ఆస్ట్రేలియా అభ్యర్ధనను భారత్‌ తిరస్కరించింది. దీనిపై మాట్లాడిన భారత్‌ నేవీ అధికారులు, దౌత్యవేత్తలు.. డ్రిల్స్‌పై చైనా చేసిన హెచ్చరికల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ ఏడాది జులైలో జరిగే సంయుక్త కసరత్తులను వీక్షించేందుకు నేవీ నౌకలను పంపాలని అభ్యర్ధిస్తూ ఆస్ట్రేలియా రక్షణ మంత్రిత్వశాఖకు జనవరిలో ఓ లేఖను పంపింది. దీంతో భవిష్యత్తులో మిలటరీ విన్యాసాల్లో పాల్గొనే అవకాశం పూర్తి స్ధాయిలో కలుగుతుందని భారత నిపుణులు భావించారు. కానీ, దీనిపై మంగళవారం ప్రకటన చేసిన భారత అధికారులు సంయుక్త కసరత్తులను వీక్షించేందుకు భారత్‌ వెళ్లడం లేదని చెప్పారు.

త్వరలో బంగాళాఖాతంలో జరగనున్న నేవీ కసరత్తులను వీక్షించేందుకు రావాలంటూ ఆస్ట్రేలియా చెంప చెళ్లుమనే ప్రకటన చేశారు. అయితే, ఆస్ట్రేలియా ఆహ్వానాన్ని తిప్పికొట్టడం వెనుక అసలు వేరే కథ ఉందని కొందరు అధికారులు అంటున్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లలో సముద్ర తీరాల్లో కార్యకలాపాలను చైనా మరింత ఉధృతం చేస్తుందనే భయంతోనే ఇలా చేశారని భావిస్తున్నారు.

2013 నుంచి దాదాపు ఆరు చైనా సబ్‌మెరైన్‌లో హిందూ మహాసముద్రంలో ఉంటున్నాయి. భారత్‌ ఈ సమావేశాలకు హాజరైతే చైనా సబ్‌మెరైన్‌ల సంఖ్యను పెంచే అవకాశం ఉండటంతోనే ప్రభుత్వం ఇలా చేసిందని మారిటైమ్‌ అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ హెడ్‌ అభిజిత్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే భారత్‌, చైనాల మధ్య భూభాగం, దలైలామా సమస్యలు ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement