![Donald Trump begins 12-day Asia trip, Japan first port of call - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/6/trump.jpg.webp?itok=SgVhVKT9)
వాషింగ్టన్: ఉత్తర కొరియా అణ్వాయుధాలను కచ్చితత్వంతో గుర్తించి, స్వాధీనం చేసుకోవడానికి సైనిక దాడి చేయడమే ఏకైక మార్గమని అమెరికా రక్షణ కార్యాలయం పేర్కొంది. అమెరికాతో యుద్ధం తలెత్తితే ఉ.కొరియా జీవ, రసాయన ఆయుధాలను ప్రయోగించే వీలుందని విశ్లేషించింది. ఈ మేరకు పెంటగాన్ అమెరికా చట్ట సభ్యులకు రాసిన లేఖలో...ఉ.కొరియాను ఎదుర్కొని, వారి అణ్వాయుధాలను ధ్వంసం చేయడానికి అమెరికాకున్న సామర్థ్యాలపై చర్చలు జరపడం గోప్యంగా ఉంచాల్సిన విషయమని అభిప్రాయపడింది.
అమెరికాను తక్కువ అంచనా వేయిద్దు: ట్రంప్
ఏ నియంత కూడా అమెరికాను తక్కువ అంచనా వేయొద్దని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఆసియా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం జపాన్ చేరుకున్నారు. టోక్యోలోని యొకోటా ఎయిర్ బేస్‌లో మాట్లాడుతూ...‘ఏ నియంత, ఏ ప్రభుత్వం, ఏ దేశం కూడా అమెరికా దృఢ సంకల్పాన్ని తక్కువగా చూడొద్దు’ అని అన్నారు. మరోవైపు, జపాన్ పర్యటనలో ఉన్న ట్రంప్.. జపాన్ ప్రధాని షింజో అబేతో భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment