ఉక్రెయిన్‌లో గెలుపు మాదే
రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలు
మాస్కో: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. గత నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ట్రంప్‌తో మాట్లాడలేదని ఆయన చెప్పారు. ట్రంప్ హయాంలో అమెరికా విధానాల్లో భారీగా మార్పులు రావొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. ఉక్రెయి న్‌లో విజయం సాధించబోతున్నామని, సిరియాలో ఆశించిన లక్ష్యం నెరవేరిందని చెప్పుకొచ్చారు.
గురు వారం దాదాపు నాలు గున్నర గంటలపాటు జరి గిన వార్షిక మీడియా సమావేశంలో ప్రజల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌కు కూడా పుతిన్ స్పందించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై మాట్లాడారు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు రావొచ్చునంటూ వార్తలు వస్తున్న వేళ పుతిన్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
నాలుగేళ్లుగా మేం మాట్లాడుకో లేదు
డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం ఎప్పుడుంటుందన్న ఎన్‌బీసీ ప్రతినిధి కెయిర్ సిమ్మన్స్ ప్రశ్నకు..‘మా సమావేశం ఎప్పుడు ఉండొచ్చో నాకు తెలియదు. ట్రంప్ కూడా ఈ విషయం ఎన్నడూ చెప్పలేదు. దాదాపు నాలుగేళ్లుగా మేం మాట్లాడుకున్నదీ లేదు. ట్రంప్ సానుకూలంగా ఉంటే చర్చలకు ఎప్పుడైనా నేను సిద్ధమే’అని అన్నారు. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం, సిరియా నుంచి రష్యా బలగాలు వైదొలగాల్సి రావడం వంటి పరిణామాలతో మీరు బలహీనపడినట్లుగా భావిస్తున్నారా అన్న ప్రశ్నకు..,గత రెండు, మూడేళ్లలో రష్యా మరింతగా బలం పుంజుకుంది.
ఎందుకంటే మేం మరింత స్వతంత్రంగా మారాం. ఎవరిపైనా ఆధారపడకుండా ముందుకు సాగుతున్నాం’అన్నారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులు అనూహ్యంగా మారి పోయాయి. యుద్ధక్షేత్రంలో రోజురోజుకూ చదరపు కిలోమీటర్ల కొద్దీ భూభా గాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగు తున్నాం’అన్నారు. అయితే, సరిహద్దుల్లో కస్క్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ దళాల నుంచి తిరిగి ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధాన మివ్వలేదు.
‘స్వాధీనం చేసుకుని తీరుతాం. ఫలానా సమయం కల్లా అది పూర్తవుతుందని మాత్రం చెప్పలేను’అని పేర్కొనడం గమనార్హం. తాజాగా ఆర్మీ అణు విభాగం చీఫ్ కిరిల్లోవ్ హత్యను ఆయన ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. సిరియా పదవీచ్యుత అధ్యక్షుడు అసద్ మాస్కోలోనే ఉన్నట్లు పుతిన్ ప్రకటించడం గమనార్హం. ఇప్పటి వరకు ఆయనతో సమావేశం జరగలేదని, కచ్చితంగా మాట్లాడతానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment