ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక | Thunderbolt Warnings In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

Published Sun, May 3 2020 5:39 PM | Last Updated on Sun, May 3 2020 8:45 PM

Thunderbolt Warnings In AP - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని.. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో రైతులు, కూలీలు, పశు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. 

శ్రీకాకుళం జిల్లాలో మెలియపుట్టి, పాతపట్నం టెక్కలి, నందిగం, పలాస, సోంపేట, కోటబొమ్మాలి, హిరమండలం, సర్వ కోట, కొత్తూరు, భామిని, సీతంపేట.. విజయనగరం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, పాచిపెంట, మెంటాడ, దత్తిరాజేరు, గంట్యాడ, రామభద్రపురం, సాలూరు, గజపతినగరం.. విశాఖ జిల్లాలో అనంతగిరి, అరకులోయ, దేవరపల్లి, హుకుంపేట పాడేరు, చీడికాడ.. గుంటూరు జిల్లాలో బొల్లపల్లి, వెల్దుర్తి, దుర్గి.. కర్నూలు జిల్లాలో ఆత్మకూరు, బండి ఆత్మకూరు, కొత్తపల్లె, ఓర్వకల్, హాలహర్వి, చిప్పగిరి మండలాల వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ కమిషనర్‌ హెచ్చరికలు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement