వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న రష్యాకు చైనా ఆయుధపరమైన సాయం అందించడం, అమెరికా భూభాగంపైకి నిఘా బెలూన్‌ను పంపించడంపై అమెరికా తీవ్ర నిరసన తెలిపింది. రష్యాకు సాయమందిస్తే ఆంక్షలు తప్పవని హెచ్చరించింది. జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, చైనా ఉన్నతస్థాయి దౌత్యవేత్త వాంగ్ యీతో శనివారం భేటీ అయ్యారు.
‘మా గగనతలంలోకి నిఘా బెలూన్‌ను పంపించడం అంతర్జాతీయ చట్టాలకు, మా సార్వభౌమత్వానికి భంగం కలిగించడమే. ఇలాంటి బాధ్యతారాహిత్య ఘటన పునరావృతం కారాదు’ అని బ్లింకెన్ స్పష్టం చేశారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆయుధ, ఇతరత్రా సాయం అందజేస్తే తీవ్ర ఆంక్షలు విధిస్తామని కూడా బ్లింకెన్ చెప్పారు. అయితే ఇలాంటి చర్యలతో అమెరికా తన బలం చూపాలనుకుంటే విరుద్ధ ఫలితాలే వస్తాయని వాంగ్ యీ బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment