Wang Yi
-
రష్యాకు సహకరిస్తే ఆంక్షలు తప్పవు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న రష్యాకు చైనా ఆయుధపరమైన సాయం అందించడం, అమెరికా భూభాగంపైకి నిఘా బెలూన్ను పంపించడంపై అమెరికా తీవ్ర నిరసన తెలిపింది. రష్యాకు సాయమందిస్తే ఆంక్షలు తప్పవని హెచ్చరించింది. జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, చైనా ఉన్నతస్థాయి దౌత్యవేత్త వాంగ్ యీతో శనివారం భేటీ అయ్యారు. ‘మా గగనతలంలోకి నిఘా బెలూన్ను పంపించడం అంతర్జాతీయ చట్టాలకు, మా సార్వభౌమత్వానికి భంగం కలిగించడమే. ఇలాంటి బాధ్యతారాహిత్య ఘటన పునరావృతం కారాదు’ అని బ్లింకెన్ స్పష్టం చేశారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆయుధ, ఇతరత్రా సాయం అందజేస్తే తీవ్ర ఆంక్షలు విధిస్తామని కూడా బ్లింకెన్ చెప్పారు. అయితే ఇలాంటి చర్యలతో అమెరికా తన బలం చూపాలనుకుంటే విరుద్ధ ఫలితాలే వస్తాయని వాంగ్ యీ బదులిచ్చారు. -
చైనా నేర్వాల్సిన పాఠం
భారత్–చైనాల మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ శుక్రవారం మన దేశం వచ్చారు. అయితే ఎప్పుడూ ఉండే హడావుడి ఈ సారి కనబడకపోవడం, ప్రభుత్వం సైతం ఆయన రాకకు పెద్దగా ప్రాధాన్యతనివ్వకపోవడం గమనించదగ్గ పరిణామం. సాధారణంగా ఇలాంటి పర్యటనలకు వారం పదిరోజుల ముందునుంచే మీడియాలో కథనాలు వెలువడతాయి. ఇరుదేశాల మధ్యా రెండున్నరేళ్లుగా ఉద్రిక్తతలు ఉన్నందువల్ల చర్చల ఫలితాలపై అందరిలో ఆసక్తి ఏర్పడు తుంది. ఈమధ్యే భారత్–చైనాల మధ్య సైనికాధికారుల స్థాయిలో సంప్రదింపులు జరిగినా ఎలాంటి పురోగతీ లేదు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర అనంతర పరిణామాల విషయంలో యాదృచ్ఛికం గానే కావొచ్చు.. మన దేశమూ, చైనా దాదాపు ఒకే రకమైన అడుగులు వేశాయి. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంతోపాటు భద్రతామండలి, ఇతర అంతర్జాతీయ సంస్థల్లో రష్యాను అభిశంసించే తీర్మానాలపై జరిగిన ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. మన దేశమైతే ‘ఉక్రెయిన్ పౌరుల తరలింపు, వారికి అందాల్సిన మానవతా సాయం’పై భద్రతా మండలిలో రష్యా ప్రతిపాదించిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు కూడా దూరంగా ఉంది. భారత్ – చైనాల ఆచరణలోని సామ్యాన్ని గమనించి ఇరు దేశాలూ భవిష్యత్తులో దగ్గర కావొచ్చని కొందరు భావించారు. అయితే మన నిర్ణయాలకు స్వీయ ప్రయోజనాలే గీటురాయి. రష్యాతో ఉన్న దౌత్య సంబంధాలు, ఇంధనం, రక్షణ తదితర అంశాల్లో ఆ దేశం అందిస్తున్న సహాయ సహకారాలు మన నిర్ణయాలను ప్రభావితం చేశాయి. చైనా తీరు వేరు. చైనా, రష్యాలు రెండూ గత కొన్నేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాయి. ఇక ఉక్రెయిన్‌లో రష్యా పెట్టిన కుంపటి వెనక చైనా పాత్ర ఉన్నదన్న సంశయం చాలామందిలో ఉండనే ఉంది. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో 2020 ఏప్రిల్‌లో అయిదు చోట్ల చైనా దళాలు ఎల్ఏసీని అతిక్రమిం చడం మనకు ఊహించని పరిణామం. అక్కడ గస్తీ తిరుగుతున్న మన జవాన్లపై అకారణంగా దాడి చేయడం, 21 మంది ప్రాణాలు తీయడం విషాదకర ఘటన. సరిహద్దు సమస్యలున్నా మూడు దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్యా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ సుహృద్భావ వాతా వరణాన్ని ఉన్నట్టుండి దెబ్బతీసింది చైనాయే. వాస్తవానికి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించు కునే ప్రయత్నం చేస్తూనే.. వాణిజ్య రంగంలో సహకరించుకుందామని, ఆర్థికంగా లాభపడదామని చైనా కోరినప్పుడు మన దేశం హృదయపూర్వకంగా స్వాగతించింది. రెండు దేశాల మధ్యా ఎన్నో ఒప్పందాలు కుదిరాయి. సహజంగానే వీటివల్ల అత్యధికంగా లాభపడింది ఆ దేశమే. సరిహద్దు ఘర్షణల తర్వాత ఆ దేశం సరుకులు బహిష్కరించాలన్న పిలుపులు వినబడినా, మన ప్రభుత్వం చైనా యాప్‌లు కొన్నింటిని నిషేధించినా 2020–21 మధ్య ఎగుమతులు, దిగుమతుల్లో వృద్ధి నమోదైంది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చైనా సరుకులపై అధిక సుంకాలు వేసినా దిగుమతులపై దాని ప్రభావం పెద్దగా పడలేదు. అంతక్రితం మన దేశం నుంచి చైనాకు 5.3 శాతంగా ఉన్న ఎగుమతులు 2020–21 మధ్య 7.3 శాతానికి ఎగబాకగా.. మన దిగుమతుల్లో చైనా వాటా అంతక్రితం కన్నా 3 శాతం పెరిగి 16.6 శాతానికి చేరింది. చైనాలో పరిశ్రమల సంఖ్య ఎక్కువ. పైగా కరోనా మహమ్మారి విసిరిన పంజాతో ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల లాక్డౌన్లు అమలై తయారీ రంగ పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కరోనా నుంచి అందరికన్నా ముందు తేరుకున్న చైనా యధాప్రకారం ఉత్పాదక రంగాన్ని పరుగులెత్తించింది. కనుక మన దేశం కూడా దానిపై ఆధారపడక తప్పలేదు. ఎల్ఏసీ వివాదం అనంతరం ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యాక నిరుడు ఫిబ్రవరిలో గాల్వాన్, ప్యాంగాంగ్ సో, స్పంగూర్ సో ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైన్యాలు వెనక్కి తగ్గాయి. ఆ ప్రాంతాల్లో గస్తీ తిరొగద్దని నిర్ణయిం చాయి. సైనికాధికారుల మధ్య అనంతర కాలంలో జరిగిన చర్చలు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేవు. పైగా కుదిరిన అవగాహనకు భిన్నంగా డెస్పాంగ్‌లో 900 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా తన అధీనంలోకి తీసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తర్వాత అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవచ్చని చైనా ఆశిస్తున్నట్టు కనబడుతోంది. భారత్‌తో మళ్లీ ‘సాధారణ సంబంధాలు’ పునరుద్ధరించుకోవాలని తహతహలాడుతోంది. అయితే అదంతా గతం. సరిహద్దుల స్థితిగతులే దేశాల మధ్య స్నేహ సంబంధాలను నిగ్గు తేలుస్తాయని జైశంకర్ ఆమధ్య తేల్చి చెప్పారు. వచ్చే జూన్‌లో చైనాలో బ్రిక్స్ దేశాల సదస్సు, ఆ తర్వాత భారత్, రష్యా, చైనాల శిఖరాగ్ర సదస్సు జరగాల్సి ఉంది. ఈ రెండింటిలో మన దేశం పాల్గొనడం అంతర్జాతీయంగా రష్యా, చైనాలకు ఎంతో అవసరం. వాటిల్లో పాల్గొనవద్దని అమెరికా, పాశ్చాత్య దేశాలు ఎటూ మన దేశంపై ఒత్తిళ్లు తీసుకొస్తాయి. ఆ అంశంలో అంతిమంగా మన నిర్ణయం ఏమిటన్న సంగతలా ఉంచి, ముందుగా ఎల్ఏసీలో చైనా దుందుడుకు పోకడలు విడనాడవలసి ఉంటుంది. వాంగ్ యీ ఈ విషయంలో ఏం హామీ ఇచ్చారో, ఎలాంటి ప్రతిపాదన తెచ్చారో చూడాల్సి ఉంది. అది త్వరలో జరిగే తదుపరి సైనికాధికారుల స్థాయి సమావేశంలో ప్రతిఫలిస్తుంది. ఒకసారంటూ సుహృద్భావ సంబంధాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తే వాటిని పునరుద్ధరించడం అంత సులభం కాదని చైనా గుర్తించకతప్పదు. -
మోదీతో చైనా విదేశాంగ మంత్రి 'ఓ మాట'.. ప్రధాని బిజీ బిజీ!
న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కావాలని భావించారు. అయితే ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ కారణంగా వాంగ్ యీతో మోదీ భేటీ సాధ్యపడదని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రధాని మోదీతో భేటీ కావాలన్న చైనా విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించింది. పాకిస్తాన్ పర్యటన ముగించుకుని గురువారం వాంగ్ యీ భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. మరుసటి రోజు(శుక్రవారం) ఆయన ప్రధాని మోదీతో భేటీ కావాలని భావించారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరు కావాల్సిన షెడ్యూల్ ముందుగానే ఖరారైంది. దీని కారణంగా చైనా విదేశాంగ మంత్రితో భేటీ సాధ్యం కాదని సున్నితంగా పేర్కొంది. శుక్రవారం వాంగ్ యీ భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సమయంలో కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాంగ్ యూ.. భారత్‌లో పర్యటించడం గమనార్హం. -
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటన
-
బోర్డర్లో భారత్‌తో కయ్యం.. అజిత్ ధోవల్‌కు చైనా ఆఫర్ ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య లఢక్ సహా మరిన్ని సరిహద్దు వివాదాస్పద ప్రాంతాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో భారత్ పర్యటనలో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. కాగా, శుక్రవారం విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో వాంగ్ యీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో.. పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. జైశంకర్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తోనూ సమావేశం అయ్యారు. మరోవైపు.. సమావేశంలో భాగంగా అజిత్ ధోవల్‌ను తమ దేశానికి రావాలంటూ చైనా విదేశాంగ మంత్రి ఆహ్వానం అందించారు. కాగా, ఆయన ఆహ్వానంపై అజిత్ ధోవల్ పాజిటివ్‌గా స్పందిస్తూ.. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు విజయవంతంగా పరిష్కారమైన తర్వాత కచ్చితంగా చైనాకు వస్తానని తెలిపారు. కాగా, ద్వైపాక్షిక సంబంధాలు బలపడాలంటే, లఢక్‌తో పాటు ఇతర వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా తమ దళాలను ఉపసంహరించాలని ధోవల్ ఈ సందర్భంగా వాంగ్ యీని కోరారు. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఉన్నాయని ఆమోదయోగ్యంగా లేవన్నారు. ఈ క్రమంలో శాంతి స్థాపనతోనే ఇరు వర్గాల మధ్య నమ్మకం ఏర్పడుతుందని రెండు దేశాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. 2020 జూన్ 15న భారత్, చైనా బలగాల మధ్య గాల్వాన్ లోయలో తలెత్తిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులవడంతో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. అప్పటి నుంచి ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నప్పటికీ.. అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. కాగా, గాల్వాన్ ఘటన తర్వాత సీనియర్ స్థాయి చైనా నేత భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక, రెండు రోజుల క్రితం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సమయంలో కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాంగ్ యూ.. తాజాగా భారత్‌లో పర్యటించడం గమనార్హం. ఢిల్లీకి రాకముందు వాంగ్ యి.. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో పర్యటించారు. -
కశ్మీర్‌పై చైనా వివాదాస్పద వ్యాఖ్యలు.. రెండు రోజులకే జై శంకర్‌తో భేటీ
న్యూఢిల్లీ: చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ శుక్రవారం విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ అయ్యారు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో.. పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భాగంగా పాకిస్థాన్ పర్యటన ముగించుకొని గురువారం సాయంత్రం వాంగ్ యీ ఢిల్లీ చేరుకున్నారు. జైశంకర్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్తోనూ సమావేశం అయ్యారు. అయితే పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సమయంలో కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాంగ్ యూ.. తాజాగా భారత్‌లో పర్యటించడం గమనార్హం. గల్వాన్ ఘటన తర్వాత సీనియర్ స్థాయి చైనా నేత భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. వాంగ్ యూ, జైశంకర్ భేటీలో ఇరు దేశాల సరిహద్దు సమస్యలు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.. అదే విధంగా ఆప్గనిస్తాన్‌లోని పరిస్థితిపై కూడా వారు చర్చించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగాం ఢిల్లీకి రాకముందు వాంగ్ యి తన మూడు రోజుల పాకిస్తాన్ పర్యటన తర్వాత అప్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో పర్యటించారు. దవండి: రాజ్యసభ ఎన్నికల్లో ‘ఆప్’ విజయం.. ఎంపీలుగా హర్భజన్, అశోక్ మిట్టల్... కాగా ఇస్లామాబాద్‌లో మంగళవారం పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ సహకార సంస్థ సదస్సులో ప్రసంగించిన వాంగ్ యీ జమ్మూకశ్మీర్ గురించి ప్రస్తావించారు. కశ్మీర్ విషయాన్ని ఓఐసీ సదస్సలు పలు ఇస్లామిక్ మిత్ర దేశాలు ప్రస్తావించాయని, చైనా కూడా అదే కోరుకుంటుందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన విషయాలు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారాలని, చైనాతో సహా ఇతర దేశాలకు మాట్లాడే హక్కు లేదని పేర్కొంది. భారత్ తమ అంతర్గత సమస్యలపై ఇతరుల జోక్యం కోరదని గ్రహించాలని తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే చైనా విదేశాంగ మంత్రి భారత్ పర్యటన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: foreign-minister -
మీరు వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: అమెరికాకు చైనా వార్నింగ్
బీజింగ్: చైనా - అమెరికాల తత్సంబంధాలు దెబ్బతినడంలో తైవాన్ కీలకం కానుంది. గత కొంతకాలంగా తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా జోక్యాన్ని సహించలేని చైనా.. తైవాన్‌కు మద్ధతు తెల్పడం ద్వారా అమెరికా వెలకట్టలేని మూల్యం చెల్లించాల్సి వస్తుందని చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగ మంత్రి వాంగ్ యి గురువారం మీడియా వేదికగా హెచ్చరించారు. తైవాన్ను తమ స్వంత భూభాగంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నట్లు చైనా ఈ సందర్భంగా పేర్కొంది. అంతేకాకుండా గత రెండేళ్లలో తన సార్వభౌమాధికారాన్ని నొక్కిచెప్పేందుకు తైవాన్ రాజధాని తైపీలో సైనిక, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచింది కూడా. తైవాన్ స్వతంత్ర దళాలను ప్రోత్సహించడం ద్వారా దానిని అత్యంత ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టడమే కాకుండా, అందుకు యూఎస్ వెలకట్టలేని మూల్యం చెల్లించాల్సి వస్తుందని వాంగ్ తాజాగా హెచ్చరించాడు. కాగా ఎటువంటి అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ అటు చైనా, ఇటు అమెరికా దేశాల మధ్య తైవాన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఐతే తైవాన్ ద్వీపం తమది స్వతంత్ర దేశమని, దాని స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలను పరిరక్షించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. మరోవైపు చైనా మాత్రం తమ భూభాగంలో కలవడం తప్ప తైవాన్‌కు వేరే మార్గం లేదని వాంగ్ తాజాగా ధీమా వ్యక్తం చేశాడు. ఐతే తైవాన్‌కు అంతర్జాతీయ మద్ధతుదారు, ఆయుధాల సరఫరాదారైన అమెరికా, తైవన్పై చైనా దాడి చేస్తే, తైవాన్ను రక్షించేందకు సైనికంగా జోక్యం చేసుకుంటుందా లేదా అనే విషయంపై చాలా కాలంగా అమెరికా వ్యూహాత్మక ధోరణిని అనుసరిస్తోంది. చదవండి: రానున్న 2, 3 రోజుల్లో చలిగాలులతో కూడిన వానలు: వాతావరణ శాఖ -
తూర్పు లద్దాఖ్‌లో శాంతితోనే సత్సంబంధాలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితి కొనసాగుతుండడం, బలగాల ఉపసంహరణ విషయంలో చైనా సానుకూల చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతికూలతలు నెలకొన్నాయని భారత్ చైనాకు స్పష్టం చేసింది. షాంఘై కోఆపరేషన్ కార్పొరేషన్(ఎస్సీఓ) సదస్సు సందర్బంగా బుధవారం దుషాంబెలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ల మధ్య ప్రత్యేకంగా సమావేశం జరిగింది. వాస్తవాధీన రేఖ వెంట ఎలాంటి ఏకపక్ష మార్పులను భారత్ అంగీకరించబోదని ఈ సందర్భంగా జై శంకర్ వాంగ్ యికి స్పష్టం చేశారు. తూర్పు లద్దాఖ్‌లో పూర్తి స్థాయిలో శాంతి నెలకొన్న తరువాతనే ఇరుదేశాల మధ్య సానుకూల సంబంధాలు సాధ్యమవుతాయన్నారు . రెండు దేశాల మధ్య మిలటరీ స్థాయిలో తదుపరి దశ చర్చలు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతం నుంచి ఫిబ్రవరిలో ఇరుదేశాల బలగాలు వెనక్కు వెళ్లిన తరువాత.. ఇతర వివాదాస్పద ప్రదేశాల నుంచి బలగాలను ఉపసంహరించే ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించడంతో ఇరుదేశాల సంబంధాలు దిగజారిన విషయాన్ని జైశంకర్ ప్రస్తావించారు. ‘తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొని ఉన్న మిగతా అన్ని సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం సాధించాల్సిన అవసరం ఉంది’ అని జై శంకర్ స్పష్టం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది. అఫ్గాన్‌లో శాంతి స్థాపనే లక్ష్యం ఉగ్రవాదాన్ని కలసికట్టుగా ఎదుర్కోవడం, ఉగ్ర సంస్థలకు ఆర్థిక సహకారాన్ని ఆపేయడం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) తప్పనిసరిగా చేయాలని జై శంకర్ అన్నారు. రష్యా, పాకిస్తాన్, చైనా విదేశాంగ మంత్రులతో కలిసి బుధవారం ఆయన ఎనిమిది సభ్య దేశాలు ఉన్న ఎస్సీఓ కీలక సదస్సులో పాల్గొన్నారు. -
పాక్, నేపాల్, అఫ్గాన్లకు అండగా చైనా
బీజింగ్: మహమ్మారి కరోనాపై పోరులో పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, నేపాల్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చైనా తెలిపింది. అదే విధంగా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా అన్ని విధాలుగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ప్రాణాంతక కోవిడ్-19 కట్టడికై పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు అఫ్గనిస్తాన్, నేపాల్, పాకిస్తాన్ మంత్రులతో సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ నాలుగు అంశాల ప్రణాళికను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహమ్మారిపై పోరులో నాలుగు దేశాలు ఒక్కటిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తిపై రాజకీయాలు, విమర్శలకు తావు ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఏకాభిప్రాయంతో ఐకమత్యంగా వైరస్ అంతానికి కృషి చేయాలన్నారు.(చైనా మరో ఎత్తుగడ.. బంగ్లాదేశ్‌కు మరిన్ని ప్రయోజనాలు!) అదే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు అన్ని విధాలుగా అండగా ఉండాలని సూచించారు. చైనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుందని.. పాక్, బంగ్లా, అఫ్గానిస్తాన్లకు ఈ టీకాను అందజేసి మహమ్మారిని అంతం చేసి, ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు వెన్నుదన్నుగా ఉంటామని భరోసా ఇచ్చారు. కరోనా కనుమరుగైన పోయిన తర్వాత చైనాకు అత్యంత ప్రాధాన్యాంశంగా ఉన్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ) ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మూడు దేశాలు సహకరించాలని వాంగ్ యీ విజ్ఞప్తి చేశారు. పనుల పునరుద్ధరణ, ఉత్పత్తి విషయంలో అండగా ఉండాలని.. తద్వారా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించుకోవచ్చని పేర్కొన్నారు. మధ్య ఆసియా ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొల్పేందుకు తాము కృషి చేస్తున్నామని, ఈ క్రమంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతూ ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. (‘చైనా, పాక్ రహస్య ఒప్పందాలు’) చైనాకు మద్దతు... ఇప్పటికే ఈ సమావేశంలో విదేశాంగ మంత్రులు మహ్మద్ అత్మార్ హనీఫ్(అఫ్గాన్), ప్రదీప్ కుమార్ గ్యావాలి(నేపాల్), పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ తరఫున ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి మఖ్దూం ఖుస్రో భక్తియార్ పాల్గొన్నారు. ఇక చైనా ప్రతిపాదించిన నాలుగు అంశాల ప్రతిపాదనకు మూడు దేశాలు సమ్మతించాయి. అదే విధంగా కరోనా కష్టకాలంలో తమకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపాయి. కాగా భారత్‌తో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న వేళ చైనా నిర్వహించిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చైనా- పాక్ ఎకనమిక్ కారిడార్(సీపెక్- పీఓకే గుండా).. అదే విధంగా ట్రాన్స్ హిమాలయన్ కనెక్టివిటీ నెట్వర్క్(టీహెచ్‌సీఎన్- టిబెట్ గుండా చైనా- నేపాల్‌ల మధ్య అనుసంధానానికై) గురించి చర్చించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్‌ను పూర్తిగా తనవైపునకు తిప్పుకొన్న డ్రాగన్.. తాజాగా భారత్ సరిహద్దు, మిత్ర దేశాలతో ఈ మేరకు భేటీ నిర్వహించడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. (మేడిన్ చైనా రామాయణం) భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలైన లిపులేఖ్, లింపియదుర, కాలాపానీలను నేపాల్ తన భూభాగంలోకి కలుపుతూ కొత్త మ్యాప్‌లు విడుదల చేయడం సహా న్యూఢిల్లీకి వ్యతిరేకంగా ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి తీవ్ర వ్యాఖ్యలు చేయడంలో డ్రాగన్ హస్తం ఉందనే అనుమానాలు తాజా భేటీతో మరింత బలపడ్డాయి. అదే విధంగా గల్వాన్ లోయలో భారత్ సైనికులకు పొట్టనబెట్టుకున్న చైనా.. ఆ మరుసటి రోజే బంగ్లాదేశ్‌కు వాణిజ్య ఒప్పందం కుదుర్చకున్న సంగతి తెలిసిందే. ఇక అఫ్గాన్‌తో సైతం సత్సంబంధాలు కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అదే విధంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికా.. చైనా, డబ్ల్యూహెచ్ఓపై ఆగ్రహం వ్యక్తం చేయడం, అఫ్గాన్ తాలిబన్లు, దక్షిణ చైనా సముద్ర జలాల విషయంలో అగ్రరాజ్య వైఖరి తదితర అంశాల నేపథ్యంలో డ్రాగన్ ఈ మేరకు భేటీ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. -
అమెరికాలో రాజకీయ వైరస్ వ్యాపిస్తోంది
బీజింగ్: అమెరికా, చైనా మధ్య సంబంధాలు రోజు రోజుకి క్షీణిస్తున్నట్టే కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ పుట్టుకపై అసత్యాలు ప్రచారం చేస్తూ ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బ తీయడానికి అమెరికా ప్రయత్నిస్తోందని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ఆరోపించారు. నేషనల్ పీపుల్స్ కాన్ఫరెన్స్ (ఎన్పీసీ) వార్షిక సమావేశాల సందర్భంగా ఆదివారం వాంగ్ వీడియో ద్వారా మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తిపై నిజాలు నిగ్గు తీయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అమెరికా, చైనా మధ్య సంబంధాలను దెబ్బ తీయడానికి అమెరికాలో కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయని, రెండు దేశాలను కోల్డ్ వార్ దిశగా నెట్టేయాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. ‘‘ఈ పొలిటికల్ వైరస్ ప్రతీ దానికి చైనాను వేలెత్తి చూపిస్తోంది. చైనాను దుయ్యబట్టడానికి వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటోంది. కొంత మంది రాజకీయ నాయకులు వాస్తవాలను చూడడానికి ఇష్టపడడం లేదు. వాస్తవాలను వక్రీకరిస్తూ మా దేశాన్ని టార్గెట్ చేస్తూ నిందలు మోపుతున్నారు. ఎన్నో కుట్రలు పన్నుతున్నారు’’అని యాంగ్ అన్నారు. కరోనా వైరస్ పుట్టుక, హాంగ్‌కాంగ్ స్వతంత్ర ప్రతిపత్తి దెబ్బతీసేలా చైనా పార్లమెంటులో బిల్లు పెట్టడం, వాణిజ్య ఒప్పందాల రగడ, మానవహక్కులు వంటి అంశాల్లో అమెరికా అ«ధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మాటల దాడిని పెంచిన నేపథ్యంలోనే వాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాధితుల్ని బ్లాక్ మెయిల్ చేస్తారా ? మిగిలిన దేశాల మాదిరిగానే తాము కూడా కరోనా వైరస్ బాధితులమేనన్న వాంగ్ చైనా నుంచి నష్టపరిహారాన్ని కోరుతూ అమెరికా కోర్టుల్లో దావాలు వేయడాన్ని తప్పు పట్టారు. అమెరికా తప్పుడు ఆధారాలతో బాధితుల్ని బ్లాక్ మెయిల్ చేస్తోందని మండిపడ్డారు. కరోనా వైరస్ అమెరికాలో విధ్వంసం సృష్టిస్తుంటే, మరోవైపు పొలిటికల్ వైరస్ కూడా దేశమంతా వ్యాపించిందని ఆయన విమర్శించారు. ఇది ఇరు దేశాలకు మంచిది కాదని హితవు పలికారు. కరోనా ఉమ్మడి శత్రువన్న వాంగ్ వైరస్‌పై తాము అమెరికాతో కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రపంచ దేశాలు విపత్తులో ఉన్న వేళ సమయాన్ని వృథా చేయకూడదని హితవు పలికారు. అమెరికా, చైనా కలసికట్టుగా తమ వ్యూహాలను పంచుకుంటూ కరోనాపై పోరాడాలని సూచించారు. -
సరిహద్దు వివాదం పరిష్కరించుకుందాం
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలను వేగవంతం చేయాలని భారత్, చైనాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకుని పురోగతే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించాయి. సరిహద్దు వివాదంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మధ్య 22వ దఫా చర్చలు శనివారం జరిగాయి. వివాద పరిష్కారం దిశగా వీరిద్దరూ నిర్మాణాత్మకంగా చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి. పరస్పర అభిప్రాయాలను గౌరవించుకోవాలని, పరస్పరం విశ్వాసం పెంపొందించుకోవాలని అంగీకారానికి వచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది. ‘భారత్–చైనా వ్యూహాత్మక సంబంధాల కోణంలో సరిహద్దు సమస్యను చూడాలని, సరిహద్దుల్లో శాంతి నెలకొల్పాలని ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాయి. భారత్–చైనాల సంబంధాల్లో సుస్థిర, సమతులాభివృద్ధి ఈ ప్రాంతంతోపాటు ప్రపంచ శాంతి, అభివృద్ధికి సానుకూలంగా మారుతుందనే అభిప్రాయాన్ని ఈ ప్రత్యేక ప్రతినిధుల భేటీ వ్యక్తం చేసింది’అని విదేశాంగ శాఖ తెలిపింది. సరిహద్దు వివాదంపై చర్చించేందుకు వాంగ్, దోవల్‌ను రెండు దేశాలు ప్రత్యేక ప్రతినిధులుగా నియమించాయి. వచ్చే ఏడాది చైనాలో 23వ దఫా భేటీ కావాలని కూడా ఇద్దరు ప్రతినిధులు నిర్ణయించారు. భారత్–చైనాల మధ్య 3,488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖపై వివాదం నలుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు టిబెట్ దక్షిణ ప్రాంతం కూడా తనదేనని చైనా వాదిస్తోంది. -
‘హద్దు’పై భారత్, చైనా చర్చలు
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇరుదేశాల ప్రతినిధులు శనివారం సమావేశం కానున్నారు. భారత్ తరఫున జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వాంగ్ యీ చర్చల్లో పాల్గొంటారని విదేశాంగ శాఖ తెలిపింది. సరిహద్దు సమస్యలపై జరిగే సమావేశానికి రెండు దేశాల తరపున ప్రత్యేక ప్రతినిధులుగా అజిత్ దోవల్, వాంగ్ యీ వ్యవహరిస్తున్నారు. అక్టోబర్‌లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చర్చల తరువాత చైనా నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఇక్కడకు వస్తుండటం గమనార్హం. ఢిల్లీలో శనివారం జరిగే సమావేశంలో ఇరుదేశాల ప్రతినిధులు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై మాట్లాడతారని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం 3,448 కిలోమీటర్ల పొడవైన వాస్తవ నియంత్రణ రేఖ వెంట ఉన్న సమస్యలపై ఇరుదేశాలు ఇప్పటికే 20 దఫాల చర్చలు జరిపాయి. -
చైనాకు పాక్ మంత్రి ఫోన్‌కాల్.. స్ట్రాంగ్ మెసేజ్!
బీజింగ్: దాయాది దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ బుధవారం అర్ధరాత్రి అత్యవసరంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ హికు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్‌కు చైనా విదేశాంగ మంత్రి గట్టి సందేశం ఇచ్చారు. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతను తప్పకుండా గౌరవించాలని పాక్‌కు హితవు పలికారు. అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనను చైనా హర్షించబోదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ బుధవారం భారత గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించి దుందుడుకు చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. సైనిక పోస్టులు లక్ష్యంగా దాడులు చేసేందుకు ప్రయత్నించి పాక్ విఫలమైందని భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఎఫ్-16 విమానాన్ని భారత్ కూల్చివేయగా.. భారత్‌కు చెందిన మిగ్ 21 బిసన్ విమానం పాక్‌లో కూలిపోయింది. ఈ విమానం నడుపుతున్న పైలట్ పాక్ సైన్యానికి బందీగా చిక్కాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి అత్యవసరంగా పాక్ విదేశాంగ మంత్రి వాంగ్ హికి ఫోన్ చేశారని, అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనలను చైనా హర్షించబోదని హి ఆయనతో పేర్కొన్నారని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చైనా పర్యటనను ముగించుకొని భారత్‌కు బయలుదేరిన తర్వాత పాక్ నుంచి చైనాకు ఫోన్‌కాల్ వెళ్లడం గమనార్హం. సుష్మా చైనా పర్యటన నేపథ్యంలో ఉగ్రవాదం విషయంలో పాక్ ధోరణిని తప్పుబడుతూ భారత్, చైనా, రష్యా ఉమ్మడి ప్రకటనను విడుదల చేసి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఈ 27న మోదీ, జిన్‌పింగ్‌ల భేటీ
న్యూఢిల్లీ/బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో భేటీ కానున్నారు. ఈ నెల 27న చైనాలోని హువాన్ నగరంలో మోదీ-జిన్‌పింగ్ సమావేశం అవుతారని కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది. నాలుగు రోజుల చైనా పర్యటనలో భాగంగా శనివారం సుష్మా బీజింగ్ చేరుకున్నారు. ఆదివారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ఆమె భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు. భారత్‌తో సరిహద్దు వివాదంపై చర్చించేందుకు ఓ ప్రత్యేక ప్రతినిధిని ఏర్పాటు చేసినందుకు చైనా మంత్రి వాంగ్‌ను కేంద్ర మంత్రి సుష్మా అభినందించారు. మానస సరోవర యాత్రకు వెళ్లే వారి కోసం నాథులా పాస్ మార్గాన్ని పున:ప్రారంభిస్తామని సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు సమస్య పరిష్కారానికి ముందడుగు పడనుందని ఇరుదేశాల అధికారులు భావిస్తున్నారు. ఇటీవల షాంఘైలో భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)కు చెందిన అధికారులు సమావేశమై సరిహద్దు సమస్యలపై చర్చించిన విషయం తెలిసిందే. -
చైనా రక్షణమంత్రిగా మిస్సైల్ ఎక్స్పర్ట్!
బీజింగ్: ప్రపంచంలో చైనాను మరింత శక్తిమంతంగా నిలిపేలా.. సమర్థవంతంగా, సేవా దృక్పథంతో పనిచేసేలా కొత్త మంత్రి వర్గాన్ని చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఏర్పాటుచేశారు. నలుగురు ఉప ప్రధానులతో పాటు 26 మంత్రిత్వ శాఖలు, కమిషన్లతో కూడిన కొత్త కేబినెట్‌కు చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. భారత్ సహా పలు సరిహద్దు దేశాలతో విభేదాల నేపథ్యంలో క్షిపణి రంగ నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ వై ఫెంఘేను రక్షణ శాఖ మంత్రిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాలో సైనిక ఆధునికీకరణ, పునర్వ్యవస్థీకరణకు ఆయన కృషి చేశారు. ఇక ఉప ప్రధాని ల్యూ హీ చైనా ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ప్రపంచంలో అమెరికా తర్వాత అతి పెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాలో 30 ఏళ్ల అనంతరం 2016లో వృద్ధి రేటు మందగించింది. చెన్ వెన్కింగ్కు అంతర్గత భద్రత వ్యవహారాలు అప్పగించగా.. సంస్కరణ వాదిగా పేరొందిన యీ గ్యాంగ్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్‌గా నియమితులయ్యారు. 15 ఏళ్లుగా గవర్నర్‌గా ఉన్న ఝౌ స్థానంలో గ్యాంగ్‌కు ఈ అవకాశం దక్కింది. విదేశాంగ మంత్రికి స్టేట్ కౌన్సిలర్ పదవి చైనా అత్యున్నత దౌత్య పదవి అయిన స్టేట్ కౌన్సిలర్‌గా విదేశాంగ మంత్రి వాంగ్ యిను నియమించారు. భారత్‌తో సరిహద్దు వివాదంలో చైనా ప్రతినిధిగా చర్చలకు ఆయన నాయకత్వం వహించనున్నారు. చైనాలో విదేశాంగ మంత్రి కన్నా స్టేట్ కౌన్సిలర్ పదవి పెద్ద ర్యాంకు. ఇటీవల కాలంలో చైనాలో ఏకకాలంలో రెండు పదవులను నిర్వహిస్తున్న మొదటి వ్యక్తి వాంగ్ కావడం గమనార్హం. -
భారత్ ఎంతో ముఖ్యమైన దేశం
బీజింగ్ : భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నట్లు చైనా మరోసారి స్పష్టం చేసింది. అసియాలోనే బలమైన దేశాలుగా భారత్-చైనాలు కలిసే ముందుకు సాగాలని చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యి అభిలషించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఏర్పడే చిన్నచిన్న సమస్యలను పక్కనపెట్టి ముందుకు సాగాలని ఆయన కోరారు. ఇరు దేశాల మధ్య అత్యంత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన డోక్లాం వివాదాన్నికూడా నిగ్రహంతో, దౌత్యపరంగానే చైనా పరిష్కరించుకుందని ఆయన చెప్పారు. ఇరు దేశాల మధ్య శాంతికి చైనా కృషి చేస్తుందన్నారు. డోక్లాం సరిహద్దులోకి భారత దళాలు అక్రమంగా ప్రవేశించినా.. చైనా ఉద్రిక్తతలు పెంచకుండా.. దౌత్యపరంగానే సమస్యను పరిష్కరించిందని చెప్పారు. భారత్-చైనా దేశాలు భవిష్యత్‌లో ప్రపంచాన్ని శాసించే అవకాశం ఉందని.. ఆయన చెప్పారు. గత అనుభవాల వల్ల ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక అనుమానాలు, సందేహాలు చాలానే ఉన్నాయని.. అయితే వాటిని నిరంతర చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని వాంగ్ తెలిపారు. ఇదిలా ఉండగా.. చైనా, రష్యా, భారత్ దేశాల చర్చల్లో భాగంగా వాంగ్ యి పాల్గొననున్నారు. డోక్లాం వివాదం తరువాత చైనా అత్యున్నత మంత్రి ఒకరు భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. -
సరిహద్దుపై అర్థవంతమైన చర్చలు సాగాలి: చైనా
బీజింగ్: చైనాతో సరిహద్దు వివాద పరిష్కారం కోసం ప్రశాంత వాతావరణంతో కూడిన అర్థవంతమైన విధానాన్ని భారత్ అవలంభించాలని ఆ దేశం సూచించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో సరిహద్దు వివాదంపై చైనా వైఖరి స్పష్టమని, ఎప్పటికీ మారదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు. ఇటీవల అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లను కలిపే బ్రిడ్జిని భారత ప్రధాని ప్రారంభించడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా భారత్‌లు సరిహద్దు సమస్యను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. సినో-ఇండియా సరిహద్దు తూర్పు భాగంపై తమ వైఖరి స్పష్టంగా ఉందని అన్నారు. -
చైనా అప్పుడలా.. ఇప్పుడిలా!
న్యూ ఢిల్లీ: అణు సరఫరా దేశాల కూటమి(ఎన్ఎస్జీ)లో సభ్యత్వం విషయంలో భారత్‌కు మోకాలడ్డిన చైనా.. ఇప్పుడు భారత సహాయం కోరుతోందా. అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి.. వచ్చేవారం ఢిల్లీకి రాబోతున్నారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీ వెనకున్న ప్రధాన ఉద్దేశం మాత్రం ఇటీవల దక్షిణ చైనా సముద్రం విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో చైనాకు తగిలిన ఎదురుదెబ్బే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో అంతర్జాతీయంగా చైనాకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆ సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని అమెరికాతో సహా చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో చిక్కుల్లో పడిన చైనా.. ఈ విషయంలో భారత్ సపోర్ట్‌ను కోరుకుంటుంది. అలా కాకున్నా.. మిగతా దేశాలతోపాటు బారత్ వ్యతిరేక స్వరం వినిపించకూడదని చైనా కోరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్‌లో చైనాలో జరగనున్న జీ 20 సదస్సులో ఇతర దేశాలతో పాటు.. బారత్ కూడా తమకు వ్యతిరేక గళం వినిపంచకుండా మోదీ, జి జిన్‌పింగ్‌ల మధ్య సమావేశానికి బ్యాక్‌గ్రౌండ్ సెట్చేయటమే.. వాంగ్ యీ భారత్ పర్యటన లక్ష్యం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
మీ నాయకత్వం భేష్!
మోడీకి చైనా అధ్యక్షుడి అభినందనలు పరస్పర అభివృద్ధికి కలసిపనిచేద్దామని పిలుపు సానుకూలంగా స్పందించిన మోడీ న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తరఫున ప్రత్యేక ప్రతినిధి, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి సోమవారం ప్రధాని మోడీని కలిసి, చైనా అధ్యక్షుడు పంపించిన ప్రత్యేక సందేశాన్ని అందించారు. భారత నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకి జిన్‌పింగ్ ఆ సందేశంలో శుభాకాంక్షలు తెలిపారు. మోడీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఇరుదేశాల మధ్య శాంతియుత సహకారాన్ని జిన్‌పింగ్ ఆశించారు. ‘మీ నాయకత్వంలో భారత్ అద్భుతమైన అభివృద్ధిని, ప్రగతిని సాధించగలదు. దీర్ఘకాల వ్యూహాత్మక సహకారంలో భారత్, చైనాలు భాగస్వాములు. రెండు దేశాల ప్రజల ప్రయోజనాలతో పాటు ఆసియాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ శాంతి, స్థిరత్వం, సౌభాగ్యం నెలకొనేందుకు కలిసి పనిచేద్దాం’ అని ఆ సందేశంలో అభిలషించారు. మోడీ, వాంగ్ యిలు దాదాపు 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. భేటీలో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా పాల్గొన్నారు. హ్యుయెన్‌త్సాంగ్ మా ఊరొచ్చారు భారత్ అభివృద్ధికి చైనా అన్ని విధాలుగా సహకరిస్తుందని వాంగ్ యి ఈ సందర్భంగా మోడీకి హామీ ఇచ్చారు. చైనా, భారత్‌ల మధ్య సహకార విస్తృతికి భారత్ సిద్ధంగా ఉందని భారత ప్రధాని మోడీ వాంగ్ యికి స్పష్టం చేశారు. ఆర్థిక భాగస్వాములుగా చైనా, భారత్‌లు సహకరించుకుంటే ఇరుదేశాలకు వాణిజ్య, పెట్టుబడుల రంగంలో ప్రగతి సాధ్యం కావడంతో పాటు ఆర్థికంగా ఆసియా మరింత బలోపేతమవుతుందని మోడీ వివరించారు. తీవ్రవాద వ్యతిరేక పోరులో పరస్పరం సహకరించుకోవాలని, సాంస్కృతిక సంబంధాలను మెరుగుపర్చుకోవాలని భారత ప్రధాని సూచించారు. ప్రాచీన కాలం నుంచి రెండు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలున్న విషయాన్ని మోడీ గుర్తుచేశారు. క్రీ. శ 7వ శతాబ్దంలో చైనా పండితుడు హ్యుయెన్‌త్సాంగ్ తన స్వగ్రామమైన వాద్‌నగర్‌కు వచ్చిన విషయాన్ని కూడా మోడీ తెలియజేశారు. మోడీ, వాంగ్ యిల మధ్య భేటీ నిర్మాణాత్మకంగా జరగిందని అధికార వర్గాలు తెలిపాయి. చైనా అధ్యక్షుడి నుంచి వచ్చిన సందేశానికి మోడీ సంతోషం వ్యక్తం చేశారన్నాయి. ఈ ఏడాది చివర్లోగా భారత్‌కు రావాల్సిందిగా చైనా అధ్యక్షుడికి తమ ప్రభుత్వం పంపిన ఆహ్వానాన్ని మోడీ ఆ దేశ విదేశాంగ మంత్రికి మరోసారి గుర్తు చేశారు. అలాగే చైనాలో పర్యటించాల్సిందిగా చైనా ప్రధానమంత్రి లీ కెక్వియాంగ్ తనకు పంపిన ఆహ్వానానికి కూడా మోడీ సానుకూలంగా స్పందించారు. చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్య పటిష్టతకు భారత్ చేపట్టదల్చుకున్న చర్యలను సోమవారం నాటి రాష్ట్రపతి ప్రసంగంలోనూ పొందుపర్చారు. మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయగానే ఫోన్ చేసి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపిన మొదటి విదేశీ నేత చైనా ప్రధానమంత్రి లి కెక్వియాంగ్నే కావడం గమనార్హం. రెండు దేశాల మధ్య చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై కలసి పనిచేద్దామని ఆ సందర్భంగా కెక్వియాంగ్ సూచించారు. 60 ఏళ్ల ‘పంచశీల’పై ప్రత్యేక కార్యక్రమం భారత తొలి ప్రధాని నెహ్రూ, చైనా ప్రధాని చౌ ఎన్‌లైలు రూపొందించిన ఐదు సూత్రాల పథకం ‘పంచశీల’కు అరవై ఏళ్లు నిండిన సందర్భంగా చైనాలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మోడీకి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఈ నెల 28న చైనా ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. బ్రెజిల్లో జులైలో జరగనున్న బ్రిక్స్ భేటీ సందర్భంగా చైనా అధ్యక్షుడితో మోడీ సమావేశమయ్యే అవకాశముంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ నాలుగుసార్లు చైనాలో పర్యటించారు. లోక్‌సభ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీ ఘనవిజయాన్ని చైనా మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. -
వాణిజ్యాన్ని బలోపేతం చేద్దాం
చైనా, భారత్ విదేశాంగ మంత్రుల నిర్ణయం సుష్మతో సమావేశమైన చైనా మంత్రి వాంగ్ యీ మోడీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత చైనాతో తొలి ఉన్నతస్థాయి సమావేశం న్యూఢిల్లీ: ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్-చైనా నిర్ణయించాయి. ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన తదితర రంగాల్లో పెట్టుబడులను గణనీయంగా పెంచాలని అవగాహనకు వచ్చాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఏటా ఉన్న 65 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని గణనీయంగా పెంచేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. ఆదివారమిక్కడ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమావేశమయ్యారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత భారత్-చైనా మధ్య జరిగిన తొలి ఉన్నతస్థాయి సమావేశం ఇది. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో వాణిజ్యంతోపాటు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ప్రధానంగా చర్చించారు. సరిహద్దు వివాదం, చొరబాట్లు, వీసాల మంజూరు, బ్రహ్మపుత్ర నదిపై జలాశయ నిర్మాణం, పెట్టుబడులు తదితర అంశాలపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. మంత్రులతోపాటు రెండు దేశాల విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు కూడా చర్చల్లో పాల్గొన్నారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇరుదేశాల్లో అభివృద్ధికి ఆస్కారం ఉన్న రంగాల్లో పురోగమిస్తూనే సరిహద్దులు వంటి సున్నిత అంశంపై ఒకరిపట్ల ఒకరు గౌరవప్రదంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. ఏటా పలు అంశాలపై రాష్ట్రపతి, ప్రధాని, మంత్రిత్వస్థాయిలో చర్చలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. కైలాస్ మానససరోవర్ యాత్రికుల సంఖ్య పెంచే విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని చైనాను సుష్మ స్వరాజ్ కోరినట్లు చెప్పారు. అలాగే చర్చల సందర్భంగా చైనా టిబెట్ అంశాన్ని లేవనెత్తినట్టు సమాచారం. ఈ విషయంలో తమ వైఖరి మారలేదని, టిబెట్‌ను చైనాలో భాగంగానే చూస్తున్నామని భారత్ స్పష్టంచేసింది. తమ భూభాగంలో చైనాకు వ్యతిరేకంగా టిబెటన్లు చేపట్టే కార్యక్రమాలను అనుమతించబోమని తెలిపింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు.