బీజింగ్ : భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నట్లు చైనా మరోసారి స్పష్టం చేసింది. అసియాలోనే బలమైన దేశాలుగా భారత్-చైనాలు కలిసే ముందుకు సాగాలని చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యి అభిలషించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఏర్పడే చిన్నచిన్న సమస్యలను పక్కనపెట్టి ముందుకు సాగాలని ఆయన కోరారు. ఇరు దేశాల మధ్య అత్యంత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన డోక్లాం వివాదాన్నికూడా నిగ్రహంతో, దౌత్యపరంగానే చైనా పరిష్కరించుకుందని ఆయన చెప్పారు. ఇరు దేశాల మధ్య శాంతికి చైనా కృషి చేస్తుందన్నారు.
డోక్లాం సరిహద్దులోకి భారత దళాలు అక్రమంగా ప్రవేశించినా.. చైనా ఉద్రిక్తతలు పెంచకుండా.. దౌత్యపరంగానే సమస్యను పరిష్కరించిందని చెప్పారు. భారత్-చైనా దేశాలు భవిష్యత్‌లో ప్రపంచాన్ని శాసించే అవకాశం ఉందని.. ఆయన చెప్పారు. గత అనుభవాల వల్ల ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక అనుమానాలు, సందేహాలు చాలానే ఉన్నాయని.. అయితే వాటిని నిరంతర చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని వాంగ్ తెలిపారు. ఇదిలా ఉండగా.. చైనా, రష్యా, భారత్ దేశాల చర్చల్లో భాగంగా వాంగ్ యి పాల్గొననున్నారు. డోక్లాం వివాదం తరువాత చైనా అత్యున్నత మంత్రి ఒకరు భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment