Doklam
-
ఎల్ఏసీ వెంట చైనా మోహరింపులు
వాషింగ్టన్: అది 2022 సంవత్సరం. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ. ఆ సమయంలో చైనా చడీచప్పుడూ లేకుండా వాస్తవాదీన రేఖ వెంబడి అన్నిరకాలుగా బలపడే ప్రయత్నాలు చేస్తూ వచి్చంది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్ వెంబడి సైనిక మోహరింపులను విపరీతంగా పెంచేసింది. డోక్లాం వెంబడి భూగర్భ నిల్వ వసతులను పటిష్టపరుచుకుంది. మరెన్నో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంది. పాంగాంగ్ లేక్ మీదుగా రెండో వంతెనతో పాటు డ్యుయల్ పర్పస్ ఎయిర్‌పోర్టు, మలి్టపుల్ హెలిపాడ్లను నిర్మించుకుంది. తూర్పు లద్దాఖ్ వెంబడి పలుచోట్ల కొన్నేళ్లుగా చైనా సైన్యం కయ్యానికి కాలుదువ్వడం, మన సైన్యం దీటుగా బదులివ్వడం తెలిసిందే. ముఖ్యంగా మూడేళ్లుగా అక్కడ ఇరు సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘చైనాలో సైనిక, భద్రతాపరమైన పరిణామాలు–2023’ పేరిట అమెరికా రక్షణ శాఖ తాజాగా ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. ‘2020 మే నుంచే భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తీవ్ర ఉద్రిక్త స్థాయికి చేరడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రెండు డివిజన్ల జిన్జియాంగ్, టిబెట్ మిలిటరీ డి్రస్టిక్ట్స్ దన్నుతో ఒక బోర్డర్ రెజిమెంట్‌నే ఏర్పాటు చేసింది. నాలుగు కంబైన్డ్ ఆర్మీ బ్రిగేడ్ (సీఏబీ) తదితరాలను 2022లో వాస్తవా«దీన రేఖ వెంబడి రిజర్వులో ఉంచింది. మరో మూడు సీఏబీలను ఇతర కమాండ్ల నుంచి తూర్పు సెక్టార్‌కు తరలించి సిద్ధంగా ఉంచింది. తర్వాత వీటిలో కొన్నింటిని వెనక్కు పిలిపించినా మెజారిటీ సేనలు ఇప్పటికీ వాస్తవా«దీన రేఖ వెంబడే మోహరించే ఉన్నాయి’ అని ఆ నివేదిక స్పష్టంచేసింది. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఇరు సైన్యాలు తీవ్ర ఘర్షణకు దిగడం తెలిసిందే. ఆ నేపథ్యంలో చైనా ఈ చర్యలకు దిగిందని నివేదిక వెల్లడించింది. ఈ మోహరింపులు ఇలాగే కొనసాగవచ్చని అభిప్రాయపడింది. ఇక భూటాన్ వెంబడి వివాదాస్పద ప్రాంత సమీపంలో చైనా ఏకంగా ఊళ్లనే ఏర్పాటు చేసిందని తెలిపింది. చైనా వద్ద 500 అణు వార్హెడ్లు! ప్రయోగానికి అన్నివిధాలా సిద్ధంగా ఉన్న అణు వార్ హెడ్లు చైనా వద్ద ఏకంగా 500 దాకా ఉన్నట్టు పెంటగాన్ నివేదిక పేర్కొంది. ‘గత రెండేళ్లలోనే ఏకంగా 100 వార్హెడ్లను తయారు చేసుకుంది. 2030 కల్లా వీటిని కనీసం 1,000కి పెంచడమే డ్రాగన్ దేశం లక్ష్యంగా పెట్టుకుంది’ అని నివేదిక వివరించింది. 300కు పైగా ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు తదితరాలు ఇప్పటికే చైనా అమ్ములపొదిలో చేరినట్టు వివరించింది. వాటిని దేశవ్యాప్తంగా మూడు చోట్ల అండర్‌గ్రౌండ్ వసతుల్లో అతి సురక్షితంగా ఉంచింది. ‘వీటితో పాటు సంప్రదాయ ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్ల తయారీని మరోసారి వేగవంతం చేసింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నావికా దళం ఇప్పటికే చైనా సొంతం. ఏడాదిలోనే 30 యుద్ధ నౌకలను నిర్మించుకుంది. దాంతో చైనా వద్ద మొత్తం యుద్ధ నౌకలు ఏకంగా 370కి చేరాయి. వీటిని 2025 కల్లా 400కు, 2030 కల్లా 450కి పెంచే యోచనలో ఉంది’ అని పేర్కొంది. ‘విదేశాల్లో సైనిక స్థావరాలను పెంచుకునేందుకు చైనా ముమ్మర ప్రయత్నాలు చేసింది. నైజీరియా, నమీబియా, మొజాంబిక్, బంగ్లాదేశ్, బర్మా, సాల్మన్ దీవులు, థాయ్‌లాండ్, తజకిస్థాన్, ఇండొనేసియా, పపువా న్యూ గినియా వంటి దేశాల్లో వ్యూహాత్మక సైనిక స్థావరాలను పెంచుకునేలా కనిపిస్తోంది’ అని నివేదిక తెలిపింది. -
‘డోక్లాం’ దేశ భద్రతకు పెనుముప్పు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: భారత సరిహద్దు ప్రాంతం డోక్లాం పీఠభూమి దగ్గర చైనా నిర్మాణాలు కొనసాగిస్తుండటంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘డోక్లాం పీఠభూమికి అత్యంత సమీపంలో చైనా మిలటరీ నిర్మాణాలపై భారత సైన్యం తాజాగా మరింత ఆందోళన వ్యక్తంచేసింది. ఒక్క అంగుళం భూమి కూడా ఎవరికో వదులుకునే ప్రసక్తి లేదని అమిత్ ప్రకటించారు. కానీ 2020 మే తర్వాత 2,000 కిలోమీటర్ల భారతభూభాగాన్ని గస్తీకాసే అవకాశాన్ని చైనా బలగాలు పోగొట్టాయి. మన డెప్సాంగ్, డెమ్చోక్, హాట్‌స్ప్రింగ్(కున్‌గ్రాంగ్ నళా), గోగ్రా పోస్టు వంటి పెట్రోలింగ్ పాయింట్లకు మన బలగాలు వెళ్లకుండా చైనా సైన్యం అడ్డుతగులుతోంది. దీనిపై మోదీ మౌనం వీడాలి’’ అని డిమాండ్ చేశారు. -
‘డోక్లాం’పై భూటాన్‌తో టచ్‌లో ఉన్నాం
న్యూఢిల్లీ: డోక్లాం అంశానికి సంబంధించి భూటాన్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా తెలిపారు. రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగెల్ వాంగ్‌చుక్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పలు ద్వైపాక్షిక అంశాలపై లోతుగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక బంధం బలోపేతానికి ఐదుసూత్రాల రోడ్‌మ్యాప్‌ను వాంగ్‌చుక్ ఈ సందర్భంగా ప్రతిపాదించారు. భేటీ వివరాలను క్వాట్రా మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డోక్లాంపై ప్రశ్నించగా ఆయన ఇలా స్పందించారు. భద్రతకు సంబందించిన అన్ని అంశాల్లోనూ ఇరు దేశాలు పరస్పరం సహకారం ఇచ్చి పుచ్చుకుంటున్నట్టు చెప్పారు. దీన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు భూటాన్ రాజు పర్యటన దోహదపడుతోందన్నారు. అసోంలోని కోక్రాఝార్ నుంచి భూటాన్‌లోని గెలెపు వరకు రైల్ లింక్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. ఇటీవలి కాలంలో భూటాన్ క్రమంగా చైనాకు దగ్గరవుతోందన్న అభిప్రాయాల మధ్య ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. వాంగ్‌చుక్‌తో చర్చలు ఫలప్రదంగా జరిగాయంటూ మోదీ ట్వీట్ చేశారు. ఆయన గౌరవార్థం విందు ఇచ్చారు. డోక్లాం.. అతి కీలకం వ్యూహాత్మకంగా డోక్లాం భారత్‌కు అత్యంత కీలకం. 2017లో అక్కడ భారత, చైనా సైనికులు ఏకంగా 73 రోజుల పాటు ఎదురెదురుగా మోహరించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడం తెలిసిందే. భూటాన్‌లో తమదిగా చెప్పుకుంటున్న ప్రాంతంలో రోడ్డు వేసేందుకు చైనా ప్రయత్నించడం ఘర్షణకు కారణమైంది. దాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భూటాన్‌కు చైనాతో 400 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. విపత్తుల స్పందనకు సమగ్ర వ్యవస్థ: మోదీ ప్రాకృతిక విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమగ్రమైన సన్నద్ధత వ్యవస్థ అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక ప్రాంతంలో తలెత్తే విపత్తులు దానికి సుదూరంలో ఉన్న ప్రాంతాలపై కూడా భారీ ప్రభావం చూపించే ఆస్కారముందని గుర్తు చేశారు. విపత్తుల నిర్వహణ సన్నద్ధత వ్యవస్థపై జరిగిన ఐదో అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కోవలిషన్ ఫర్ డిజాస్టర్ రెజీలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ)లో ఇప్పటికే 40 దేశాలు భాగస్వాములు కావడం హర్షనీయమన్నారు. ఈ విషయమై ఒక్క తాటిపైకి వచ్చేందుకు అభివృద్ధి చెందుతున్న చిన్న, పెద్ద దేశాలకు ఈ సదస్సు చక్కని వేదికగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. విపత్తు బాధితుల్లో ప్రతి ఒక్కరినీ పూర్తిస్థాయిలో ఆదుకునేలా వ్యవస్థను అభివృద్ధి చేసుకునే దిశగా కృషి జరగాలని ప్రధాని పిలుపునిచ్చారు. విపత్తుల వేళ తక్షణ ఉపశమనంతో పాటు సాధ్యమైనంత త్వరగా మామూలు పరిస్థితులు నెలకొనేలా చూడటంపై దృష్టి సారించాలన్నారు. ఇందుకు రవాణా సదుపాయాలతో పాటు సామాజిక, డిజిటల్ సదుపాయాలు కూడా చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. -
డోక్లామ్‌పై భూటాన్ ప్రధాని షాకింగ్ వ్యాఖ్యలు
ఆరేళ్లుగా డోక్లామ్ అంశంపై భారత్, చైనా బలగాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ అంశంపై ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది కూడా. ఈ నేపథ్యంలో భూటాన్ ప్రధాన మంత్రి లోటే షెరింగ్ చేసిన వ్యాఖ్యలు భారత్‌ని టెన్షన్లో పడేశాయి. ఇంతవరకు చైనా ఆ ప్రదేశంలోకి అక్రమంగా చోరబడుతోందని విశ్వసిస్తుంటే..ఈ వివాదం పరిష్కరించడంలో భాగమవ్వడానికి చైనాకు కూడా హక్కు ఉందని భూటాన్ ప్రధాని షెరింగ్ అన్నారు. దీనిపై చర్చించేందుకు తాము సిద్దంగానే ఉన్నామని, భారత్, చైనాలు కూడా రెడీగా ఉంటే చర్చింకుందాం. అయినా మూడు సమాన దేశాలే. ఇందులో పెద్ద లేదా చిన్నా దేశాలు లేవు కదా అని అన్నారు. ఒకరకంగా భూటాన్ తాను చర్చలకు సుముఖంగా ఉన్నట్లు నేరుగానే సంకేతమిచ్చింది. కాగా, భారత్, చైనా, భూటాన్ కూడలిలో ఉండే ప్రాంతమే డోక్లాం. దీన్ని ట్రై జంక్షన్ అని కూడా పిలుస్తారు. ఐతే ఈ ఎత్తైన పీఠభూమి(డోక్లాం) సిలిగురి కారిడార్‌కి సమీపంలో ఉంది. సరిగ్గా చైనా ఈ ప్రాంతంలో రోడ్డు పనులు చేపట్టి విస్తరించే యోచన చేసింది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించడమే గాక భారత్ బలగాలు ఆ పనులను అడ్డుకున్నాయి కూడా. వాస్తవానికి సిలిగురి కారిడార్ ఈశాన్య భారత రాష్ట్రాలను భారత్‌లోని మిగతా భూభాగంతో కలిపే ప్రాంతం. గతంలో 2019లో ఈ ట్రై జంక్షన్ పాయింట్ వద్ద ఏకపక్షంగా ఎటువైపు నుంచి ఎవరూ ఏమి చేయకూడదన్న ఒప్పందానికి భూటాన్ ప్రధాని షెరింగ్ చేసిన ప్రకటన చాలా విరుద్ధంగా ఉంది. దశాబ్దాలుగా ఈ ట్రై జంక్షన్ పాయింట్ అంతర్జాతీయ పటంలో బటాంగ్ లా ప్రదేశంలో ఉంది. ఈ ప్రాంతం చైనాకి ఉత్తరాన, భూటాన్‌కి ఆగ్నేయం, భారత్‌కి పశ్చిమాన ఉంది. అయితే చైనా ఆ ట్రై జంక్షన్‌ని బటాంగ్ లా నుంచి దక్షిణాం వైపు దాదాపు 7 కి.మీ దూరంలో ఉన్న మౌంట్ గిమ్‌మోచి అనే శిఖరానికి మార్చాలనుకుంటోంది. అదే జరిగితే మొత్తం డోక్లాం భూభాగం చైనాలో భాగమవుతుంది. ఇది భారత్‌కి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. చైనా 2017 నుంచి డోక్లాం విషయంలో వెనక్కి తగ్గినట్లే తగ్గి..డోక్లాం వెంబడి నేరుగా తూర్పున భూటాన్ భూభాగంలో ఉన్న అమోచు నది లోయం వెంబడి విస్తరించే యత్నం చేసింది. ఈ భూటాన్ భూభాగం గుండా అనేక గ్రామాల మధ్య చైనా రహదారిని నిర్మిచింది. తద్వారా భూటాన్ తన భూభాగాన్ని చైనా అప్పగించవలసి వచ్చిందన్న అక్కసుతో ప్రధాని షెరింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. భూటాన్ భూభాగంలోకి చైనా చొరబడిందని పలు వార్తలు వచ్చినప్పటికి భూటాన్ దాన్ని ఖండిస్తూ ఎలాంటి చొరబాటు జరగలేదని సమర్థించుకుంది. పైగా చైనా దొంగతనంగా ఆక్రమించిన భూభాగాలను భూటాన్ ప్రాంతాలు కాదని భూటాన్ వాదిస్తోందని భారత్ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు డాక్టర్ బ్రహ్మ చెల్లానీ అన్నారు. అంతేగాదు గతేడాది ఇరుపక్షాలు(చైనా, భూటాన్ నిపుణలు) కున్మింగ్లో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు 20 రౌండ్లకు పైగా చర్చలు జరిపింది. సానుకూల ఏకాభిప్రాయానికి వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు భూటాన్ పేర్కొంది. చైనాతో తనకు పెద్దగా సరిహద్దు సమస్యలు లేవని, ఇంకా కొన్ని భూభాగాలను గుర్తించలేకపోయినట్లు చెప్పుకొచ్చింది. పైగా ఒకటో, రెండో సమావేశాల తదనంతరం విభజన రేఖను ఏర్పాటు చేసుకుంటామంటూ.. చైనాను వెనకేసుకు వచ్చే యత్నం చేస్తోంది. (చదవండి: ఓ రేంజ్లో రివేంజ్ తీర్చుకున్న మహిళ.. ఏకంగా 20 ఏళ్లు కాపుగాసి..) -
ఆందోళన వద్దు.. చైనా కదలికలపై కన్నేశాం!
న్యూఢిల్లీ: డోక్లాం వద్ద చైనా కార్యకలాపాలపై ఆందోళన అక్కర్లేదని.. అవసరమైన నిఘా పెంచామని భారత ప్రభుత్వం పేర్కొంది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే పరిణామాలను ఉపేక్షించబోమని, అలాంటి వాటిని ఎప్పటికప్పుడు పసిగడుతున్నామని తెలిపింది కేంద్రం. అంతేకాదు.. దేశ భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి స్పష్టం చేశారు. డోక్లాం వద్ద భూటాన్ వైపున చైనా ఓ గ్రామాన్ని నిర్మిస్తున్నదని తాజా శాటిలైట్ ఇమేజ్‌లకు సంబంధించి అడిగిన ప్రశ్నకు బాగ్చి స్పందించారు. ‘పంగ్డా’ గా చైనా వ్యవహరిస్తున్న ఈ గ్రామం కిందటి ఏడాది నుంచి ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా అక్కడ ఇళ్ల ముందు కార్ పార్కింగ్‌కు సంబంధించి శాటిలైట్ ఇమేజ్‌లు సైతం బయటకు వచ్చాయి. మరోవైపు అక్రమంగా ఎన్నో నిర్మాణాలు చేపడుతోంది డ్రాగన్ కంట్రీ. దీంతో సరిహద్దు భద్రతపై భారత్‌లో ఆందోళన నెలకొంది. అయితే.. డోక్లాం సమీపంలో చైనా కార్యకలాపాలకు సంబంధించిన వార్తలపై తాను నిర్ధిష్ట వ్యాఖ్యలు చేయబోనని.. దేశ భద్రతకు విఘాతం కలిగించే చర్యలపై ప్రభుత్వం కన్నేసి ఉంచుతుందని, భద్రతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని అరిందం బాగ్చి స్పష్టం చేశారు. -
డోక్లాంలో చైనా గ్రామం.. ఖండించిన భూటాన్
న్యూఢిల్లీ : తమ భూభాగంలో చైనా ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసిందంటూ వస్తోన్న వార్తల్ని భూటాన్ ఖండించింది. అలాంటిది ఏం జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత భూటాన్ రాయబారి మేజర్ జనరల్ వెట్సాప్ నామ్‌గైల్ ‘మా భూభాగంలో చైనా గ్రామం ఏర్పాటు చేయడం వంటి చర్యలు ఏం జరగలేదు’ అని స్పష్టం చేశారు. ‘చైనా, భూటాన్ ప్రాదేశిక ప్రాంతంలోకి రెండు కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి ఓ గ్రామాన్ని ఏర్పాటుచేసింది’ అంటూ చైనాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ షెన్ షివే ట్వీట్ చేశారు. దీనిపై భారత్ భూటాన్ రాయబారి స్పందించారు. ‘నేను ఆ ట్వీట్‌ని చూశాను. ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ అది. ఇలాంటి ఊహాగానాల గురించి నేను పట్టించుకోను’ అన్నారు. ఇక చైనా తాజాగా ఏర్పాటు చేసినట్లు పేర్కొంటున్న గ్రామం మూడేళ్ల కిందట భారత్-చైనా సైన్యాలు ఘర్షణ పడిన డోక్లామ్కి సమీపంలోనే ఉండటం గమనార్హం. చైనా మీడియా సీజీటీఎన్ న్యూస్‌లోని సీనియర్ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వహిస్తోన్న షెన్ షివే ట్విట్టర్లో ‘ఇప్పుడు కొత్తగా స్థాపించబడిన పాంగ్డా గ్రామంలో శాశ్వత నివాసితులు నివసిస్తున్నారు. ఇది యాడోంగ్ కౌంటీకి దక్షిణాన 35 కిలోమీటర్ల దూరంలో లోయ వెంబడి ఉంది. డోక్లాం ప్రాంతం పరిష్కారం తరువాత ఖచ్చితమైన స్థానాన్ని సూచించింది’ అంటూ దీనికి సంబంధించిన ఫోటోలని ట్వీట్ చేశారు. అయితే, తర్వాత దాన్ని తొలగించారు. షెన్ షివే చేసిన ట్వీట్‌ను భారత్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు రీట్వీట్ చేశారు. ‘భూటాన్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందనడానికి ఇదే సాక్ష్యం’ అని తెలిపారు. ‘భారత్-చైనాల మధ్య కొనసాగిన డోక్లాం వివాదాస్పద ప్రాంతానికి 9 కిలోమీటర్ల దూరంలో ఇది ఉందని చైనా జర్నలిస్ట్ షేర్ చేసిన మ్యాప్‌ను బట్టి అర్ధమవుతుంది’ అన్నారు. అంతేకాదు, భూటాన్ భూభాగంలో రెండు కిలోమీటర్ల చొచ్చుకొచ్చినట్టు తెలియజేస్తుందని పేర్కొన్నారు. (చదవండి: సరిహద్దులో చైనా కొత్త ఎత్తుగడ) చైనా ‘ఐదు వేళ్ల’ వ్యూహం సరిహద్దు భూభాగాలపై కన్నేసిన చైనా వాటిని ఆక్రమిచుకోవడానికి ‘ఐదు వేళ్ల’ వ్యూహాన్ని అమలు చేస్తోది. దానిలో భాగంగా టిబెట్‌ని కుడి చేతి అరచేయిగా భావించగా.. లద్దాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ప్రదేశ్లని ఐదు వేళ్లలాగా భావిస్తోంది. ఇక బీజింగ్ ‘సలామి స్లైసింగ్’ వ్యూహాన్ని తాజాగా నేపాల్‌లో అమలు చేసి చేసింది. దానిలో భాగాంగా నేపాల్ భూభాగాన్ని డ్రాగన్ దేశం ఆక్రమించినట్లు సమాచారం. న్యూఢిల్లీ-ఖట్మాండ్ల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన సమయంలో డ్రాగన్ ఈ దుశ్చర్యకు పూనుకున్నట్లు తెలిసింది. ఇక ఈ చర్యలని ఉద్దేశిస్తూ ‘మావో కలని నిజం చేయడానికి జిన్‌పింగ్ కృషి చేస్తున్నాడని’ చైనా మీడియా ప్రశంసిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే భారత్ 17,000 అడుగుల ఎత్తులో లిపులేఖ్ ప్రాంతంలో రహదారి నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. దీని వల్ల కైలాస్ మానససరోవర యాత్రికులకు ప్రయాణ సమయం కలిసి వస్తుంది. (చదవండి: తప్పు ఒప్పుకున్న ట్విట్టర్ ) -
సరిహద్దులో చైనా కొత్త ఎత్తుగడ
న్యూఢిల్లీ: డోక్లాం పీఠభూమి ప్రాంతంలో అన్ని కాలాలలో రహదారి మార్గం సుగమం చేసుకోవడానికి రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను చైనా వేగవంతం చేసినట్లు ఎన్డీటీవీ సేకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా వెల్లడయ్యింది. ఈ ప్రాంతంలో 2017లో చైనా భారత్ మధ్య 70 రోజుల పాటు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలోని చైనా నిర్మాణ కార్మికులు ఉపరితల సొరంగమార్గాన్ని 500 మీటర్ల వరకు పొడిగించుకున్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. శీతాకాలంలో ఈ మార్గం అంతా మంచుతో కప్పబడి ఉంటుందని, దానికోసమే ఏ కాలంలోనైనా ప్రయాణించేలా ఈ రవాణా సౌకర్యాన్ని పెంచుకున్నట్లు స్పష్టమౌతోందని సైనిక నిపుణులు భావిస్తున్నారు. డోక్లాం పీఠభూమి తమ భూభాగంలోనిదేనంటూ చైనా, భూటాన్ ప్రకటించుకుంటున్నాయి. ఈ విషయంలో భారత్, భూటాన్‌కి మద్దతిస్తోంది. -
డోక్లాం వద్ద చైనా మిస్సైల్ బేస్‌ల నిర్మాణం!
న్యూఢిల్లీ/బీజింగ్: భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న వివాదాలకు పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు కొనసాగుతున్న వేళ డ్రాగన్ మరోసారి దుందుడుకు వైఖరిని ప్రదర్శించింది. ఇప్పటికే వాస్తవాధీన రేఖ వెంబడి 5జీ నెట్వర్క్ ఏర్పాటు ప్రయత్నాలతో పాటుగా ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద కొత్తగా నిర్మాణాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మరో దూకుడు చర్యకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలు బయటకు వచ్చాయి. వీటి ద్వారా డోక్లాం, నకు లా, సిక్కిం సెక్టార్ల వద్ద డ్రాగన్ కొత్తగా రెండు ఎయిర్ డిఫెన్స్ స్థావరాలు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. డోక్లాం పీఠభూమిలో భారత్- చైనా-భూటాన్ ట్రై జంక్షన్లో ఆర్మీ కార్యకలాపాలకు వీలుగా కొత్త నిర్మాణాలు చేపట్టినట్లు స్పష్టమవుతోంది. (చదవండి: చైనాను వణికిస్తోన్న సమాధి ఫోటో..) మూడేళ్ల క్రితం భారత్- చైనాల మధ్య ఘర్షణలకు దారి తీసిన సమస్యాత్మక ప్రాంతాలకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఈ మేరకు ఎయిర్ ఢిపెన్స్ బేస్‌లను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. డెట్రెస్ఫా పేరిట ఓపెన్ సోర్స్ ఇంటెలిజిన్స్ అనలిస్ట్ ట్విటర్లో షేర్ చేసిన ఫొటోలు, వివరాల ప్రకారం.. లక్ష్యాలను పక్కాగా ఛేదించేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధునాతన క్షిపణులను ప్రయోగించేందుకు వీలుగా ఈ స్థావరాలను అభివృద్ధి చేస్తోంది.(చదవండి: మారని డ్రాగన్ తీరు.. 5జీ నెట్వర్క్, సరికొత్త నిర్మాణాలు!) Investigations with @SimTack of the #Doklam region in the #China, #Bhutan, #India tri junction area present new evidence of PLA air defense infrastructure being constructed roughly 50 Kms from known clash points of the #IndiaChinaStandoff of 2017 & 2020 pic.twitter.com/5JWFZaoXrX — d-atis☠️ (@detresfa_) August 28, 2020 ఇక ఇప్పటికే బలగాల ఉపసంహరణ విషయంలో చైనా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తూర్పు లదాఖ్‌లోని ఫింగర్ 5,8 ఏరియాల్లో డ్రాగన్ తన బలాన్ని మరింత పెంచుకున్నట్లు సమాచారం. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో పడవలు తరలించి, గుడారాలు నిర్మించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో డోక్లాం వద్ద కూడా చైనా కవ్వింపు చర్యలకు దిగడం చూస్తుంటే ఇరు దేశాల వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 2017తో డోక్లాం విషయంలో భారత్- చైనాల మధ్య సుమారు 73 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. అనేక చర్చల అనంతరం అప్పటి వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. -
చైనా దూకుడు: మళ్లీ అదే టీం రంగంలోకి?!
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన విషయం విదితమే. డ్రాగన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడం సహా... రక్షణ దళాల మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టుల్ని యథాతథంగా కొనసాగించేందుకు అవలంబించాల్సిన విధానాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో దౌలత్ బేగ్ ఒల్డీ(డీబీఓ) సెక్టార్ వెంబడి చేపట్టిన నిర్మాణాలను పూర్తి చేసి తీరతామని అధికార వర్గాలు వెల్లడించాయి. (చైనా కవ్వింపు చర్యలపై ఆర్మీ కమాండర్ల భేటీ) ‘‘ఆస్ట్రేలియా నుంచి హాంకాంగ్ దాకా.. హాంకాంగ్ నుంచి తైవాన్, తైవాన్ నుంచి దక్షిణ చైనా సముద్రం.. అక్కడి నుంచి అమెరికా దాకా.. ఇలా ప్రపంచవ్యాప్తంగా చైనా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. ఏదేమైనా డర్బుక్-ష్యోక్-డీబీఓ వద్ద చేపట్టిన రోడ్డు నిర్మాణం ఈ ఏడాదికల్లా పూర్తవుతుంది. తద్వారా సరిహద్దుల వద్ద భారత్ మరింత ఎక్కువ బలగాలను మోహరించే అవకాశం లభిస్తుంది. ఒకవేళ ఆ రోడ్డును బ్లాక్ చేస్తే భారత ఆర్మీ సన్సోమా నుంచి ముర్గో- డీబీఓ మీదుగా హిమనీనదాల వెంబడి బయటకు రావాల్సి ఉంటుంది. అయితే చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి రహదారి పూర్తి చేయాల్సి ఉంది’’ అని ప్రధాని మోదీతో సమావేశంలో పాల్గొన్న ఓ అధికారి వెల్లడించారు. (హద్దు మీరుతున్న డ్రాగన్) ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి తలెత్తిన వివాదాన్ని పరస్పర గౌరవమర్యాదలతో కూడిన శాంతియుత చర్చల ద్వారానే వివాదాన్ని పరిష్కరించుకోవడానికి భారత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డోక్లాం వివాద సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించి ఉద్రిక్తతలను అదుపులోకి తీసుకువచ్చిన తన టీంను ప్రధాని మోదీ మరోసారి రంగంలోకి దించే అంశంపై మంగళవారం నాటి సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, విదేశాంగ మంత్రి జైశంకర్‌ను తాజా పరిస్థితులపై చైనాతో చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా డోక్లాం వద్ద ప్రతిష్టంభన తలెత్తిన సమయంలో ఆర్మీ చీఫ్‌గా ఉన్న బిపిన్ రావత్, విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్ కీలక బాధ్యతల్లో ఉన్న విషయం తెలిసిందే. డ్రాగన్ ఉద్దేశపూర్వకంగానే.. ఇక ప్రపంచమంతా మహమ్మారి కరోనా పుట్టుకకు చైనానే కారణమంటూ విమర్శలు గుప్పిస్తున్న వేళ భారత సరిహద్దుల్లో డ్రాగన్ కవ్వింపు చర్యలకు పాల్పడటం గమనార్హం. కోవిడ్‌పై పోరులో భారత్ తలమునకలై ఉండటం, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్- బాల్టిస్తాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతున్న తరుణంలో.. చైనా ఉద్దేశపూర్వంగానే 2017 నాటి డోక్లామ్ తరహా వివాదాన్నితెరమీదకు తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది. లదాఖ్ సరిహద్దుల్లో వైమానిక స్థావరం విస్తరించడంతో పాటుగా.. పాంగాంగ్ సరస్సు ప్రాంతానికి 200 కి.మీ. దూరంలో ఎయిర్ బేస్‌ను నిర్మించేందుకు సన్నద్ధం కావడం చైనా ప్లాన్‌లో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. -
డొక్లాంలో చైనా.. అడ్డగించని భారత్ : అమెరికా
న్యూఢిల్లీ : డొక్లాం సరిహద్దు ప్రాంతంలో చైనా చాప కింద నీరులా ప్రవేశించిందని, దీన్ని భారత్, భూటాన్లలో ఎవరూ ప్రతిఘటించలేదని అమెరికా పేర్కొంది. గురువారం ఈ మేరకు అమెరికా అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో మాట్లాడిన దక్షిణ, మధ్య ఆసియాల ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎలైస్ జీ వెల్స్ భారత్ సరిహద్దులో రోడ్లను నిర్మించడాన్ని చైనా వేగవంతం చేసిందని పేర్కొన్నారు. దాంతో కాంగ్రెస్ సభ్యురాలు వాగ్నర్ మాట్లాడుతూ దక్షిణ చైనా సముద్రాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునే వ్యూహంలో భాగంగానే చైనా ఈ చర్యకు పాల్పడుతుందని అన్నారు. అమెరికా ప్రభుత్వం దీనిపై ఏం చేయబోతోందని ఆమె వెల్స్‌ను ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన వెల్స్ అమెరికా ‘దక్షిణ చైనా సముద్రం వ్యూహం’కింద దీన్ని చూస్తోందని చెప్పారు. దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రాల్లో ఉన్న అపార ఖనిజ సంపద వల్లే చైనా ఇలా చేస్తోందని వ్యాఖ్యానించారు. గతేడాది జరిగిన డొక్లాం వివాదం దాదాపు 73 రోజుల పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. భారత్, చైనా, భూటాన్ ట్రై జంక్షన్లో చైనా నిర్మాణాలను చేపట్టడంపై మన దేశం తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో 73రోజుల పాటు సాగిన ప్రతిష్టంభనలో చైనా వెనకడుగు వేయక తప్పలేదు. తాజాగా చైనా, భారత్ ఆర్మీ క్యాంపులకు 80 మీటర్ల దూరంలోనే నిర్మాణాలు చేపడుతోందని, అయినా భారత్ ఎలాంటి చర్యలకు దిగడం లేని అమెరికా ప్రతినిధి చెప్పడం సంచలనంగా మారింది. 127 ఏళ్ల వివాదం డోక్లామ్‌తో చైనా–భూటాన్–భారత్ మధ్య ఏర్పడిన ఈ వివాదానికి నూటా పాతికేళ్లకు పైగా చరిత్ర ఉంది. 1890లో టిబెట్–సిక్కింలకు సంబంధించిన విషయాలపై ఆనాడు భారత్‌ను పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం–క్వింగ్ (చైనా సార్వభౌముల) మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఛుంబి లోయ వెంట అంతర్జాతీయ సరిహద్దును నిర్ణయించారు. ఆ తర్వాత కూడా టిబెట్–భూటాన్ మధ్య సరిహద్దు వివాదాస్పదంగానే ఉండేది. దానికి చైనా–భూటాన్–భారత్ కలిసే సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్ (ట్రై జంక్షన్) కేంద్రంగా మారింది. చైనాతో భూటాన్‌కు ద్వైపాక్షిక సంబంధాలు లేకపోవడంతో ఈ వివాదంలో భారత్ సహకారాన్ని ఆ దేశం కోరుతోంది. భారత్–భూటాన్ మధ్య అనేక ఒప్పందాలున్నాయి. చైనా అధీనంలోని డోక్లామ్ పీఠభూమిలో భారీ సైనిక వాహనాల కోసం రోడ్డు వేసేందుకు చైనా బలగాల సహాయంతో యంత్రాలను తరలించారు. తమ భూభాగంలోకి చొచ్చుకు రావడంపై భూటాన్ ఆర్మీ అభ్యంతరం తెలపడంతో పాటు వారిని వెనక్కు పంపేందుకు భారత్ సైన్యం సాయం కోరింది. -
సరిహద్దుల్లో సైన్యాలకు వ్యూహాత్మక మార్గనిర్దేశాలు
-
మోదీ, జిన్‌పింగ్ విస్తృత చర్చలు
వుహాన్: ప్రపంచంలోని దాదాపు 40 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు పెద్ద సరిహద్దు దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలకు కీలక ముందడుగు పడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య చైనాలోని పర్యాటక కేంద్రం వుహాన్‌లో శుక్రవారం అనధికార శిఖరాగ్ర భేటీ ప్రారంభమైంది. హృదయపూర్వక సమావేశం (హార్ట్ టు హార్ట్ సమ్మిట్)గా పేర్కొంటున్న ఈ భేటీలో ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్, చైనాల సంప్రదాయ, సాంస్కృతిక స్నేహ సంబంధాలను గుర్తు చేసుకున్నారు. తమ రెండు దేశాల అభివృద్ధితో పాటు ప్రపంచ పురోగతిలో కీలక పాత్ర పోషించే సమర్థత భారత్, చైనాలకుందని స్పష్టం చేశారు. భేటీ అనంతరం తొలి రోజు చర్చలు విస్తృతంగా, ఫలప్రదంగా ముగిశాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రెండో రోజు చర్చలు నేడు ఉదయం ప్రారంభం కానున్నాయి. సరిహద్దు వివాదాలు సహా ఇరుదేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంపైనే వీరిరువురు చర్చించారు. ఇరుదేశాల మధ్య ఇలాంటి చర్చలు తరచూ జరుగుతూ ఉండాలని మోదీ అభిలషించారు. 2019లో భారత్‌లో జరిగే ఈ తరహా చర్చలకు రావాలని జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మనమే బలం: భారత్, చైనాలు కలసి పనిచేస్తే తమ దేశాల ప్రజలతోపాటు ప్రపంచానికి మేలు చేసేందుకు గొప్ప అవకాశం లభిస్తుందని మోదీ తెలిపారు. భారత్–చైనాల మధ్య శతాబ్దాల బంధాన్ని మోదీ గుర్తుచేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భారత్, చైనాలు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ‘గత 2వేల ఏళ్లలో దాదాపు 1600 ఏళ్ల పాటు భారత్, చైనాలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్నాయి. ఈ రెండు దేశాలే దాదాపు 50 శాతం భాగస్వామ్యాన్ని కలిగున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. బీజింగ్‌కు వెలుపల రెండుసార్లు జిన్‌పింగ్ స్వాగతం పలికిన తొలి భారత ప్రధానిగా నిలవటం గర్వంగా ఉందని మోదీ తెలిపారు. ఇది భారత ప్రజలకు దక్కిన గౌరవంగా ఆయన పేర్కొన్నారు. ద్వైపాక్షిక బంధాల కోసం ‘ఉమ్మడి ఆలోచన, సమాచార మార్పిడి, బలమైన బంధం, పరస్పర ఆలోచన విధానం, పరస్పర పరిష్కారం’ అనే ఐదు అంశాలను మోదీ ఈ భేటీలో ప్రతిపాదించారు. సంయుక్త భాగస్వామ్యంతో..: ఇలాంటి చర్చలు భవిష్యత్తులో కూడా జరుగుతాయని ఆశిస్తున్నట్లు జిన్‌పింగ్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక బంధాల్లో ఈ భేటీ కొత్త అధ్యాయానికి తెరలేపనుందని ఆయన తెలిపారు. ‘గంగా, యాంగ్జీ నదులు నిరంతరం ప్రవహిస్తున్నట్లే ఇరుదేశాల మధ్య స్నేహం కూడా కొనసాగుతూనే ఉండాలి. భారత్–చైనా సహకారానికి బంగారు భవిష్యత్తు ఉందని మేం భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ‘ఐదేళ్లుగా మనం చాలా సాధించాం. సంయుక్త భాగస్వామ్యాన్ని ఏర్పాటుచేసుకున్నాం. ఈ దిశగా సానుకూల ఫలితాలు సాధిస్తున్నాం. మరింత అభివృద్ధి జరిగేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన భాగస్వామ్య ప్రభావం స్పష్టంగా కనబడుతోంది’ అని జిన్‌పింగ్ తెలిపారు. ‘మీతో కలిసి పలు అంశాలపై మరింత లోతైన భాగస్వామ్యం ఏర్పడాలని కోరుకుంటున్నాను’ అని ఆయన మోదీతో తెలిపారు. ‘మన దేశాలకు పునరుత్తేజం కల్పించేందుకు అవసరమైన సుస్థిరత కల్పించుకోవటం, అన్ని రంగాల్లో అభివృద్ధి, పరస్పర అభివృద్ధికి సహకారాన్ని బలోపేతం చేసుకోవటం, ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం పనిచేయటంపై భారత్–చైనా దృష్టిపెట్టాలి’ అని చైనా అధ్యక్షుడు పేర్కొన్నారు. అమెరికా సహా పలు దేశాలు రక్షణాత్మక వ్యూహాలు అమలుచేస్తున్న నేపథ్యంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఘనస్వాగతం పలికిన జిన్‌పింగ్: శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ వుహాన్ చేరుకున్నారు. మోదీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఘన స్వాగతం పలికారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ కార్యక్రమాల అనంతరం అనధికార చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య బంధాన్ని వ్యూహాత్మకంగా, దీర్ఘకాల లాభాలను దృష్టిలో పెట్టుకుని సమీక్ష జరుపుతారని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్ చేశారు. ‘ద్వైపాక్షిక బంధాల బలోపేతంపై ఇరువురు నేతలు తమ ఆలోచనలను పంచుకున్నారు’ అని ఆయన చెప్పారు. జిన్‌పింగ్‌కు అద్భుతమైన కానుక: ఈ చర్చల సందర్భంగా ప్రఖ్యాత చైనా కళాకారుడు జు బీహోంగ్ వేసిన చిత్రాన్ని జిన్‌పింగ్‌కు మోదీ కానుకగా ఇచ్చారు. ప్రస్తుత పశ్చిమబెంగాల్లోని విశ్వభారతి యూనివర్సిటీలో 20వ శతాబ్దపు ప్రారంభంలో బీహోంగ్ చిత్రలేఖనం బోధించేవారు. ఆధునిక చైనా చిత్రకళను ఈయన ప్రపంచానికి పరిచయం చేశారు. ‘స్ట్రెంత్’కు మోదీ నిర్వచనం: చైనా పర్యటనలో ప్రధాని మోదీ భారత్, చైనా ప్రజల మధ్య బంధాల బలోపేతాన్ని కాంక్షిస్తూ స్ట్రెంత్ అనే పదానికి కొత్త నిర్వచనాన్నిచ్చారు. స్ట్రెంత్ పదంలోని ఆంగ్ల అక్షరాలకు వరుసగా ఎస్ అంటే ఆధ్యాత్మికత (స్పిరిచువాలిటీ), టీ అంటే సంప్రదాయం, వాణిజ్యం, సాంకేతికత (ట్రెడిషన్, ట్రేడ్, టెక్నాలజీ), ఆర్ అంటే బంధం (రిలేషన్షిప్), ఈ అంటే వినోదం (ఎంటర్టైన్మెంట్ – సినిమాలు, కళలు, నృత్యాలు మొదలైనవి), ఎన్ అంటే పర్యావరణ పరిరక్షణ (నేచర్ కన్జర్వేషన్), జీ అంటే క్రీడలు (గేమ్స్), టీ అంటే పర్యాటకం (టూరిజం), హెచ్ అంటే ఆరోగ్యం (హెల్త్, హీలింగ్) అని పేర్కొన్నారు. అప్పుడు సీఎంగా.. ఇప్పుడు పీఎంగా! గుజరాత్ సీఎంగా స్టడీ టూర్లో భాగంగా ‘త్రీ గార్జెస్ డ్యామ్’ను సందర్శించినట్లు మోదీ తెలిపారు. ‘వేగంగా పూర్తయిన ఈ డ్యామ్ నిర్మాణం, దీని ఎత్తు నన్ను అబ్బురపరిచాయి. ఓ రోజంతా డ్యామ్ దగ్గరే గడిపి దీని విశేషాలు తెలుసుకున్నాం’ అని మోదీ తెలిపారు. యాంగ్జీ నదిపై నిర్మించిన ఆ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు. 2.3 కిలోమీటర్ల పొడవు, 185 మీటర్ల ఎత్తు, 32 హైడ్రో పవర్ టర్బో జనరేటర్లు, ఐదు దశల షిప్ లాక్, షిప్ లిఫ్ట్ వ్యవస్థతో అధునాతన ప్రాజెక్టుగానూ ప్రత్యేకతను చాటుకుంది. డోక్లామ్, సీపీఈసీలను లేవనెత్తండి! న్యూఢిల్లీ/మంగళూరు: చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా డోక్లాం, చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)ల గురించి చర్చించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఎలాంటి అజెండా లేకుండానే ఈ సమావేశాలు జరుగుతున్నప్పటికీ భారత్‌కు నష్టం కలిగించే అంశాలను భేటీలో ప్రస్తావించాలన్నారు. చైనా పర్యటన సందర్భంగా మోదీ కాస్త టెన్షన్‌గా కనిపించారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ పర్యటన సందర్భంగా మోదీకి తమ పార్టీ మద్దతుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈస్ట్ లేక్ ఒడ్డున డిన్నర్ చర్చలు చర్చల అనంతరం ఇరువురు నేతలు హుబీ ప్రావిన్షియల్ మ్యూజియంను సందర్శించారు. ఈ మ్యూజియంలో పెద్ద సంఖ్యలో చైనా చారిత్రక, సాంస్కృతిక స్మారకాలున్నాయి. సాయంత్రం ఇరువురు నేతల మధ్య చర్చల్లో ఇరుదేశాల నుంచి ఆరుగురు అధికారుల చొప్పున పాల్గొన్నారు. రాత్రి ఈస్ట్ లేక్ ఒడ్డున ఉన్న అతిథిగృహంలో వీరిద్దరు మాత్రమే భోజనం చేస్తూ మాట్లాడుకున్నారు. దీంతో తొలిరోజు చర్చలు ముగిశాయి. శనివారం ఉదయం పదిగంటలనుంచి (స్థానిక కాలమానం ప్రకారం) మళ్లీ ఇరువురు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. ద్వైపాక్షిక ఒప్పందాలు, సంయుక్త ప్రకటనలు చేయాల్సిన అవసరం లేకుండా ఒత్తిడిలేని వాతావరణంలో ఈ అనధికార సదస్సు జరగాలని ముందుగానే నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2014లో మోదీ పగ్గాలు చేపట్టాక పలు అంతర్జాతీయ వేదికలపై 12సార్లకు పైగా వీరు కలుసుకున్నారు. అయినప్పటికీ.. ఇద్దరు దేశాధినేతలు మనసువిప్పి మాట్లాడుకోవటం ఇదే తొలిసారి. ఇరుదేశాల మధ్య ఉన్న పలు సమస్యల పరిష్కారంపై తరచూ సమీక్షలు నిర్వహించాలనే ఆలోచనలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానిగా మోదీకి ఇది నాలుగో చైనా పర్యటన. వుహాన్‌లోని ఓ ఎగ్జిబిషన్లో వాద్యపరికరాన్ని వాయిస్తున్న మోదీ -
డోక్లాం చైనాదే.. భారత్ తప్పు సరిదిద్దుకో!
బీజింగ్ : డోక్లాం విషయంలో చైనా భారత్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. డోక్లాం ఎప్పటికీ చైనాదేనని.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని చూస్తే భారత్‌కు తగిన బుద్ధి చెబుతామని గట్టి హెచ్చరిక జారీ చేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునియింగ్ సరిహద్దు వ్యవహారాలపై సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘డోక్లాం చైనాదే. అందుకు సంబంధించిన చారిత్రక ఒప్పందాలే ఆధారాలు. గతేడాది ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు మా చాకచక్యం కారణంగానే వివాదం సర్దుమణిగింది. గతానుభవాల దృష్ట్యా భారత్ గుణపాఠాలు నేర్చుకుందనే భావిస్తున్నాం. ఇష్టానుసార వ్యాఖ్యలు చేయటం మానుకుని, తప్పులు సరిదిద్దుకుని.. దౌత్య సంబంధాలకు సహకరించాలని కోరుకుంటున్నాం. అలా కానీ పక్షంలో తీవ్ర పరిస్థితులను భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఆమె తెలిపారు. కాగా, తాజాగా సీపీఈసీ సమావేశంలో భారత రాయబారి గౌతమ్ బంబావాలే మాట్లాడుతు.. భారత సరిహద్దులో యథాతథ స్థితి (స్టేటస్ కో)ని చైనా ఉల్లంఘిస్తే మళ్లీ డోక్లాం తరహా పరిస్థితుల్లో పునరావృతమవుతాయని.. మునుపెన్నడూ చూడని ఘటనలను సైతం ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని డ్రాగన్ కంట్రీకి ఆయన హెచ్చరిక జారీచేశారు. ఈ నేపథ్యంలో చైనా గట్టి బదులు ఇచ్చింది. -
చైనాకు భారత్ వార్నింగ్
డెహ్రాడూన్ : డొక్లాంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవడానికైనా భారత్ సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. శత్రువులతో పోరాడటానికి చైనా సిద్ధంగా ఉందంటూ ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డొక్లాం సమస్యపై నిర్మలా ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. శనివారం భారత రాయబారి గౌతమ్ బంబావాలే మాట్లాడుతూ.. భారత సరిహద్దులో స్టేటస్ క్యూను చైనా ఉల్లంఘిస్తే మళ్లీ డొక్లాం లాంటి ఘటన పునరావృతమవుతుందని అన్నారు. మునుపెన్నడూ చూడని ఘటనలను సైతం సరిహద్దులో భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. గత నెలలో రక్షణ శాఖ మంత్రి చైనా డొక్లాంలో హెలికాప్టర్లు, సెంట్రీ పోస్టులు, ట్రెంచెస్ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని పార్లమెంట్లో పేర్కొన్నారు. గతేడాది జూన్ 16 నుంచి ఆగష్టు 18ల వరకూ చైనా-భారత్‌ల మధ్య డొక్లాం సమస్య నెలకొన్న విషయం తెలిసిందే. -
దాపరికం లేని చర్చలతోనే శాంతి ..
సాక్షి, బీజింగ్ : భారత్, చైనాలు నిర్భయంగా.. ఎలాంటి దాపరికాలు లేకుండా చర్చించడం ద్వారానే రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని చైనాలోని భారత రాయబారి గౌతమ్ బాంబావాలే అన్నారు. డోక్లాంలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయన్నారు. చైనాకు చెందిన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.చైనా గత సంవత్సరం భారత భూభాగమైన డోక్లాంలోకి చొచ్చుకురావడం వల్లే విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. చైనా బీజింగ్ నగరం నుంచి డోక్లాం మీదుగా రోడ్డు మార్గాన్ని నిర్మించాలనుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడి, ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందన్నారు. చైనా తన బలగాలను సరిహద్దు ప్రాంతాల్లో మోహరించడంతో భారత్ కూడా తన బలగాలను సరిహద్దుకు చేర్చిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఇరు దేశాలు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇది వరకు చాలా చర్చలు జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వలేదని, డోక్లంపై దాపరికం లేని చర్చలు మరిన్ని జరగాలన్నారు. సున్నిత ప్రాంతాల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడమే ఇరు దేశాలకు మంచిదన్నారు. -
డోక్లాంలో చైనా నిర్మాణాలు
న్యూఢిల్లీ: డోక్లాం సరిహద్దుల్లో చైనా హెలిప్యాడ్లు, సెంట్రీ పోస్టులను నిర్మించిందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె మాట్లాడుతూ.. ‘2017లో డోక్లాం సరిహద్దుల్లో ఇరుదేశాలు బలగాలను వెనక్కు తీసుకున్నాయి. అయితే ఇటీవల మళ్లీ భారత్, చైనా దేశాలు మళ్లీ డోక్లాంలోని అదే ప్రాంతంలో తమ బలగాలు (తక్కువ సంఖ్యలో) మోహరించాయి. శీతాకాలంలో ఈ బలగాలను నిర్వహించేందుకు చైనా ఆర్మీ హెలిప్యాడ్లు, సెంట్రీ పోస్టులు, కందకాలు నిర్మించింది’ అని మంత్రి తెలిపారు. ఉపగ్రహ చిత్రాల్లో యుద్ధట్యాంకులు, క్షిపణులను మోహరించటంతోపాటు సరిహద్దుల్లో చైనా ఏడు హెలిప్యాడ్లు నిర్మించినట్లు తెలుస్తోందంటూ ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్ ఈ సమాధానమిచ్చారు. -
ఖబడ్దార్ చైనా
భారత్–చైనా సరిహద్దు ప్రాంతం ‘డోక్లామ్’ నివురుగప్పిన నిప్పులా ఉంది. కొద్ది నెలలుగా అక్కడ చైనా సైనికుల కదలికలు ఎక్కువయ్యాయి. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించి, గతంలో మాదిరిగా చైనా ఇప్పుడు కూడా స్నేహద్రోహానికి పాల్పడి భారత్‌పై యుద్ధానికి దిగితే.. గట్టి సమాధానమే ఇచ్చేందుకు భారతీయ సైనికులు కూడా తుపాకులు ఎక్కుపెట్టి ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘సర్దార్ జోగీందర్ సింగ్’ అనే పంజాబీ బయోపిక్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దేశంలోని ప్రతి యువకుడూ ‘ఖబడ్దార్ చైనా’ అంటూ, సైనిక దళాల్లో చేరేందుకు స్ఫూర్తినిచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని టీజర్ చూస్తే అర్థమౌతోంది. నెహ్రూ ప్రేమమయుడు. శాంతి ప్రియుడు. శత్రువు ఖడ్గం తీస్తే, ఆ ఖడ్గంతో కరచాలనం కోసం మృదువైన తన చేయిని చాస్తాడు! అయితే ఇప్పుడు మనం ఆ కథలోకి వెళ్లడం లేదు. ‘పరమ వీర చక్ర సుబేదార్ జోగీందర్ సింగ్’ అనే కథలోకి వెళ్తున్నాం. ఇది కేవలం కథ కాదు. నిజ జీవిత కథ. ఏప్రిల్ 6న ‘సుబేదార్ జోగీందర్ సింగ్’ అని సినిమాగా విడుదల కాబోతున్న సాహస గాథ. చైనాను నెహ్రూ గుడ్డిగా నమ్మకపోతే 1962 ఇండో చైనా యుద్ధమే లేదు. ఆ యుద్ధమే లేకపోతే సుబేదార్ జోగీందర్ సింగ్ అనే సినిమానే ఉండబోయేదే కాదు. నిబద్ధతలో గెలుపు మనదే! శత్రువును నమ్మొద్దని ఇండో–చైనా యుద్ధం మనకు నేర్పింది. ‘శత్రువును తరిమికొట్టేందుకు.. సైనికుడా.. నువ్వు నీ చివరి ప్రాణపు చుక్క చిందే వరకు పోరాడుతూనే ఉండు’ అని జోగీందర్ సింగ్ స్ఫూర్తినిచ్చాడు! యుద్ధంలో భారత్ ఓడిపోయింది. నిబద్ధతలో భారత సైన్యానిదే గెలుపని నిరూపించాడు జోగీందర్. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 21 వరకు నెల రోజుల యుద్ధమది. మనవైపు 1383 మంది సైనికులు చనిపోయారు. 3,968 మంది సైనికులు చైనాకు బందీలయ్యారు. బందీ అయ్యాక కూడా తిరగబడి, వీరమరణం పొందిన సైనికుడు సుబేదారు జోగీందర్ సింగ్! గాయాల నుంచి కారుతున్న రక్తపు చుక్కల్ని బౌండరీలపై రెడ్మార్కులుగా పెట్టి, ‘దాటితే చస్తావ్’ అని శత్రు మూకల్ని హడలుకొట్టి, అరుణాచల్‌ప్రదేశ్‌ను భరతమాత ఒడి జారనివ్వకుండా ఒడిసిపట్టుకున్నాడు జోగీందర్ సింగ్. అరుణాచల్‌ప్రదేశ్‌కు అప్పటికొక పేరు లేదు. ‘నార్త్ ఈస్ట్రన్ ఫ్రాంటియర్ ఏజెన్సీ’ (ఎన్.ఇ.ఎఫ్.ఎ) అది. దాని కోసమే చైనా యుద్ధానికొచ్చింది. యుద్ధంలో గెలిచి కూడా ఎన్.ఇ.ఎఫ్.ఎ.ని పొందలేకపోయింది. ఆ ఘనకీర్తి జోగీందర్దీ, జోగీందర్ నడిపించిన ‘బమ్ లా’ దళానిది. చైనా నుంచి నెహ్రూ ఏం కోరుకున్నాడో అది దక్కనందుకు యుద్ధం వచ్చింది. చైనా ఏం కోరుకుందో అది దక్కకుండా చేసినందుకు జోగీందర్ హీరో అయ్యాడు. చైనా నుంచి నెహ్రూ స్నేహాన్ని కోరుకున్నాడు. చైనా విప్లవ నేత మావో జెడాంగ్ని తన స్నేహితుడు అనుకున్నాడు. ‘‘మనిద్దరం ఇచ్చిపుచ్చుకుంటే మన మధ్య బంధం బలపడుతుంది’’ అన్నాడు నెహ్రూ. ‘‘అలాగైతే అక్సాయ్చిన్ని, అరుణాచల్నీ ఇవ్వు’’ అన్నాడు జెడాంగ్. ‘‘భౌగోళికంగా కాదు, బాంధవ్యాలతో పెనవేసుకుందాం’’ అన్నాడు నెహ్రూ. జెడాంగ్ మౌనంగా ఉండిపోయాడు. భారత్ సరిహద్దుల్లోకి గుట్టు చప్పుడు కాకుండా చైనా చొరబడింది. నెహ్రూకి యుద్ధం చెయ్యక తప్పలేదు. సరిగ్గా ఇక్కడి నుంచే ‘సుబేదార్ జోగీందర్ సింగ్’ సినిమా మొదలౌతుంది. 1962 సెప్టెంబర్ 9. డిఫెన్స్ మినిస్టర్ కృష్ణ మీనన్ నుంచి వేళకాని వేళలో నెహ్రూకి కాల్! ‘‘వేరే దారి లేదు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్. చైనా దళాలు ‘తలా రిడ్జ్’లో సౌత్‌కి వచ్చేశాయి’’ అంటున్నాడు మీనన్. స్నేహాన్ని నమ్మినంత కాలం నమ్మాం. ఇప్పుడు సైన్యాన్ని నమ్ముకోవలసిన కాలం వచ్చేసిందని నెహ్రూకి అర్థమైంది. నెహ్రూ అప్పుడు లండన్‌లో ఉన్నాడు. కామన్వెల్త్ ప్రైమ్ మినిస్టర్స్ మీట్లో. సరిగ్గా అర నిమిషం తర్వాత నెహ్రూ నుంచి మీనన్‌కి ‘డన్’ అని సంకేతం. వెంటనే మన సెవన్త్ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్.. చైనా సేనలు బలంగా నిలుచుని ఉన్న ‘నమ్కా ఛు’ వైపు కదిలింది. ‘సిక్కు రెజిమెంట్’ ఆ బ్రిగేడ్లోనే ఉంది. జోగీందర్ సింగ్ ఆ రెజిమెంట్‌లోనే ఉన్నాడు. సుబేదార్ అతడు. దళపతి. ‘నమ్కా ఛు’ని చేరుకునే దారిలో ‘బమ్ లా’ పోస్టు దగ్గర మూడు వైపుల్నుంచీ కదిలి వచ్చిన చైనా సేనల్ని సిక్కు రెజిమెంట్ అడ్డుకుంది. వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. వీళ్లు తక్కువగా ఉన్నారు. ఎక్కువ తక్కువల్ని చూసుకోలేదు సుబేదార్ జోగీందర్ సింగ్. తన సేనల్లో స్ఫూర్తిని నింపి అన్ని వైపులకు కదిలించాడు. కానీ శత్రువుల బలగం ఎక్కువగా ఉంది. నిమిష నిమిషానికీ మన బ్రిగేడ్ బలం సన్నగిల్లుతోంది. సిక్కు రెజిమెంట్‌లో ఉన్నదే 20 మంది సైనికులు. వారిలోనూ పది మంది నేలకు ఒరిగారు. మిగిలింది జోగీందర్, మరో తొమ్మిది మంది! వారి దగ్గర కూడా బాయ్నెట్లే మిగిలాయి. వాటితోనే పోరాడుతున్నారు. జోగీందర్ ఒంటినిండా బలమైన గాయాలు. చివరికి ఆ గాయాలు అతడిని చైనా సైనికులకు బందీని చేశాయి! బందీగానే మరణించాడు జోగీందర్ . తండ్రి మరణ వార్త వినగానే జోగీందర్ సింగ్ పెద్ద కూతురు కుప్పకూలిపోయి అక్కడే మరణించారు. చైనా అతడి చితాభస్మాన్ని సైనిక మర్యాదలతో ఇండియాలోని బెటాలియన్‌కి పంపించింది. భారత ప్రభుత్వం ఆయనకు పరమవీర చక్ర అవార్డును ప్రకటించింది. వందల మంది శత్రుదేశ సైనికులతో పోరాడిన ఇరవైమంది సైనికుల వీరోచిత పోరాటానికి దృశ్యరూపం .. ‘సుబేదార్ జోగీందర్ సింగ్’. సింగ్‌గా గిప్పీ గ్రేవాల్ నటిస్తున్నారు. టీజర్ చివర్లో.. ‘ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఇండియా’ అంటాడు గ్రేవాల్. అలా అంటున్నప్పుడు అతడిని చూస్తే.. జోగీందర్ సింగ్ ఆత్మ అతడిలో ప్రవేశించిందా అనిపిస్తుంది. పంజాబీలనే కాదు, మిగతా రాష్ట్రాల యువకులనీ సైన్యంలోకి పట్టి తీసుకుపోయేంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది సుబేదార్ జోగీందర్ సింగ్ లైఫ్ హిస్టరీ. అదిప్పుడు తగిన సమయంలో తెరకెక్కబోతోంది. సుబేదార్ జోగీందర్ సింగ్ పరమవీరచ్ర - 1921–1962 జననం : పంజాబ్ -
‘డోక్లాం’పై భారత్ మాట్లాడొద్దు
బీజింగ్: వివాదాస్పద సరిహద్దు ప్రాంతమైన డోక్లాంలో నిర్మిస్తున్న మౌలిక వసతులను చైనా సమర్థించుకుంది. అవి చట్టబద్ధమేనని, తమ సైన్యం, అక్కడ నివసిస్తున్న ప్రజల సౌకర్యార్థమే వాటిని చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత్ వ్యాఖ్యలు చేయకూడదని కోరింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ బీజింగ్‌లో మీడియాతో మాట్లాడుతూ డోక్లాంలోని తమ మిలటరీ కాంప్లెక్స్‌కు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు మీడియాలో వచ్చిన సంగతి తన దృష్టికి వచ్చినట్లు అంగీకరించారు. తమ సైనికులు, డోక్లాంలో నివసిస్తున్న ప్రజల కోసమే చైనా అక్కడ మౌలిక వసతుల కల్పనను చేపడుతోందని అన్నారు. సరిహద్దుల్లో గస్తీ చేయడానికి, సైనికులు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికే రోడ్డు నిర్మాణం వంటి మౌలిక వసతులను నిర్మించామని తెలిపారు. చైనా సొంత భూభాగంపైనే తన సార్వభౌమాధికారాన్ని వినియోగించుకుంటోందని అన్నారు. ప్రతిష్టంభనతో సంబంధాలకు పరీక్ష ‘డోక్లాంలో మేము చేపడుతున్న నిర్మాణాలు సక్రమం, సమర్థనీయమే. భారత్ తన భూభాగంలో చేపడుతున్న నిర్మాణాలపై చైనా వ్యాఖ్యానించదు. అలాగే మా ప్రాంతంలోని నిర్మాణాలపై భారత్ స్పందించకూడదు. చికెన్ నెక్ కారిడార్‌లో చైనా రోడ్డు నిర్మాణ పనులను భారత్ అడ్డుకోవడం వల్ల ఇరు దేశాల సంబంధాలకు పెద్ద పరీక్ష ఎదురైంది’ అని కాంగ్ పేర్కొన్నారు. మరోవైపు, డోక్లాంలో పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నామని, చైనా చేపడుతున్న నిర్మాణాలపై వెలువడిన కథనాలు అవాస్తవమని భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. డోక్లాంలో యథాతథ స్థితిలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. -
భారత్ ఎంతో ముఖ్యమైన దేశం
బీజింగ్ : భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నట్లు చైనా మరోసారి స్పష్టం చేసింది. అసియాలోనే బలమైన దేశాలుగా భారత్-చైనాలు కలిసే ముందుకు సాగాలని చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యి అభిలషించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఏర్పడే చిన్నచిన్న సమస్యలను పక్కనపెట్టి ముందుకు సాగాలని ఆయన కోరారు. ఇరు దేశాల మధ్య అత్యంత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన డోక్లాం వివాదాన్నికూడా నిగ్రహంతో, దౌత్యపరంగానే చైనా పరిష్కరించుకుందని ఆయన చెప్పారు. ఇరు దేశాల మధ్య శాంతికి చైనా కృషి చేస్తుందన్నారు. డోక్లాం సరిహద్దులోకి భారత దళాలు అక్రమంగా ప్రవేశించినా.. చైనా ఉద్రిక్తతలు పెంచకుండా.. దౌత్యపరంగానే సమస్యను పరిష్కరించిందని చెప్పారు. భారత్-చైనా దేశాలు భవిష్యత్‌లో ప్రపంచాన్ని శాసించే అవకాశం ఉందని.. ఆయన చెప్పారు. గత అనుభవాల వల్ల ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక అనుమానాలు, సందేహాలు చాలానే ఉన్నాయని.. అయితే వాటిని నిరంతర చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని వాంగ్ తెలిపారు. ఇదిలా ఉండగా.. చైనా, రష్యా, భారత్ దేశాల చర్చల్లో భాగంగా వాంగ్ యి పాల్గొననున్నారు. డోక్లాం వివాదం తరువాత చైనా అత్యున్నత మంత్రి ఒకరు భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. -
డోక్లాం వద్ద మళ్లీ కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : డోక్లాం వద్ద మళ్లీ చైనా బలగాలు భారీగా మోహరించాయి. సుమారు 1600 నుంచి 1800 మందితో కూడిన చైనీయ సైన్యం అక్కడ క్యాంప్ ఏర్పాటు చేసింది. గడ్డ కట్టే చలిలో రెండు హెలిప్యాడ్లు, గుడిసెలు, స్టోర్లు ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతంలో తమ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇక డొక్లాం దక్షిణ ప్రాంతమైన ఝంపేరి రిడ్జ్ దగ్గర చైనా ఆర్మీ మోహరించిందని భారత సైన్యం కూడా ధృవీకరించింది. ఈ విషయంపై చైనా తన వాదనను వినిపించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(చైనా సైన్యం) ప్రతీ ఏటా వేసవి, శీతాకాలాల్లో ఇక్కడ క్యాంపులు నిర్వహించటం సహజం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత క్యాంపును ఏర్పాటు చేసినట్లు చెబుతోంది. కానీ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న భారత సైన్యం మాత్రం అప్రమత్తంగా ఉన్నట్లు ప్రకటించింది. కాగా, సిక్కిం-భూటాన్-టిబెట్ ట్రై జంక్షన్ అయిన డోక్లాం వద్ద 73 రోజులపాటు భారత్-చైనా సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భారీ ఆయుధాల తరలింపు.. ఎదురుపడినప్పుడల్లా, కవ్వింపు చర్యలకు పాల్పడిన చైనా, భారత్ సైనికుల దృశ్యాలు అప్పట్లో కంగారు పుట్టించాయి. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
భారత్‌కు చైనా మీడియా దురుసు హెచ్చరిక!
చైనీస్ భూభాగంలోకి ప్రవేశించిన భారత్ డ్రోన్‌ను కూల్చివేశామని ఆ దేశం వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారత్‌ను తీవ్రంగా హెచ్చరిస్తూ చైనా ప్రభుత్వ మీడియా కథనాలు ప్రచురించింది. ఇరుదేశాల నడుమ సైనిక ప్రతిష్టంభన తలెత్తిన డోక్లాం కొండప్రాంతం సమీపంలోనే భారత్ డ్రోన్ చైనా భూభాగంలోకి ప్రవేశించి కూలిపోయిందని చైనా జాతీయవాద టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. డ్రోన్‌తో చైనాలోకి అక్రమంగా చొరబడినందుకు భారత్ క్షమాపణ చెప్పాలంటూ ఆ పత్రిక ఓ సంపాదకీయాన్ని రాసుకొచ్చింది. ఇలా చొరబడినందుకు డ్రోన్‌ను కోల్పోవడమే కాదు.. అంతకంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోకతప్పదని హెచ్చరించింది. 'సైనిక ప్రతిష్టంభన తలెత్తిన ప్రాంతంలో.. ఈ సైనిక ప్రతిష్టంభన ముగిసి ఎంతోకాలం కాకముందే తాజా చొరబాటు చోటుచేసుకుంది. ఉద్రిక్తతలు ఉన్న సమయంలో సున్నితమైన ప్రాంతంలో ఎదుటిపక్షాలు రెచ్చగొట్టే చర్యలుగా భావించే వాటిని ఇరువర్గాలు నివారించాల్సి ఉంటుంది. కానీ భారత్ అందుకు విరుద్ధంగా దురుసుగా ప్రవర్తించింది' అని గ్లోబల్ టైమ్స్ రాసుకొచ్చింది. -
శీతాకాలంలోనూ డోక్లాంలో చైనా సైన్యం?
బీజింగ్: శీతాకాలంలో డోక్లాం వద్ద కాస్త ఎక్కువ సంఖ్యలోనే బలగాలను మోహరిస్తామని చైనా ఆర్మీ సంకేతాలిచ్చింది. ఆ ప్రాంతం చైనాదేనని మరోసారి పేర్కొంది. సరిహద్దుల్లో చైనా రోడ్డు నిర్మాణాన్ని ఆపేయడంతో రెండున్నర నెలల వివాదానికి ముగింపు పలుకుతూ భారత్ గత ఆగస్టు 28న ఈ సమస్యను పరిష్కరించుకోవడం తెలిసిందే. సాధారణంగా డోక్లాం వద్ద చలికాలంలో వాతావరణం మరింత కఠినంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో భారత్, చైనాలు డోక్లాం ప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించేవి. -
మరిన్ని డోక్లామ్‌లకు సిద్ధమవ్వాల్సిందే
జమ్మూ: భారత్–చైనా సరిహద్దులో భవిష్యత్‌లో డోక్లామ్ లాంటి ఉద్రిక్తతలు తలెత్తితే ఎదుర్కొనడానికి సైన్యం సర్వసన్నద్ధంగా ఉండాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పిలుపునిచ్చారు. పర్వత ప్రాంతాల్లో శత్రువుల్ని నిలువరించేందుకు, ఎదురుదాడి చేసేందుకు మోహరించే ‘17 కోర్’ను ప్రబల నిరోధక శక్తిగా మార్చే ప్రక్రియను చేపట్టినట్లు వెల్లడించారు. శనివారం నాడిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా 47వ ఆర్మర్డ్ రెజిమెంట్‌కు ‘ప్రెసిడెంట్ స్టాండర్డ్’ విశిష్ట గౌరవాన్ని అందజేశారు. అనంతరం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు రావత్ సమాధానాలిచ్చారు. 17 కోర్‌ను చైనాను దృష్టిలో ఉంచుకునే ఏర్పాటు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ..‘అలా అని ఎందుకు అనుకోవాలి? శత్రువుల చొరబాటును అడ్డుకోవడానికి, దేశ రక్షణకు ప్రమాదకరంగా మారే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి వీటిని ఏర్పాటు చేస్తున్నాం’ అని జవాబిచ్చారు. 2014 జనవరిలో ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ(రక్షణ) ‘17 కోర్’ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 90,274 సైనికులతో 2021 నాటికి ఈ విభాగం పూర్తిస్థాయిలో సిద్ధం కానుంది. కాగా, కశ్మీర్‌లోని యువతలో తీవ్రవాద భావజాలం పెంపొందడానికి సామాజిక మాధ్యమాలే కారణమని రావత్ అన్నారు. దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నియంత్రణా రేఖ(ఎల్వోసీ) వెంట పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇప్పటికీ ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు కొనసాగుతున్నాయన్నారు. -
హైస్పీడ్ రైలుకు ‘డోక్లామ్’ సెగ
న్యూఢిల్లీ: డోక్లామ్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో చేపట్టిన మౌలిక ప్రాజెక్టులను చైనా నిర్లక్ష్యం చేస్తోందా? అంటే భారత రైల్వే వర్గాలు అవుననే జవాబిస్తున్నాయి. దాదాపు 492 కి.మీ పొడవున్న చెన్నై–బెంగళూరు–మైసూరు హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పూర్తిచేసి ఏడాది అయినప్పటికీ.. చైనా రైల్వే పనుల్లో ఎలాంటి పురోగతి చూపలేదని అధికారులు తెలిపారు. ఇందుకు భారత్–చైనాల మధ్య డోక్లామ్‌లో తలెత్తిన ఉద్రిక్తతే కారణమై ఉండొచ్చని రైల్వే శాఖ మొబిలిటి డైరెక్టరేట్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ‘చైనా రైల్వే ఎరియువన్ ఇంజనీరింగ్ గ్రూప్ కంపెనీ లిమిటెడ్(సీఆర్‌ఈఈసీ) 2016 నవంబర్‌లో నివేదిక సమర్పించిన అనంతరం రైల్వే బోర్డు అధికారులతో నేరుగా సమావేశం అవుతామని విజ్ఞప్తి చేసింది. ఆ తరువాత వారివైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ విషయమై సీఆర్‌ఈఈసీ స్పందన కోసం గత 6 నెలలుగా ఈ–మెయిల్స్ పంపిస్తూనే ఉన్నాం. చివరికి ఇక్కడి చైనా ఎంబసీ ద్వారా కూడా ప్రయత్నించాం. కానీ వారి నుంచి ఎలాంటి జవాబు రాలేదు’ అని ఓ రైల్వే ఉన్నతాధికారి తెలిపారు. కేవలం హైస్పీడ్ కారిడార్ మాత్రమే కాకుండా పలు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి చైనా రైల్వే ఆసక్తి చూపినప్పటికీ..డోక్లామ్ ఘటనతో వాటన్నింటిపై నీలినీడలు కమ్ముకున్నాయన్నారు. దేశవ్యాప్తంగా రైళ్ల వేగాన్ని ప్రస్తుతమున్న 80 కి.మీ/గంట నుంచి 160 కి.మీ/గంటకు పెంచేందుకు వీలుగా చెన్నై–బెంగళూరు–మైసూరు వంటి 9 హైస్పీడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. -
డొక్లామ్‌లో మళ్లీ రోడ్డేస్తున్న చైనా..!
న్యూఢిల్లీ : డొక్లామ్‌లో పీఠభూమి వివాదానికి మళ్లీ తెర లేచాలా ఉంది. చికెన్ నెక్ ప్రాంతంలో రోడ్డు వేసే ప్రక్రియను నిలిపేసి, సైన్యాన్ని వెనక్కు పిలిచిన చైనా.. గత వివాదాస్పద ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో మళ్లీ రోడ్డు వేయడం ప్రారంభించింది. దాదాపు 500 మంది చైనా జవాన్లు రోడ్డు నిర్మిస్తున్న కార్మికులకు రక్షణగా ఉంటున్నట్లు తెలిసింది. చైనా రోడ్డు నిర్మిస్తున్న ఈ ప్రాంతం నుంచి యాటుంగ్ పట్టణానికి కేవలం 20 కిలోమీటర్లే. ప్రస్తుతం చైనా రోడ్డు నిర్మిస్తున్న ప్రాంతం అతి శీతలంగా ఉంటుంది. చలికాలంలో మంచు దుప్పటిని పరుచుకుంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతాయి. దీంతో జవాన్లు, కూలీలు యాటుంగ్‌లో బస చేస్తూ రోడ్డు నిర్మాణ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు భారతీయ ఆర్మీ అధికారి తెలిపారు. పట్టణం చేరువలో ఉండటంతో అవసరమైతే మరింత మంది సైనికులను మొహరించే వెసులుబాటు చైనాకు ఉందని ఆయన చెప్పారు.