చైనీస్ భూభాగంలోకి ప్రవేశించిన భారత్ డ్రోన్‌ను కూల్చివేశామని ఆ దేశం వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారత్‌ను తీవ్రంగా హెచ్చరిస్తూ చైనా ప్రభుత్వ మీడియా కథనాలు ప్రచురించింది. ఇరుదేశాల నడుమ సైనిక ప్రతిష్టంభన తలెత్తిన డోక్లాం కొండప్రాంతం సమీపంలోనే భారత్ డ్రోన్ చైనా భూభాగంలోకి ప్రవేశించి కూలిపోయిందని చైనా జాతీయవాద టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. డ్రోన్‌తో చైనాలోకి అక్రమంగా చొరబడినందుకు భారత్ క్షమాపణ చెప్పాలంటూ ఆ పత్రిక ఓ సంపాదకీయాన్ని రాసుకొచ్చింది. ఇలా చొరబడినందుకు డ్రోన్‌ను కోల్పోవడమే కాదు.. అంతకంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోకతప్పదని హెచ్చరించింది.
'సైనిక ప్రతిష్టంభన తలెత్తిన ప్రాంతంలో.. ఈ సైనిక ప్రతిష్టంభన ముగిసి ఎంతోకాలం కాకముందే తాజా చొరబాటు చోటుచేసుకుంది. ఉద్రిక్తతలు ఉన్న సమయంలో సున్నితమైన ప్రాంతంలో ఎదుటిపక్షాలు రెచ్చగొట్టే చర్యలుగా భావించే వాటిని ఇరువర్గాలు నివారించాల్సి ఉంటుంది. కానీ భారత్ అందుకు విరుద్ధంగా దురుసుగా ప్రవర్తించింది' అని గ్లోబల్ టైమ్స్ రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment