ఆరేళ్లుగా డోక్లామ్ అంశంపై భారత్, చైనా బలగాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ అంశంపై ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది కూడా. ఈ నేపథ్యంలో భూటాన్ ప్రధాన మంత్రి లోటే షెరింగ్ చేసిన వ్యాఖ్యలు భారత్‌ని టెన్షన్‌లో పడేశాయి. ఇంతవరకు చైనా ఆ ప్రదేశంలోకి అక్రమంగా చోరబడుతోందని విశ్వసిస్తుంటే..ఈ వివాదం పరిష్కరించడంలో భాగమవ్వడానికి చైనాకు కూడా హక్కు ఉందని భూటాన్ ప్రధాని షెరింగ్ అన్నారు.
దీనిపై చర్చించేందుకు తాము సిద్దంగానే ఉన్నామని, భారత్, చైనాలు కూడా రెడీగా ఉంటే చర్చింకుందాం. అయినా మూడు సమాన దేశాలే. ఇందులో పెద్ద లేదా చిన్నా దేశాలు లేవు కదా అని అన్నారు. ఒకరకంగా భూటాన్ తాను చర్చలకు సుముఖంగా ఉన్నట్లు నేరుగానే సంకేతమిచ్చింది. కాగా, భారత్, చైనా, భూటాన్ కూడలిలో ఉండే ప్రాంతమే డోక్లాం. దీన్ని ట్రై జంక్షన్ అని కూడా పిలుస్తారు. ఐతే ఈ ఎత్తైన పీఠభూమి(డోక్లాం) సిలిగురి కారిడార్‌కి సమీపంలో ఉంది. సరిగ్గా చైనా ఈ ప్రాంతంలో రోడ్డు పనులు చేపట్టి విస్తరించే యోచన చేసింది.
దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించడమే గాక భారత్ బలగాలు ఆ పనులను అడ్డుకున్నాయి కూడా. వాస్తవానికి సిలిగురి కారిడార్ ఈశాన్య భారత రాష్ట్రాలను భారత్‌లోని మిగతా భూభాగంతో కలిపే ప్రాంతం. గతంలో 2019లో ఈ ట్రై జంక్షన్ పాయింట్ వద్ద ఏకపక్షంగా ఎటువైపు నుంచి ఎవరూ ఏమి చేయకూడదన్న ఒప్పందానికి భూటాన్ ప్రధాని షెరింగ్ చేసిన ప్రకటన చాలా విరుద్ధంగా ఉంది.
దశాబ్దాలుగా ఈ ట్రై జంక్షన్ పాయింట్ అంతర్జాతీయ పటంలో బటాంగ్ లా ప్రదేశంలో ఉంది. ఈ ప్రాంతం చైనాకి ఉత్తరాన, భూటాన్‌కి ఆగ్నేయం, భారత్‌కి పశ్చిమాన ఉంది. అయితే చైనా ఆ ట్రై జంక్షన్‌ని బటాంగ్ లా నుంచి దక్షిణాం వైపు దాదాపు 7 కి.మీ దూరంలో ఉన్న మౌంట్ గిమ్‌మోచి అనే శిఖరానికి మార్చాలనుకుంటోంది. అదే జరిగితే మొత్తం డోక్లాం భూభాగం చైనాలో భాగమవుతుంది. ఇది భారత్‌కి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. చైనా 2017 నుంచి డోక్లాం విషయంలో వెనక్కి తగ్గినట్లే తగ్గి..డోక్లాం వెంబడి నేరుగా తూర్పున భూటాన్ భూభాగంలో ఉన్న అమోచు నది లోయం వెంబడి విస్తరించే యత్నం చేసింది.
ఈ భూటాన్ భూభాగం గుండా అనేక గ్రామాల మధ్య చైనా రహదారిని నిర్మిచింది. తద్వారా భూటాన్ తన భూభాగాన్ని చైనా అప్పగించవలసి వచ్చిందన్న అక్కసుతో ప్రధాని షెరింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. భూటాన్ భూభాగంలోకి చైనా చొరబడిందని పలు వార్తలు వచ్చినప్పటికి భూటాన్ దాన్ని ఖండిస్తూ ఎలాంటి చొరబాటు జరగలేదని సమర్థించుకుంది. పైగా చైనా దొంగతనంగా ఆక్రమించిన భూభాగాలను భూటాన్ ప్రాంతాలు కాదని భూటాన్ వాదిస్తోందని భారత్ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు డాక్టర్ బ్రహ్మ చెల్లానీ అన్నారు.
అంతేగాదు గతేడాది ఇరుపక్షాలు(చైనా, భూటాన్ నిపుణలు) కున్మింగ్‌లో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు 20 రౌండ్లకు పైగా చర్చలు జరిపింది. సానుకూల ఏకాభిప్రాయానికి వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు భూటాన్ పేర్కొంది. చైనాతో తనకు పెద్దగా సరిహద్దు సమస్యలు లేవని, ఇంకా కొన్ని భూభాగాలను గుర్తించలేకపోయినట్లు చెప్పుకొచ్చింది. పైగా ఒకటో, రెండో సమావేశాల తదనంతరం విభజన రేఖను ఏర్పాటు చేసుకుంటామంటూ.. చైనాను వెనకేసుకు వచ్చే యత్నం చేస్తోంది.
(చదవండి: ఓ రేంజ్‌లో రివేంజ్ తీర్చుకున్న మహిళ.. ఏకంగా 20 ఏళ్లు కాపుగాసి..)
Comments
Please login to add a commentAdd a comment