![China hints at maintaining sizeable presence of troops near Doklam in winter - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/1/doklam.jpg.webp?itok=YXNgSJ4Y)
బీజింగ్: శీతాకాలంలో డోక్లాం వద్ద కాస్త ఎక్కువ సంఖ్యలోనే బలగాలను మోహరిస్తామని చైనా ఆర్మీ సంకేతాలిచ్చింది. ఆ ప్రాంతం చైనాదేనని మరోసారి పేర్కొంది. సరిహద్దుల్లో చైనా రోడ్డు నిర్మాణాన్ని ఆపేయడంతో రెండున్నర నెలల వివాదానికి ముగింపు పలుకుతూ భారత్ గత ఆగస్టు 28న ఈ సమస్యను పరిష్కరించుకోవడం తెలిసిందే. సాధారణంగా డోక్లాం వద్ద చలికాలంలో వాతావరణం మరింత కఠినంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో భారత్, చైనాలు డోక్లాం ప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించేవి.
Comments
Please login to add a commentAdd a comment