హువా చునియింగ్ (ఇన్ సెట్‌లో గౌతమ్ బంబావాలే)
బీజింగ్ : డోక్లాం విషయంలో చైనా భారత్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. డోక్లాం ఎప్పటికీ చైనాదేనని.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని చూస్తే భారత్‌కు తగిన బుద్ధి చెబుతామని గట్టి హెచ్చరిక జారీ చేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునియింగ్ సరిహద్దు వ్యవహారాలపై సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘డోక్లాం చైనాదే. అందుకు సంబంధించిన చారిత్రక ఒప్పందాలే ఆధారాలు. గతేడాది ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు మా చాకచక్యం కారణంగానే వివాదం సర్దుమణిగింది. గతానుభవాల దృష్ట్యా భారత్ గుణపాఠాలు నేర్చుకుందనే భావిస్తున్నాం. ఇష్టానుసార వ్యాఖ్యలు చేయటం మానుకుని, తప్పులు సరిదిద్దుకుని.. దౌత్య సంబంధాలకు సహకరించాలని కోరుకుంటున్నాం. అలా కానీ పక్షంలో తీవ్ర పరిస్థితులను భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఆమె తెలిపారు.
కాగా, తాజాగా సీపీఈసీ సమావేశంలో భారత రాయబారి గౌతమ్ బంబావాలే మాట్లాడుతు.. భారత సరిహద్దులో యథాతథ స్థితి (స్టేటస్ కో)ని చైనా ఉల్లంఘిస్తే మళ్లీ డోక్లాం తరహా పరిస్థితుల్లో పునరావృతమవుతాయని.. మునుపెన్నడూ చూడని ఘటనలను సైతం ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని డ్రాగన్ కంట్రీకి ఆయన హెచ్చరిక జారీచేశారు. ఈ నేపథ్యంలో చైనా గట్టి బదులు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment