చైనాకు భారత్‌ వార్నింగ్‌ | Ready For Any Situation Along China Border Says Nirmala | Sakshi
Sakshi News home page

చైనాకు భారత్‌ వార్నింగ్‌

Published Sun, Mar 25 2018 4:27 PM | Last Updated on Sun, Mar 25 2018 7:04 PM

Ready For Any Situation Along China Border Says Nirmala - Sakshi

డెహ్రాడూన్‌ : డొక్లాంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. శత్రువులతో పోరాడటానికి చైనా సిద్ధంగా ఉందంటూ ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డొక్లాం సమస్యపై నిర్మలా ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

శనివారం భారత రాయబారి గౌతమ్‌ బంబావాలే మాట్లాడుతూ.. భారత సరిహద్దులో స్టేటస్‌ క్యూను చైనా ఉల్లంఘిస్తే మళ్లీ డొక్లాం లాంటి ఘటన పునరావృతమవుతుందని అన్నారు. మునుపెన్నడూ చూడని ఘటనలను సైతం సరిహద్దులో భారత్‌ సిద్ధంగా ఉందని చెప్పారు.

గత నెలలో రక్షణ శాఖ మంత్రి చైనా డొక్లాంలో హెలికాప్టర్లు, సెంట్రీ పోస్టులు, ట్రెంచెస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని పార్లమెంట్‌లో పేర్కొన్నారు. గతేడాది జూన్‌ 16 నుంచి ఆగష్టు 18ల వరకూ చైనా-భారత్‌ల మధ్య డొక్లాం సమస్య నెలకొన్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement