మేం చెప్తుంటే భారత్‌ వినట్లే.. ఇక తప్పదు: చైనా | China Will Have To Take 'Military Way' If India Doesn't Listen: China | Sakshi

మేం చెప్తుంటే భారత్‌ వినట్లే.. ఇక తప్పదు: చైనా

Jul 4 2017 5:08 PM | Updated on Sep 5 2017 3:12 PM

సిక్కిం సెక్టార్‌ దోక్లామ్‌ విషయంలో తాము చెప్పే విషయం భారత్ వినడం లేదని, అందుకే ఇక చైనా బలవంతంగానైనా సైనిక చర్యతో ముందుకు వెళ్లనుందని చైనా నిపుణుడు హు జియాంగ్‌ చెప్పారు.

బీజింగ్‌: సిక్కిం సెక్టార్‌ దోక్లామ్‌ విషయంలో తాము చెప్పే విషయం భారత్ వినడం లేదని, అందుకే ఇక చైనా బలవంతంగానైనా సైనిక చర్యతో ముందుకు వెళ్లనుందని చైనా నిపుణుడు హు జియాంగ్‌ చెప్పారు. గత మూడు వారాలుగా డోక్లామ్‌ విషయంలో భారత్, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇన్ని రోజులపాటు ఇరు దేశాల మధ్య అప్రమత్తత ఉండటం ఇదే తొలిసారి. ‘చారిత్రక అంశాలు వివరించడం ద్వారా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకునేందుకు చైనా అత్యుత్తమ ప్రయత్నాలు చేస్తోంది. కానీ భారత్‌ మాత్రం వినడానికి నిరాకరించింది.

అందుకే ఈ సమస్య పరిష్కారం కోసం చైనాకు సైనిక చర్య తీసుకోవడం తప్ప ఇప్పుడు వేరే ప్రత్యామ్నాయం లేదు. ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో ఉన్నప్పుడు ఎందుకు భారత్‌ చైనాను రెచ్చగొట్టిందంటే తాము చైనాను నిలువరించగలం అని అమెరికా ముందు రుజువు చేయడానికే. డోనాల్డ్‌ ట్రంప్‌ తన కంటే ముందు అధికారంలో ఉన్న బరాక్‌ ఒబామాను అస్సలు ఇష్టపడే వ్యక్తి కాదు. ఒబామా భారత్‌ను ఎందుకు విశ్వసించేవారంటే ఇరు దేశాలు ఒకే విధమైన విలువలు పంచుకునేవి. కానీ, ట్రంప్‌ మాత్రం అలా కాదు.. భారత్‌ను విలువైన భాగస్వామిగా ట్రంప్‌ భారత్‌ను గుర్తించడు. ఎందుకంటే బీజింగ్‌ను ఎదుర్కొనే విషయంలో భారత్‌ బలహీనమైనది’ అని అంటూ జియాంగ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement