
చైనా దొంగబుద్ధి
- సరిహద్దు ప్రాంతాల్లో రహదారుల విస్తరణ
- భారత్‌ను ఇబ్బంది పెట్టే విధంగా చర్యలు
సాక్షి : భారత్ - చైనా సరిహద్దులో డోక్లాం తరహాలో మరిన్నిప్రాంతాల్లో చైనా రహదారలు వేసేందుకు ప్రణాళికలు రచిస్తోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ వ్యూహకర్తలు. భారత్‌తో సరిహద్దు ఉన్న టిబెట్, జిన్‌జియాంగ్ ప్రాంతాల్లో మరిన్ని చోట్ల కొత్తగా రహదారులు వేసేందుకు చైనా సిద్ధమవుతోందని తెలుస్తోంది.
సరిహద్దుల్లో అదికూడా మా భూభాగంలో రహదారులు నిర్మించుకోవడం మా హక్కు.. దానిని కాదనే అధికారం ఎవరికీ లేదు.. అని చైనా రాజకీయ వ్యూహకర్త విక్టర్ గో ప్రకటించారు. ఆయన ఒక చైనా పత్రికతో మాట్లాడుతూ మా భూభాగంలో.. మేం రహదారులు నిర్మించుకుంటే భారత్‌కు ఎందుకు భయపడుతోందని అని ప్రశ్నించారు. మేం డోక్లాం సహా.. సరిహద్దు ప్రాంతాల్లో హైవేల నిర్మాణం చేస్తామని ప్రకటించారు. చైనా చేపడుతున్న రహదారులు, భవనాల నిర్మాణాన్ని భారత్ అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహాన్నిప్రకటించారు.
ప్రస్తుతం బిక్స్ సదస్సు జరుగుతున్న దృష్ట్యా.. వివాదాల ప్రస్తావన లేకుండా చూసుకోవాలన్నది చైనా వ్యూహం. అందువల్లే 73 రోజుల డోక్లాం వివాదానికి బీజింగ్ ముగింపు పలికిందని విశ్లేషకుల మాట. అయితే బ్రిక్స్ సదస్సు అనంతరం సరిహద్దు ప్రాంత్లాల్లో రహదారుల నిర్మాణ క్రమాన్ని వేగంగా ముందుకు తీసుకువెళుతుందని చైనా మేధావులు చెబుతున్నారు.