డోక్లాంలో చైనా నిర్మాణాలు | China is building helipads, other infrastructure in Doklam area, says Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

డోక్లాంలో చైనా నిర్మాణాలు

Published Tue, Mar 6 2018 1:57 AM | Last Updated on Wed, Oct 17 2018 5:55 PM

China is building helipads, other infrastructure in Doklam area, says Nirmala Sitharaman - Sakshi

న్యూఢిల్లీ: డోక్లాం సరిహద్దుల్లో చైనా హెలిప్యాడ్లు, సెంట్రీ పోస్టులను నిర్మించిందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె మాట్లాడుతూ.. ‘2017లో డోక్లాం సరిహద్దుల్లో ఇరుదేశాలు బలగాలను వెనక్కు తీసుకున్నాయి. అయితే ఇటీవల మళ్లీ భారత్, చైనా దేశాలు మళ్లీ డోక్లాంలోని అదే ప్రాంతంలో తమ బలగాలు (తక్కువ సంఖ్యలో) మోహరించాయి.

శీతాకాలంలో ఈ బలగాలను నిర్వహించేందుకు చైనా ఆర్మీ హెలిప్యాడ్లు, సెంట్రీ పోస్టులు, కందకాలు నిర్మించింది’ అని మంత్రి తెలిపారు. ఉపగ్రహ చిత్రాల్లో యుద్ధట్యాంకులు, క్షిపణులను మోహరించటంతోపాటు సరిహద్దుల్లో చైనా ఏడు హెలిప్యాడ్లు నిర్మించినట్లు తెలుస్తోందంటూ ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్‌ ఈ సమాధానమిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement