helipads
-
ఎల్ఏసీ వెంట చైనా మోహరింపులు
వాషింగ్టన్: అది 2022 సంవత్సరం. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ. ఆ సమయంలో చైనా చడీచప్పుడూ లేకుండా వాస్తవాదీన రేఖ వెంబడి అన్నిరకాలుగా బలపడే ప్రయత్నాలు చేస్తూ వచి్చంది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్ వెంబడి సైనిక మోహరింపులను విపరీతంగా పెంచేసింది. డోక్లాం వెంబడి భూగర్భ నిల్వ వసతులను పటిష్టపరుచుకుంది. మరెన్నో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంది. పాంగాంగ్ లేక్ మీదుగా రెండో వంతెనతో పాటు డ్యుయల్ పర్పస్ ఎయిర్‌పోర్టు, మలి్టపుల్ హెలిపాడ్లను నిర్మించుకుంది. తూర్పు లద్దాఖ్ వెంబడి పలుచోట్ల కొన్నేళ్లుగా చైనా సైన్యం కయ్యానికి కాలుదువ్వడం, మన సైన్యం దీటుగా బదులివ్వడం తెలిసిందే. ముఖ్యంగా మూడేళ్లుగా అక్కడ ఇరు సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘చైనాలో సైనిక, భద్రతాపరమైన పరిణామాలు–2023’ పేరిట అమెరికా రక్షణ శాఖ తాజాగా ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. ‘2020 మే నుంచే భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తీవ్ర ఉద్రిక్త స్థాయికి చేరడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రెండు డివిజన్ల జిన్జియాంగ్, టిబెట్ మిలిటరీ డి్రస్టిక్ట్స్ దన్నుతో ఒక బోర్డర్ రెజిమెంట్‌నే ఏర్పాటు చేసింది. నాలుగు కంబైన్డ్ ఆర్మీ బ్రిగేడ్ (సీఏబీ) తదితరాలను 2022లో వాస్తవా«దీన రేఖ వెంబడి రిజర్వులో ఉంచింది. మరో మూడు సీఏబీలను ఇతర కమాండ్ల నుంచి తూర్పు సెక్టార్‌కు తరలించి సిద్ధంగా ఉంచింది. తర్వాత వీటిలో కొన్నింటిని వెనక్కు పిలిపించినా మెజారిటీ సేనలు ఇప్పటికీ వాస్తవా«దీన రేఖ వెంబడే మోహరించే ఉన్నాయి’ అని ఆ నివేదిక స్పష్టంచేసింది. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఇరు సైన్యాలు తీవ్ర ఘర్షణకు దిగడం తెలిసిందే. ఆ నేపథ్యంలో చైనా ఈ చర్యలకు దిగిందని నివేదిక వెల్లడించింది. ఈ మోహరింపులు ఇలాగే కొనసాగవచ్చని అభిప్రాయపడింది. ఇక భూటాన్ వెంబడి వివాదాస్పద ప్రాంత సమీపంలో చైనా ఏకంగా ఊళ్లనే ఏర్పాటు చేసిందని తెలిపింది. చైనా వద్ద 500 అణు వార్హెడ్లు! ప్రయోగానికి అన్నివిధాలా సిద్ధంగా ఉన్న అణు వార్ హెడ్లు చైనా వద్ద ఏకంగా 500 దాకా ఉన్నట్టు పెంటగాన్ నివేదిక పేర్కొంది. ‘గత రెండేళ్లలోనే ఏకంగా 100 వార్హెడ్లను తయారు చేసుకుంది. 2030 కల్లా వీటిని కనీసం 1,000కి పెంచడమే డ్రాగన్ దేశం లక్ష్యంగా పెట్టుకుంది’ అని నివేదిక వివరించింది. 300కు పైగా ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు తదితరాలు ఇప్పటికే చైనా అమ్ములపొదిలో చేరినట్టు వివరించింది. వాటిని దేశవ్యాప్తంగా మూడు చోట్ల అండర్‌గ్రౌండ్ వసతుల్లో అతి సురక్షితంగా ఉంచింది. ‘వీటితో పాటు సంప్రదాయ ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్ల తయారీని మరోసారి వేగవంతం చేసింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నావికా దళం ఇప్పటికే చైనా సొంతం. ఏడాదిలోనే 30 యుద్ధ నౌకలను నిర్మించుకుంది. దాంతో చైనా వద్ద మొత్తం యుద్ధ నౌకలు ఏకంగా 370కి చేరాయి. వీటిని 2025 కల్లా 400కు, 2030 కల్లా 450కి పెంచే యోచనలో ఉంది’ అని పేర్కొంది. ‘విదేశాల్లో సైనిక స్థావరాలను పెంచుకునేందుకు చైనా ముమ్మర ప్రయత్నాలు చేసింది. నైజీరియా, నమీబియా, మొజాంబిక్, బంగ్లాదేశ్, బర్మా, సాల్మన్ దీవులు, థాయ్‌లాండ్, తజకిస్థాన్, ఇండొనేసియా, పపువా న్యూ గినియా వంటి దేశాల్లో వ్యూహాత్మక సైనిక స్థావరాలను పెంచుకునేలా కనిపిస్తోంది’ అని నివేదిక తెలిపింది. -
రాష్ట్రపతి రామప్ప పర్యటనకు సీఎం కేసీఆర్!
వెంకటాపురం (ఎం): ఈనెల 28న ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొంటున్నట్లు అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాత్రమే హాజరవుతారని భావిస్తున్నప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కూడా ఖరారయినట్లు సమాచారం. రామప్ప ఆలయానికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఇప్పటివరకు రాలేదు. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ రానుండటంతో పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు రామప్పలో మూడు ప్రత్యేక హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. రామప్పలో గంటన్నరపాటు రాష్ట్రపతి... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన గంటన్నరపాటు కొనసాగనుంది. భద్రాచలం పర్యటన ముగించుకొని మధ్యాహ్నం 2:20 గంటలకు ఆమె రామప్పకు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. మధ్యాహ్నం 2:40 సమయంలో ఆలయంలోని రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రసాద్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. 3:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించనున్నారు. రాష్ట్రపతి విలేకరులతో మాట్లాడతారా లేదా అనేది అధికారికంగా ఖరారు కాలేదు. -
మౌలిక సదుపాయాల లేమివల్లే కశ్మీర్లో ఉగ్రభూతం: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: స్వాతంత్య్రానంతరం జమ్మూకశ్మీర్‌లో దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందలేదని, అందుకే ఉగ్రవాదం విస్తరించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దులోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ.2,180 కోట్లతో నిర్మించిన వంతెనలు, రహదారులు, హెలిప్యాడ్లు తదితర 75 నూతన ప్రాజెక్టులను ఆయన శుక్రవారం తూర్పు లద్దాఖ్‌లోని దార్బుక్–ష్యోక్–దౌలత్ బేగ్ ఓల్డీలో వర్చువల్‌గా ప్రారంభించారు. రాజ్‌నాథ్ ప్రారంభించిన వంతెనల్లో.. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తున డీఎస్–డీబీఓ రోడ్డుపై నిర్మించిన 120 మీటర్ల పొడవైన ‘క్లాస్–70 ష్యోక్ సేతు’ ఉంది. వీటిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మించారు. వీటిలో 45 వంతెనలు, 27 రోడ్లు, రెండు హెలిప్యాడ్లు, ఒక ‘కార్బన్ న్యూట్రల్ హాబిటాట్’ ఉన్నాయి. కశ్మీర్లో 20 ప్రాజెక్టులు, లద్దాఖ్‌లో 18, అరుణాచల్ ప్రదేశ్‌లో 18, ఉత్తరాఖండ్‌లో 5, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్‌లో 14 ప్రాజెక్టులు నిర్మించారు. ‘కార్బన్ న్యూట్రల్ హాబిటాట్’లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ 57 మంది తల దాచుకోవచ్చు. -
ఆకట్టుకున్న 'వింగ్స్ ఇండియా 2022' ఏవియేషన్ షో
-
6వ మోటార్ ట్రయల్ రన్
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనుల్లో వేగం పెరిగింది. కన్నెపల్లి పంపుహౌస్‌లో సీఎం ప్రారంభించనున్న 6వ మోటార్‌కు అధికారులు మంగళవారం అర్ధరాత్రి ట్రయల్ రన్ నిర్వహించారు. మిగితా మూడు మోటార్లకు గురువారం సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిసింది. అలాగే.. మేడిగడ్డ వద్ద హోమశాల, అక్కడే వీఐపీలు కూర్చునేందుకు ప్రాంగణం ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ల నుంచి హోమశాలకు వెళ్లడానికి వీలుగా బీటీ రోడ్లు నిర్మించారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో హోమశాల, వీవీఐపీలు కూర్చునే ప్రాంగణం పూర్తి కావచ్చింది. భోజనాలు చేసే స్థలంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. వంటశాల నిర్మాణం పూర్తికావచ్చింది. వీవీఐపీల కోసం ఏసీ బస్సులు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు, గవర్నర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీవీఐపీలు హెలిప్యాడ్ల నుంచి బ్యారేజీ, పంపుహౌస్‌లకు చేరుకోవడానికి కన్నెపల్లిలో 6 క్యాంపరింగ్ వ్యాన్ బస్సు (కార్విన్)లను ఏర్పాటు చేశారు. వీటిలో ఏసీతోపాటు వీవీఐపీలు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా సకల సౌకర్యాలు ఉన్నాయి. బ్యారేజీ, పంపుహౌస్‌ల్లో శిలాఫలకం రెడీ! మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో ముఖ్య అతిథులు ఆవిష్కరించడానికి శిలాఫలకాల నిర్మాణం పూర్తి కావచ్చింది. ముగ్గురు సీఎంలతో పాటు గవర్నర్, ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రొటోకాల్ సభ్యుల పేర్లు వాటిపై ఏర్పాటు చేయనున్నారు. రాత్రికి రాత్రే.. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో రాత్రికి రాత్రే అంతర్గత రోడ్లు వేస్తున్నారు. సీఎంలు, మంత్రుల కాన్వాయ్ వెళ్లే వీలుగా బీటీ రోడ్లు వేస్తున్నారు. ఈరోజు చూసింది.. మరునాడు కనిపించకుండా మారిపోతున్నాయి. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర వాసం వెంకటేశ్వర్లు, ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు బుధవారం పరిశీలించారు. కన్నెపల్లి, మేడిగడ్డ బ్యారేజీల వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో హోమశాల, బ్యారేజీలు, ఆవలి వైపు భద్రత, కన్నెపల్లి పంపుహౌస్‌లో హోమశాల, వీవీఐపీలు, వంటశాల, క్యాంపు కార్యాలయం, అప్రోచ్‌కెనాల్, ఫోర్‌బే తదితర స్థలాల్లో భద్రతను జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్, ఏఎస్పీ సాయిచైతన్యతో కలసి పరిశీలించారు. 16 హెలిప్యాడ్లు సిద్ధం మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో మొత్తం 16 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. ఇంతకు ముందు 12 మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరిగినా.. ప్రస్తుతం ఆ సంఖ్య 16కు చేరింది. తెలంగాణ వైపు మేడిగడ్డ బ్యారేజీ సమీపంలో 7 నిర్మించగా, మరొకటి మహారాష్ట్ర వైపు పోచంపల్లి గ్రామంలో ఒకటి, కన్నెపల్లి పంపుహౌస్‌లో మొత్తం 9 హెలిప్యాడ్ సిద్ధమయ్యాయి. మరిన్ని హెలిప్యాడ్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
కాళేశ్వరం పరిధిలో 17 చోట్ల హెలిప్యాడ్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మిస్తున్న బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్ల పరిధిలో హెలిప్యాడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయాచోట్ల ఎలాంటి క్లిష్ట పరిస్థితులున్నా వాటిని వీలైనంత వేగంగా చక్కదిద్దేందుకు, అవసరమైన సిబ్బందిని తరలించేందుకు వీలుగా హెలిప్యాడ్ల నిర్మాణం చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా ప్రాజెక్టు ఇంజనీర్లు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్హౌస్లుసహా కొండపోచమ్మ సాగర్ వరకు మొత్తంగా 17 చోట్ల రెండేసి చొప్పున 34 హెలిప్యాడ్ల నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల్లోని ప్రతి ప్యాకేజీ వద్ద హెలిప్యాడ్, స్టాఫ్ క్వార్టర్స్, సమాచార, సీసీ కెమెరాల వ్యవస్థలు ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.44.53 కోట్లతో వీటి నిర్మాణం చేపట్టనుంది. ప్రస్తుతం కాళేశ్వరం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఖరీఫ్ నుంచే గోదావరి వరద నీటిని వీలైనంత ఎక్కువగా ఎత్తిపోయాలని ప్రభత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా పనులు పూర్తవుతున్నాయి. మేడిగడ్డ వద్ద గోదావరి వరద గరిష్టంగా గతంలో 28 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. అంటే ఏకంగా 244 టీఎంసీల నీరు ఒకేసారి వచ్చే అవకాశం ఉంటుంది. ఎల్లంపల్లి వద్ద సైతం గతంలో 20 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చిన సందర్భాలున్నాయి. ఈ సమయంలో వరద నిర్వహణ, నియంత్రణ, గేట్ల ఆపరేషన్ అత్యంత కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి బ్యారేజీ వద్ద వరదపై పర్యవేక్షణ, పంపులు, మోటార్ల నిర్వహణ, విద్యుత్ వ్యవస్థల నిర్వహణకు సిబ్బంది నిర్మాణ ప్రాంతంలోనే ఉండాల్సిన అవసరం ఉంది. బ్యారేజీల వద్ద నది ప్రవాహం ఎంత ఉధృతంగా ఉన్నప్పటికీ, ఎంత భారీ వర్షం కురిసినప్పటికీ ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగని రీతిలో హైఫ్లడ్ లెవల్‌కు చాలాఎత్తులో వాచ్ టవర్, సిబ్బంది క్వార్టర్లు ఉండాలని ఇటీవలి సమీక్షల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రస్తుతమున్న హెచ్ఎఫ్ఎల్ కాకుండా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వచ్చే హెచ్‌ఎఫ్‌ఎల్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఈ నిర్మాణాలు చేయాలని సూచించారు. ప్రతి దగ్గర సబ్ డివిజన్ కార్యాలయం, స్టాఫ్ క్వార్టర్స్, సీసీ కెమెరాలు, సమాచార వ్యవస్థల నిర్మాణం చేయనున్నారు. వీటికి మొత్తంగా 44.53 కోట్లు అవసరం ఉంటుందని లెక్కగట్టారు. ఈ వ్యయాలకు త్వరలోనే పరిపాలనా అనుమతి రానుంది. -
డోక్లాంలో చైనా నిర్మాణాలు
న్యూఢిల్లీ: డోక్లాం సరిహద్దుల్లో చైనా హెలిప్యాడ్లు, సెంట్రీ పోస్టులను నిర్మించిందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె మాట్లాడుతూ.. ‘2017లో డోక్లాం సరిహద్దుల్లో ఇరుదేశాలు బలగాలను వెనక్కు తీసుకున్నాయి. అయితే ఇటీవల మళ్లీ భారత్, చైనా దేశాలు మళ్లీ డోక్లాంలోని అదే ప్రాంతంలో తమ బలగాలు (తక్కువ సంఖ్యలో) మోహరించాయి. శీతాకాలంలో ఈ బలగాలను నిర్వహించేందుకు చైనా ఆర్మీ హెలిప్యాడ్లు, సెంట్రీ పోస్టులు, కందకాలు నిర్మించింది’ అని మంత్రి తెలిపారు. ఉపగ్రహ చిత్రాల్లో యుద్ధట్యాంకులు, క్షిపణులను మోహరించటంతోపాటు సరిహద్దుల్లో చైనా ఏడు హెలిప్యాడ్లు నిర్మించినట్లు తెలుస్తోందంటూ ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్ ఈ సమాధానమిచ్చారు. -
‘లోకల్ ’ హెలిప్యాడ్లకు ఆమోదం
సాక్షి, ముంబై: రైలు ప్రమాదాల్లో గాయపడిన వారిని సకాల ంలో ఆస్పత్రులకు చేరవేసేందుకు నగరంలోని 14 రైల్వే స్టేషన్లకు సమీపంలో ఉన్న మైదానాల్లో హెలిప్యాడ్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా అనుమతినిచ్చింది. కాగా హెలిప్యాడ్లుగా మైదానాలను వినియోగించేందుకు నిమయ, నిబంధనాల్లో స్వల్ప మార్పులు చేయాల్సి ఉంటుందని నగరాభివృద్థి శాఖ స్పష్టం చేసింది. దీనిపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై న్యాయయూర్తులు అభయ్ ఓక్, అజయ్ గడ్కరిల బెంచి విచారణ జరిపింది. దీంతో రైల్వే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా అనుమతినిచ్చింది. కాగా 14 మైదానాల్లో అత్యధిక శాతం పిల్లలు ఆడుకునేవి, పాఠశాలలకు చెందిన క్రీడా మైదానాలు ఉన్నాయి. ఇందులో హెలిప్యాడ్లు నిర్మించకూడదు. వాటిని ఆడుకునేందుకు మినహా ఇతర పనులకు వినియోగించరాదు. దీంతో హెలిప్యాడ్లు నిర్మించేందుకు అవసరమైన నియమ, నిబంధనాల్లో మార్పులు చేస్తామని నగరాభివృద్థి శాఖ సహాయక కార్యదర్శి రాజన్ కోప్ అఫిడవిట్లో స్పష్టం చేశారు. అత్యవసర వ్యవస్థగా పేర్కొంటూ ఆ మైదానాల్లో హెలిప్యాడ్లు నిర్మించవచ్చని ఆయన అన్నారు. ఈ ప్రక్రియ త్వరలో పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని సకాలంలో ఆస్పత్రులకు చేరవేయకపోవడంవల్ల విలువైన ప్రాణాలు మధ్యలోనే హరీ మంటున్నాయి. నగరంలో ఏ రహదారిపై చూసినా ట్రాఫిక్ జాం కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో అంబులెన్స్‌లు కూడా ముందుకు కదలలేని స్థితిలో ఉన్నాయి. బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందకపోవడంవల్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీంతో హెలికాప్టర్ల అంశం తెరమీదకు వచ్చింది. కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్ల బయట హెలికాప్టర్లు రాకపోకలు సాగించే ందుకు అవసరమైన హెలిప్యాడ్లు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. వీటి ద్వారా బాధితులను వెంటనే ఆస్పత్రులకు చేరవేయవచ్చని ప్రభుత్వం భావించింది. అప్పటి నుంచి స్థలం వేటలో పడింది. కాని నియమ, నిబంధనలు అడ్డురావడంతో ఇంతకాలం ఆ ప్రతిపాదనకు తుదిరూపం రాలేదు. కాగా, ఇప్పుడు తాత్కాలిక అనుమతి లభించడంతో ఇకపై ైరె లు ప్రమాదాల్లో మృతుల సంఖ్య సగానికి తగ్గే అవకాశముందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. -
పీహెచ్హెచ్ఎల్ అనధికారికంగా హెలిప్యాడ్లు నిర్మిస్తుంది: కాగ్
పవన్ హన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్ (పీహెచ్హెచ్ఎల్) సంస్థ ప్రముఖ యాత్ర స్థలాలు, పర్యాటక కేంద్రాలల్లో అనుమతి లేకుండా హెలిప్యాడ్లను నిర్మించిందని ద కంప్ట్రొలర్ అడిటర్ జనరల్ (కాగ్) ఆదివారం న్యూఢిల్లీలో వెల్లడించింది. గతేడాది జూన్‌లో ఫాత (అమర్నాథ్), కట్రా, పోర్ట్ బ్లయిర్, గంగాటక్,పాట్నా, కొరాపూట్, గడ్చిరోలిల్లో హెలిప్యాడ్లను ఏర్పాటు చేసిందని ఉదాహరించింది. ప్రయాణికులు లేదా లగేజీతో వెళ్లే విమానం,హెలికాప్టర్లు తమ స్వరీసులను విమానాశ్రయాల్లో దిగాలన్న, బయలుదేరాలన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి అవసరమని పేర్కొంది. అందులోభాగంగానే హెలిప్యాడ్ల నిర్మాణంలో కూడా అనుమతి కోరాలని తెలిపింది. అయితే ఆ విషయంలో పీహెచ్హెచ్ఎల్ పూర్తిగా పక్షపాతధోరణితో వ్యవహరించిందని కాగ్ ఆరోపించింది. ప్రయాణికుల భద్రతపై కొంచమైన శ్రద్ధ లేకుండా వ్యవహారిస్తుందని ఆ సంస్థను కాగ్ ఈ సందర్భంగా తీవ్రంగా ఆక్షేపించింది. ఈశాన్య భారతంలో ఆ సంస్థ నడుపుతున్న విమాన సర్వీసుల అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. అలాగే 2011,ఏప్రిల్‌లో పీహెచ్హెచ్ఎల్ సంస్థకు చెందని హెలికాప్టర్ 17 మంది ప్రయాణికులతో వెళ్తు తవాంగ్ వద్ద జరిగిన ప్రమాద సంఘటనపై పౌరవిమానయాన సంస్థ ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతిని కాగ్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. పవన్ హన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్ సంస్థపై కాగ్ రూపొందించిన నివేదికను గత వారం కాగ్ పార్లమెంట్‌కు నివేదించిన సంగతి తెలిసిందే.