రైలు ప్రమాదాల్లో గాయపడిన వారిని సకాల ంలో ఆస్పత్రులకు చేరవేసేందుకు నగరంలోని 14 రైల్వే స్టేషన్లకు సమీపంలో ఉన్న ..
సాక్షి, ముంబై: రైలు ప్రమాదాల్లో గాయపడిన వారిని సకాల ంలో ఆస్పత్రులకు చేరవేసేందుకు నగరంలోని 14 రైల్వే స్టేషన్లకు సమీపంలో ఉన్న మైదానాల్లో హెలిప్యాడ్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా అనుమతినిచ్చింది. కాగా హెలిప్యాడ్లుగా మైదానాలను వినియోగించేందుకు నిమయ, నిబంధనాల్లో స్వల్ప మార్పులు చేయాల్సి ఉంటుందని నగరాభివృద్థి శాఖ స్పష్టం చేసింది. దీనిపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై న్యాయయూర్తులు అభయ్ ఓక్, అజయ్ గడ్కరిల బెంచి విచారణ జరిపింది. దీంతో రైల్వే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా అనుమతినిచ్చింది.
కాగా 14 మైదానాల్లో అత్యధిక శాతం పిల్లలు ఆడుకునేవి, పాఠశాలలకు చెందిన క్రీడా మైదానాలు ఉన్నాయి. ఇందులో హెలిప్యాడ్లు నిర్మించకూడదు. వాటిని ఆడుకునేందుకు మినహా ఇతర పనులకు వినియోగించరాదు. దీంతో హెలిప్యాడ్లు నిర్మించేందుకు అవసరమైన నియమ, నిబంధనాల్లో మార్పులు చేస్తామని నగరాభివృద్థి శాఖ సహాయక కార్యదర్శి రాజన్ కోప్ అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. అత్యవసర వ్యవస్థగా పేర్కొంటూ ఆ మైదానాల్లో హెలిప్యాడ్లు నిర్మించవచ్చని ఆయన అన్నారు. ఈ ప్రక్రియ త్వరలో పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని సకాలంలో ఆస్పత్రులకు చేరవేయకపోవడంవల్ల విలువైన ప్రాణాలు మధ్యలోనే హరీ మంటున్నాయి.
నగరంలో ఏ రహదారిపై చూసినా ట్రాఫిక్ జాం కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో అంబులెన్స్‌లు కూడా ముందుకు కదలలేని స్థితిలో ఉన్నాయి. బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందకపోవడంవల్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీంతో హెలికాప్టర్ల అంశం తెరమీదకు వచ్చింది. కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్ల బయట హెలికాప్టర్లు రాకపోకలు సాగించే ందుకు అవసరమైన హెలిప్యాడ్లు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. వీటి ద్వారా బాధితులను వెంటనే ఆస్పత్రులకు చేరవేయవచ్చని ప్రభుత్వం భావించింది. అప్పటి నుంచి స్థలం వేటలో పడింది. కాని నియమ, నిబంధనలు అడ్డురావడంతో ఇంతకాలం ఆ ప్రతిపాదనకు తుదిరూపం రాలేదు. కాగా, ఇప్పుడు తాత్కాలిక అనుమతి లభించడంతో ఇకపై ైరె లు ప్రమాదాల్లో మృతుల సంఖ్య సగానికి తగ్గే అవకాశముందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.