Train accidents
-
కూ.. చుక్.. చెక్..
భద్రత విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిఘా కెమెరాలను ఏర్పాటు చేయనుంది. పట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను దూరం నుంచే గుర్తించి లోకో పైలెట్లను అప్రమత్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్లు పట్టాలు తప్పడాన్ని నివారించడంతోపాటు ఉగ్రవాద, అసాంఘిక శక్తుల కుట్రలను తిప్పికొట్టే లక్ష్యంతో రైల్వేశాఖ వీటిని ఏర్పాటుచేయనుంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమెరాల నిఘా కొనసాగుతుండగా.. నడుస్తున్న రైళ్లను మాత్రం ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షిస్తున్నారు.కానీ, నడిచే రైళ్లు ప్రమాదాలకు గురికాకుండా ముందుగానే అప్రమత్తంచేసే వ్యవస్థ ఇప్పటివరకు అందుబాటులో లేదు. –సాక్షి, అమరావతిదూరం నుంచే గుర్తించి అప్రమత్తం..ఇక ఏఐ పరిజ్ఞానంతో పనిచేసే ఈ ‘టూ ఫ్రంటల్ హై రిజల్యూషన్ కెమెరాలు’ రైలు పట్టాలపై అనుమానాస్పద వస్తువులను చాలాదూరం నుంచే గుర్తించి లోకో పైలెట్‌ను అప్రమత్తం చేస్తాయి.వస్తువు ఫొటో తీసి వెంటనే ప్రాసెస్ చేసి అది ఎలాంటిదో సమాచారం ఇస్తాయి. అంటే.. అది ప్రమాదకరమైన వస్తువా.. అసహజమైన వస్తువా..కదులుతున్న వస్తువా.. మనుషులా.. జంతువులా అనేది కూడా గుర్తిస్తాయి.లోకో పైలెట్లు వెంటనే అప్రమత్తమై అత్యవసర బ్రేక్ వేసి ఆ వస్తువుకు కనీసం కి.మీ. ముందుగానే రైలును నిలిపివేస్తారు.గుర్తించిన అభ్యంతరకర వస్తువుల పైకి లేజర్ కిరణాలను ప్రసరింపజేసి ఆ వస్తువు ఎంత దూరంలో ఉందో లోకో పైలెట్ గుర్తించే పరిజ్ఞానాన్ని కూడా అందుబాటులోకి తేనున్నారు.అత్యవసర బ్రేక్‌ను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించి అసాధారణ పరిస్థితుల్లో లోకో పైలట్‌తో నిమిత్తం లేకుండానేరైలు ఆటోమేటిగ్గా ఆగిపోయేట్లుగా చేసే పరిజ్ఞానంపై కూడా రైల్వేశాఖ పరిశోధనలు నిర్వహిస్తోంది.మూడేళ్లలో 97 ప్రమాదాలు..ఇటీవలి కాలంలో దేశంలో రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న దుర్ఘటనలు గణనీయంగా పెరిగాయి. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ ప్రమాదాలు 97 సంభవించాయి. కొన్నిచోట్ల విద్రోహశక్తులు రైలుపట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను ఉంచి కుట్రలు పన్నిన ఉదంతాలూ ఉన్నాయి. దీంతో రైలు పట్టాలపై ఈ తరహా వస్తువులను ముందుగానే గుర్తించి ప్రమాదాలు నివారించేందుకు రైళ్లలో ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.రూ.15 వేల కోట్లతో 75,000ఏఐ కెమెరాలు..ఈ నేపథ్యంలో.. రూ.15 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో 75 వేల ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 40 వేల బోగీలు, 14 వేల లోకోమోటివ్‌లు (ఇంజిన్లు), 6 వేల ఈఎంయూలలో ఈ కెమెరాలను ఏర్పాటుచేస్తారు. ప్రతి బోగీకి ఆరు కెమెరాలు, ప్రతి లోకోమోటివ్‌కు నాలుగు కెమెరాలను అమరుస్తారు. అక్టోబరు నుంచి ఏడాదిలోగా దశలవారీగా అన్ని రైళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పలు కంపెనీలకు టెండర్లు అప్పగిస్తోంది. -
రైల్వే ప్రమాదాల నివారణపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం
ఢిల్లీ: ఒడిశా రైల్వే ప్రమాదం తర్వాత రైల్వేలో తీసుకున్న భద్రతా ప్రమాణాలపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రైల్వేలు అమలు చేయడానికి ప్రతిపాదించిన రక్షణ చర్యల గురించి తెలియజేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం అటార్నీ జనరల్‌ను కోరింది. ఆటోమెటిక్ రక్షణ వ్యవస్థ 'కవాచ్'ను పాన్-ఇండియా ప్రాతిపదికన ప్రవేశపెడితే ఎదురయ్యే ఆర్థికపరమైన చిక్కుల గురించి కూడా ధర్మాసనం ప్రశ్నించింది. రైల్వేలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి నిర్దిష్ట ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. రైల్వేలో 'కవచ్' వ్యవస్థను తక్షణమే అమలు చేయడానికి మార్గదర్శకాలను జారీ చేయాలని పిటిషనర్ కోరారు. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (కవాచ్)ను దేశమంతటా ఇప్పటికీ అమలు చేయలేదని న్యాయస్థానానికి తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్‌లో గత కొద్ది నెలల క్రితం రెండు ప్యాసింజర్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 293 మంది మరణించారు. 1,000 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవలి కాలంలో దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇది ప్రధానమైంది. ఇదీ చదవండి: మణిపూర్‌లో భద్రతా దళాలపై ముష్కరుల దాడి -
గజరాజుల మృత్యుఘోష
సాక్షి, అమరావతి: దేశంలో గజరాజుల మరణాలు ఇటీవల పెరిగాయి. విద్యుదాఘాతం, రైళ్లు ఢీకొనడం వంటి కారణాలతో పెద్దఎత్తున ఏనుగులు మరణిస్తున్నాయి. వీటికితోడు వేటాడటం, విష ప్రయోగం వంటి కారణాల వల్ల ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 522 ఏనుగులు మృత్యువాత పడ్డాయని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ఇటీవల వెల్లడించింది. విద్యుదాఘాతాల కారణంగా ఐదేళ్లలో (2018–19 నుంచి 2022–23 వరకు) అత్యధికంగా 379 ఏనుగులు మృతి చెందినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తరువాత రైలు ప్రమాదాల బారినపడి ఐదేళ్లలో 75 ఏనుగులు మరణించాయి. వేటాడటం ద్వారా 47 గజరాజులను చంపేశారు. దంతాల కోసం విష ప్రయోగం చేసి 21 ఏనుగులను హతమార్చినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. విద్యుత్ కంచెలతోనే తీవ్ర సమస్య విద్యుదాఘాతంతో అత్యధికంగా ఒడిశాలో ఐదేళ్లలో 80 ఏనుగులు, తమిళనాడు, అసోం రాష్ట్రాల్లో ఒక్కొక్కచోట 53 చొప్పున ఏనుగులు మృతి చెందాయి. రైళ్లు ఢీకొట్టిన ఘటనల్లో అత్యధికంగా అసోంలో 24 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఒడిశాలో 18 ఏనుగులను రైలు ప్రమాదాలు పొట్టనపెట్టుకున్నాయి. వేటాడటం ద్వారా ఒడిశాలో అత్యధికంగా 15 ఏనుగులను హతమార్చారు. మేఘాలయలో 15 ఏనుగులను చంపేశారు. అసోంలో విషప్రయోగంతో ఏకంగా 17 ఏనుగులను హతమార్చారు. అలాంటి వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అటవీ ప్రాంత సమీప పొలాల్లో పంటల్ని కాపాడుకునేందుకు విద్యుత్ కంచెల్ని ఏర్పాటు చేస్తుండటంతో విద్యుదాఘాతానికి గురై ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి. రైల్వేతో సమన్వయ కమిటీ రైలు ప్రమాదాల్లో ఏనుగుల మరణాల నివారణకు రైల్వే మంత్రిత్వ శాఖ, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలతో శాశ్వత సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. రైళ్లు నడిపే పైలట్లకు స్పష్టమైన వీక్షణను అందించడానికి రైల్వే ట్రాక్‌ల వెంట వృక్ష సంపదను తొలగించడం, ఏనుగుల ఉనికి గురించి పైలట్లను హెచ్చరించడానికి తగిన పాయింట్ల వద్ద సూచిక బోర్డులను ఉపయోగించడం, రైల్వే ట్రాక్‌ల ఎలివేటెడ్ విభాగాలను ఆధునికీకరించడం, ఏనుగుల సురక్షిత మార్గం కోసం అండర్ పాస్, ఓవర్ పాస్‌లను ఏర్పాటు చేయడం, అటవీ శాఖ ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వన్యప్రాణుల పరిశీలకులు రైల్వే ట్రాక్‌లపై రెగ్యులర్ పెట్రోలింగ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్రం చేసిన సూచనలివి! ♦ విద్యుదాఘాతాల నుంచి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు అక్రమంగా వేసిన విద్యుత్ కంచెల్ని తొలగించాల్సిందిగా అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, ట్రాన్స్మిషన్ ఏజెన్సీలకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ♦ భూమిపై విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించింది. అండర్ గ్రౌండ్ లేదా పోల్స్‌పై మాత్రమే విద్యుత్ లైన్లు ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ♦‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఏనుగుల పరిరక్షణ, వాటి ఆవాసాల్లో చర్యలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని రాష్ట్రాలకు అందిస్తోంది. ♦ ఏనుగుల కదలికలను పర్యవేక్షించడానికి స్థానిక సంఘాలతో ట్రాకర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు మానవుల వల్ల నష్టాన్ని నివారించడానికి స్థానిక ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ♦ మానవ–వన్యప్రాణుల సంఘర్షణల హాట్ స్పాట్లను గుర్తించడంతోపాటు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించింది. ♦ అడవి జంతువులకు రుచించని పంటల్ని వేయాల్సిందిగా సూచనలు జారీ చేసింది. -
దేశంలోనే అతిపెద్ద రైలు ప్రమాదాలు..ఒకేసారి 750 మంది మృతి..
-
రైలు పట్టాలపై మృత్యు ఘోష
ప్రమాదవశాత్తు పట్టాలు దాటే క్రమంలో కొందరు..ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కలహాలతో మరికొందరు..రైల్లో నుంచి జారిపడి ఇంకొందరు ప్రాణాలు విడుస్తున్నారు. ఇలా నిత్యం ఏదోక రూపంలో రైలు పట్టాలపై మృత్యు ఘోష వినిపిస్తోంది. రైలు ప్రమాదాల్లో గుర్తించిన మృతదేహాలు బంధువులకు చేరుతున్నా..గుర్తింపులేనివి కుటుంబ సభ్యుల కడచూపునకు నోచుకోకపోవడం విషాదకరం. నెల్లూరు(క్రైమ్): నెల్లూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో 444 కిలోమీటర్ల మేర రైలు మార్గం విస్తరించి ఉంది. నిత్యం సుమారు 120 రైళ్ల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. రైల్వే ప్రయాణికులు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం..ప్రమాదాల నివారణ చర్యల్లో రైల్వే అధికారుల ఉదాసీనత వెరసి నిత్యం ఏదోక చోట నిండు ప్రాణాలు రైలు చక్రాల కింద నలుగుతున్నాయి. రైలు ప్రమాదాల్లో ఎలాగోలా గుర్తించిన మృతదేహాలు బంధువులకు చేరుతున్నా...గుర్తింపులేనివి అనాథ శవాలుగా మిగిలిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు మాసాంతం వరకు నెల్లూరు రైల్వే సబ్‌డివిజన్ పరిధిలో రైలు పట్టాలపై జారిపడి, బలవన్మరణం, సహజ రూపాల్లో 229 మంది మృతి చెందారు. దీనిని బట్టి చూస్తే నెలకు సగటున 28 మందికిపైగా రైలు పట్టాలపై మృత్యువాత పడుతున్నారు. నెల్లూరు రైల్వే సబ్‌డివిజన్ పరిధిలోని చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు పరిధిలో చిన్న, పెద్ద రైల్వేస్టేషన్లు కలిపి 55 ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతిరోజూ ఏదోక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రైలు పట్టాలు దాటుతూ, రైల్లో నుంచి జారిపçడి, రైలు కిందపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమేపి పెరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు మాసాంతం వరకు రైల్లో నుంచి ప్రమాదవశాత్తు జారిపడి 107మంది మృతి చెందారు. ప్రేమ విఫలమై, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో 110 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 12 మంది అనారోగ్యం, ఇతర కారణాలతో మృతి చెందారు. మొత్తంగా వివిధ కారణాలతో 229 మంది మృతి చెందారు. అందులో 122 మంది వివరాలు లభ్యం కాగా వారి మృతదేహాలను రైల్వే పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన 107 మంది వివరాలు లభ్యం కాకపోవడంతో అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించారు. గుర్తింపు కష్టతరం.. నెలకు సగటన 28 మంది రైలు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు. వారి మృతదేహాలు ఛిద్రమై గుర్తుపట్టలేని విధంగా మారుతుంటాయి. అనేక సందర్భాల్లో మృతదేహాలు రైలుపట్టాల పక్కనున్న ముళ్ల పొదలు, పిచ్చిమొక్కల మధ్యన పడితే కొన్నిరోజుల వరకు ఎవరూ గుర్తించలేరు. అలాంటి పరిస్థితుల్లో మృతదేహాల గుర్తింపు, తరలింపు మరింత దారుణంగా ఉంటుంది. అయిన వారు సైతం మృతదేహాలను గుర్తుపట్టడం కష్టతరమే. నిబంధనల ప్రకారం గుర్తుతెలియని మృతదేహాలను 72గంటల పాటు మార్చురీలో భద్రపరచాల్సి ఉంటుంది. అప్పటికీ మృతుడి సంబం«దీకులు ఎవ్వరూ రాకపోతే రైల్వే పోలీసులే దగ్గరుండి ఖననం చేయిస్తారు. సంబంధీకుల కడసారి చూపునకు కూడా నోచుకోక ఎంతోమంది అనాథలుగా కాలగర్భంలో కలిసిపోతున్నారు. అధికశాతం ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణంగా నిలుస్తోంది. కదిలే రైలు నుంచి ఎక్కడం, దిగడం, ఫుట్‌బోర్డు ప్రయాణం, అటు, ఇటు గమనించకుండా అజాగ్రత్తగా రైలుపట్టాలు దాటడం, తదితరాలు కారణాలుగా నిలుస్తున్నాయి. కొనఊపిరితో ఉన్న కాపాడలేని పరిస్థితి సాధారణంగా రహదారిపై జరుగుతున్న ప్రమాదాలు అందరికి కనిపిస్తుంటాయి. రోడ్డు ప్రమాదం జరిగితే ఆయ్యో అంటూ ప్రజలు పరుగులు తీసి అవసరమైన సాయం అందిస్తారు. కానీ రైలు పట్టాలపై జరిగే ఘటనలు చాలా వరకు ఎవ్వరికి కనిపించవు. ప్రమాదవశాత్తు కొందరు.జీవితంపై విరక్తి చెంది మరికొందరు ఇలా ఎందరో రైలు చక్రాల కింద నలిగి తనువు చాలిస్తున్నారు. రైలు పట్టాలపై జరిగే ప్రమాదాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. లోకో పైలెట్, కీమెన్లు, ట్రాక్మెన్లు స్టేషన్‌మాస్టర్ దృష్టికి తీసుకొస్తే ఆయన రైల్వే పోలీసులకు సమాచారం అందిస్తారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేస్తారు. లోకోపైలెట్, కీమెన్లు, ట్రాక్మెన్లు గుర్తించకపోతే అంతే సంగతులు. జనసంచారం కలిగిన ప్రాంతాల్లో రైలు ప్రమాదంలో తీవ్రగాయాలైన వారికి సకాలంలో వైద్యసేవలు అందించే అవకాశం ఉంది. జన సంచారం లేని ప్రాంతాల్లో తీవ్రగాయాల పాలైన వారిని కాపాడుకోలేని పరిస్థితి. కొన ఊపిరితో ఉన్నా ఎవరూ చూడక, వైద్య అందక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. -
మన వ్యవస్థ పట్టాలు తప్పిందెక్కడ?
భారతదేశంలో రైళ్ల వేగం సగటున గంటకు 50 కిలోమీటర్లు మాత్రమే ఉన్నప్పటికీ, ప్రమాదాలు జరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన రైల్వే వ్యవస్థలున్న దేశాలలో ప్రమాదాలు అత్యంత అరుదు. ప్రధాన ట్రంక్ రూట్లలో తీవ్రమైన రద్దీ అనేది రైళ్ల వేగంలో స్తబ్ధతకూ, అభద్రతకూ దోహదపడే ప్రాథమిక అంశంగా ఉంటోంది. 1950లో చైనా రైలు నెట్ వర్క్ పొడవు భారత్‌తో పోలిస్తే సగం కంటే తక్కువ. కానీ, ప్రస్తుతం చైనా మొత్తం రైలు మార్గం పొడవు భారత్ కంటే రెండు రెట్లు ఎక్కువ. గత 20 సంవత్సరాలుగా, భారతీయ రైల్వేలు విమాన, రోడ్డు రవాణాకు తన మార్కెట్ వాటాను స్థిరంగా కోల్పోతున్నాయి. కొత్త లైన్ల నిర్మాణం చేపట్టడం, ఉన్నవి అప్‌గ్రేడ్ చేయడమే శరణ్యం. జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌లో రెండు ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు, ఒక నిలిచివున్న సరుకు రవాణా రైలు ఢీకొనడం, బహుశా గత 20 సంవత్సరాల్లో జరిగిన ఘోరమైన రైలు ప్రమాదం కావచ్చు. ఇటీవలి అధికారిక గణాంకాల ప్రకారం, ఇది 275 మరణాలకు దారితీసింది. 1,000 కంటే ఎక్కువ మంది గాయపడ్డారు. 2002 జూన్ 24న టాంజా నియాలో జరిగిన చివరి రైలు ప్రమాదం చాలామంది మరణాలకు కారణమైంది. ఒక ప్రయాణీకుల రైలు ఒక సరుకు రవాణా రైలు పర్వత ప్రాంత రైలు మార్గంలో ఢీకొనడంతో 281 మంది చని పోయారు. వేగం తక్కువ ప్రమాదాలు ఎక్కువ ఈ వాస్తవాలను పరిశీలిస్తే భారత్‌లో రైలు భద్రతా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. జపాన్, చైనా, టర్కీ వంటి అభివృద్ధి చెందిన రైల్వే వ్యవస్థలు... ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, స్వీడన్, బ్రిటన్ వంటి అనేక యూరోపియన్ దేశాలలో ప్రయాణీకుల రైళ్ల ప్రమాదాలు అత్యంత అరుదు, అసాధారణం. ఈ రైల్వేలలో, అనేక ప్యాసింజర్ రైళ్లు గరిష్ఠంగా గంటకు 200–350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటి సగటు వేగం గంటకు 150–250 కిలోమీటర్లు. భారతదేశంలో రైళ్ల వేగం గంటకు దాదాపు 50 కిలోమీటర్లు. ఇంత తక్కువ వేగం ఉన్నప్పటికీ, ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. భద్రతా పనితీరు ఆధారంగా ప్రపంచంలోని ప్రధాన రైల్వేల ర్యాంకింగులను సిద్ధం చేస్తే, భారతదేశం బహుశా ఈజిప్ట్, మెక్సికో, టాంజా నియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, నైజీరియా, ఇంకా పాకిస్తాన్ దేశాల కంటే కొంచెం పైస్థాయిలో మాత్రమే ఉంటుంది. వాయు, రోడ్డు రవాణాల వేగవంతమైన సాంకేతిక అభివృద్ధితో సమర్థవంతంగా పోటీ పడటానికి, అభివృద్ధి చెందిన దేశాలు 1970 నుండి ఉనికిలో ఉన్న తమ రైలు నెట్‌వర్క్‌లను విస్తరింపజేసుకుంటూ ఆధునికీకరించడం ప్రారంభించాయి. దాని భౌగోళిక పరిమాణం, జనాభా సారూప్యతల కారణంగా భారత్‌కు చైనా మంచి పోలిక అవు తుంది. 1950లో చైనా రైలు నెట్ వర్క్ మొత్తం పొడవు (21,800 కి.మీ.) భారతదేశంతో (53,596 కి.మీ.) పోలిస్తే సగం కంటే తక్కువ. భారతదేశ మొత్తం రైలు మార్గం పొడవును (62,900 కి.మీ.) 1997 నాటికి చైనా (66,000 కి.మీ.) అధిగమించింది. ప్రస్తుతం చైనా మొత్తం రైలు మార్గం పొడవు (1,55,000 కి.మీ.). ఇది భారతదేశం (68,100 కి.మీ.) కంటే రెండు రెట్లు ఎక్కువ. చైనా తన నెట్‌వర్క్‌ను దాదాపు రెండు దశల్లో అప్‌గ్రేడ్ చేసింది. 1995 నుండి 2010 వరకు, దాని ఎనిమిది ట్రంక్ రూట్లలో (నాలుగు నిలువు, నాలుగు అడ్డం) ముందునుంచీ ఉన్న లైన్లలో గంటకు 200–250 కిలోమీటర్ల వేగాన్ని సాధించడంపై దృష్టి పెట్టింది. తరువాత, గంటకు 200–250 కిలోమీటర్లు (హై స్పీడ్), గంటకు 300–350 కిలోమీటర్ల (అల్ట్రా హై స్పీడ్) వేగంతో నడిచే ప్యాసింజర్ రైళ్ల కోసం ప్రత్యేకంగా కొత్త లైన్లను నిర్మించింది. ప్రస్తుతం, ఇది మొత్తం 16 (ఎనిమిది నిలువు, ఎనిమిది క్షితిజ సమాంతరాలు) ట్రంక్ మార్గాలను విస్తరించే పనిలో ఉంది. 2030 నాటికి, మొత్తం రైలు మార్గం పొడవు 1,75,000 కిలోమీటర్లకు పెంచడానికి ప్రణాళిక రూపొందించారు. వీటిలో దాదాపు 55,000 కి.మీ. హై స్పీడ్, అల్ట్రా హై స్పీడ్ లైన్లుగా ఉంటాయి. రద్దీయే అసలు సమస్య భారత రైల్వే బోర్డు 2017–18లో ప్రాజెక్ట్ మిషన్ రఫ్తార్‌ను ప్రకటించింది. గంటకు 25 కిలోమీటర్లు ఉన్న సరుకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని రెట్టింపు చేయడం, ప్యాసింజర్ రైళ్ల వేగాన్ని ఐదేళ్లలో గంటకు 50 కి.మీ. నుండి 75 కి.మీ. వరకు పెంచడం లక్ష్యాలుగా దీన్ని ప్రకటించింది. కానీ, ‘కాగ్ ఆఫ్ ఇండియా’ తన నివేదికలో పేర్కొ న్నట్లుగా, ఈ ప్రణాళిక రైళ్ల వేగాన్ని పెంచడానికి దారితీయలేదు. చైనాలా భారతదేశం తన ప్రధాన ట్రంక్ మార్గాల్లో, ముఖ్యంగా స్వర్ణచతుర్భుజి, దానితోపాటు ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతాలను కలిపే కర్ణాలలో కొత్త జంట లైన్లను నిర్మించలేదు. భారతీయ రైల్వే ప్రధాన ట్రంక్ రూట్లలో తీవ్రమైన రద్దీ అనేది రైళ్ల వేగంలో స్తబ్ధతకూ, భద్రత విషయంలో పేలవమైన రికార్డ్కూ దోహదపడే ప్రాథమిక అంశంగా ఉంటోంది. గత 20 సంవత్స రాలుగా, భారతీయ రైల్వేలు విమాన, రోడ్డు రవాణాకు తన మార్కెట్ వాటాను స్థిరంగా కోల్పోతున్నాయి. సుమారు 10,000 కి.మీ.ల ట్రంక్ రూట్లలో సామర్థ్యం 125 శాతానికి మించి ఉంటోంది. ఈ తీవ్రమైన రద్దీ కారణంగా రైల్వే ట్రాక్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్ నిర్వహణ వ్యవస్థలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇది సమయపాలన లేక పోవడానికి దారితీస్తోంది. దీనివల్ల మితిమీరి పని చేయా ల్సిన డ్రైవర్లు, స్టేషన్ మాస్టర్లు, ట్రాక్‌మెన్ వల్ల భద్రతపై ప్రతికూల ప్రభావం పడుతోంది. 2005లో, రైల్వే బోర్డు 2,843 కి.మీ. పొడవుతో రెండు ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను (డీఎఫ్‌సీలు) నిర్మించాలని నిర్ణయించింది. భవిష్యత్తులో మరో మూడు కారి డార్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ డీఎఫ్‌సీలు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని పూర్తి చేయడానికి మరో రెండు నుండి నాలుగేళ్లు పట్టవచ్చు. ప్రత్యేక ప్యాసింజర్ లైన్లకు బదులుగా ప్రత్యేక సరకుల లైన్లను నిర్మించడంలోని అనుచితాన్ని గ్రహించి, రైల్వే బోర్డు మరిన్ని డీఎఫ్‌సీలను నిర్మించే ప్రణాళికను వాయిదా వేసినట్లు కనిపిస్తోంది. అనూహ్య వ్యయం భారతదేశం 2017లో ముంబై, అహ్మదాబాద్ మధ్య స్టాండర్డ్ గేజ్‌లో స్వతంత్ర అల్ట్రా హై స్పీడ్ (బుల్లెట్ రైలు) లైన్ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇలాంటి మరిన్ని లైన్ల కోసం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలను (డీపీఆర్‌లు) తయారు చేశారు. అనధికార అంచనాల ప్రకారం, ఈ లైన్‌కు ప్రతి కిలోమీటర్‌కు రూ.350 కోట్లు ఖర్చు అవు తుంది. ఈ వ్యయం 160 కిలోమీటర్ల సెమీ హైస్పీడ్ లైన్ కంటే 10 రెట్లు ఎక్కువ. అలాగే గంటకు 200–250 కిలోమీటర్ల హైస్పీడ్ లైన్ నిర్మాణ వ్యయం కంటే ఏడు రెట్లు ఎక్కువ. ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు లైన్ నిర్మాణ పురోగతి నెమ్మదిగా ఉండగా, మరిన్ని బుల్లెట్ రైలు మార్గాలను నిర్మించే ప్రణాళిక కూడా మందకొడిగా ఉంది. బ్రాడ్ గేజ్ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, భారతదేశం గంటకు 200–250 కిలోమీటర్లు ప్రయాణించే హై స్పీడ్ లైన్లను నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న 15,000 కిలోమీటర్ల ట్రంక్ మార్గాలను 160–200 కిలోమీటర్ల వేగానికి అప్‌గ్రేడ్ చేయాలి. దీనికీ, 10,000 కి.మీ. హై స్పీడ్ బ్రాడ్ గేజ్ లైన్ల నిర్మాణానికీ కలిపి దాదాపు రూ.7 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీన్ని 15 సంవత్సరాలలో పూర్తి చేయవచ్చు. ఈ విస్తరించిన, అప్‌గ్రేడ్ చేసిన నెట్వర్క్... 2060–2070 వరకు ప్రయాణికులు, సరకు రవాణా రెండింటి అవసరాలను తీర్చ గలిగే తగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తద్వారా రైల్వేలు భారత దేశ రవాణాకు జీవనాధారంగా తమ పాత్రను తిరిగి పొంద గలుగుతాయి. అలోక్ కుమార్ వర్మ వ్యాసకర్త ‘ఇండియర్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్’ (ఐఆర్ఎస్సీ)లో పనిచేశారు. (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
ఒడిశా రైలు ప్రమాద బాధితులకే ఈ డబ్బు: నిర్మాత
తాను హీరోగా నటిస్తూ నిర్మించిన ‘అనంత’ చిత్రానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ నుంచి వచ్చే ప్రతి రూపాయి (థియేటర్ ఖర్చులు పోను) ఇటీవల ఒడిశాలో ప్రమాదానికి గురైన ‘కోరమండల్’ ఎక్స్‌ప్రెస్ బాధితుల కుటుంబాల సహాయ నిధికి ఇవ్వనున్నామని ప్రశాంత్ కార్తీ పేర్కొన్నారు. గతంలో రామ్‌చరణ్ ‘ధృవ’, ‘చెక్’, రాంగోపాల్‌వర్మ ‘కొండా’ చిత్రాలలో నటించిన ప్రశాంత్ కార్తీ తాజాగా శ్రీనేత్ర క్రియేషన్స్ పతాకంపై ‘అనంత’ చిత్రాన్ని నిర్మించారు. ఆయన సరసన రిత్తిక చక్రవర్తి నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఒక నిమిషం 46 సెకన్ల నిడివిగల ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. (ఇదీ చదవండి: Jr NTR: ఎన్టీఆర్ కోసం క్రేజీ హీరోయిన్ను ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్) అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 9న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అని చిత్ర నిర్మాత, హీరో ప్రశాంత్ కార్తీ మీడియాతో ముచ్చటించారు. ‘‘మా తండ్రి సివిల్ కాంట్రాక్టర్. నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే ప్యాషన్. దాంతో సినిమాలలో నటించాలనే బలమైన కోరిక ఉండడంతో రామ్‌చరణ్ నటించిన ‘ధృవ’ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేసే అవకాశం దక్కింది. ఆ తరువాత ‘చెక్’, రాంగోపాల్ వర్మ ‘కొండా’ సినిమాలో నక్సలైట్ నాయకుడు ఆర్.కె. పాత్రలో నటించాను. అది నాకు మంచి పేరు తీసుకువచ్చింది. దయచేసి అందరూ థియేటర్స్‌లో ఈ సినిమాను రైలు ప్రమాద బాధితుల సహాయ నిధి కోసమైనా చూడాలని కోరుకుంటున్నా. మీ టిక్కెట్ డబ్బులు ఆయా కుటుంబాలకు ఎంతో కొంత సహాయపడితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది మీకు’’ అంటూ ముగించారు. (ఇదీ చదవండి: Custody Movie: ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన అమెజాన్ ప్రైమ్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?) -
ఆప్తుల ఆర్తనాదాలతో బహనాగా బజార్ రైల్వేస్టేషన్..
నిన్నటి వరకు ఎవరికీ తెలియని ఓ కుగ్రామం.. ఊహకందని విషాదంతో అపఖ్యాతి మూట గట్టుకుంది. రాష్ట్ర చరిత్రలో రక్తాక్షరాలతో వందలాది మంది క్షతగాత్రుల హాహాకారాలకు వేదికై ంది. ఎటుచూసినా గుట్టులుగా పడి ఉన్న మృతదేహాలతో యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. తెగిపడిన అవయవాలు.. నిస్సహాయుల రోదనలు.. ఆప్తుల ఆర్తనాదాలతో బహనాగా బజార్ రైల్వేస్టేషన్.. భీతావహంగా కనిపించింది. – భువనేశ్వర్/కొరాపుట్/రాయగడ బహనాగా బజార్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటన స్థలంలో భయానక దృశ్యాలు హృదయాన్ని కలచి వేశాయి. దుర్మరణం పాలైన వారి మృతదేహాలు ఘటనా స్థలంలో గుట్టలుగా పడి ఉన్నాయి. బంధు, మిత్ర వర్గాలు కోల్పోయిన ఆత్మీయులను గుర్తించేందుకు వీలైన సదుపాయాలను కల్పించడంలో రైల్వేశాఖ పూర్తిగా విఫలమైన అమానుష దృశ్యాలు తారసపడ్డాయి. శుక్రవారం రాత్రి సుమారు 7గంటలకు ప్రమాదం సంభవించగా.. శనివారం సాయంత్రం వరకు ఘటనా స్థలంలో మృతదేహాలను సురక్షితంగా పదిల పరచలేకపోవడం దీనికి తార్కాణంగా చెప్పవచ్చు. మృతదేహం సకాలంలో పదిల పరచకుంటే బాధిత కుటంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నా.. గుర్తించేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాధితులకు సకల సహాయ సహకారాలు అందజేస్తామని ప్రధాని మోదీ మొదలుకొని అన్ని స్థాయిల మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రకటించినా.. హామీలు నీటిమీద రాతలుగా తారసపడ్డాయి. ఎక్కడికక్కడ సహాయ కేంద్రాలు(హెల్ప్ డెస్క్) ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన ఘటనా స్థలం బహనాగ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఈ సదుపాయం వాస్తవంగా తారస పడకపోవడం విచారకరం. స్వచ్ఛంద సేవలు అమూల్యం.. ఘటనా స్థలం పరిసరాల్లో స్థానికులు, సంస్థలు ఇతరేతర వర్గాలు బాధిత వర్గాలకు అందజేసిన వాస్తవ సహాయ సహకారాలు అమూల్యం. తాగునీరు, ఆహారం ఏర్పాట్లు నిరవధికంగా అందించి, ఆదుకున్నారు. బాలాసోర్, భద్రక్, కటక్ 3 జిల్లాల్లో పలు ఆస్పత్రుల్లో చేరిన బాధితులకు ఇదే తరహా సేవలతో ఆపత్కాలంలో బంధువులుగా ప్రత్యక్షమయ్యారు. ఆచూకీ లేని లగేజీ.. ఘటనా స్థలంలో ప్రయాణికుల బ్యాగులు ఇతరేతర లగేజీ చిందరవందరగా పడి ఉంది. బాధితుల ఆచూకీ తెలుసుకోవడంలో అయిన వారు వర్ణనాతీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా దుర్మరణం పాలైన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కటక్ ఎస్సీబీలో 193మంది భర్తీ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో గాయపడిన 193మందిని కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. వీరిలో 9మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ఆస్పత్రి అత్యవసర అధికారి డాక్టర్ భువనానంద మహరణ తెలిపారు. చికిత్స కోసం భర్తీ అయిన వారిలో ముగ్గురు 18 ఏళ్ల లోపు యువకులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. దుర్ఘటన నేపథ్యంలో అత్యవసర వైద్య, చికిత్స సేవల కోసం ఆస్పత్రి నేత్ర చికిత్స వార్డు పైఅంతస్తులో అదనంగా 100 పడకలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. నా మిత్రుడు ఏమయ్యాడో? రైలు దుర్ఘటనలో అనేక విషాదాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్పత్రులలో కోలుకుంటున్న వారు నెమ్మదిగా వాస్తవ పరిస్థితిలోకి వస్తున్నారు. ప్రస్తుతం భద్రక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు సునీల్‌రామ్.. బీహార్‌కు చెందిన తన మిత్రుడు మనూ మహతో(25)తో కలిసి హౌరాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కా రు. వీరిద్దరూ చైన్నె వెళ్లాల్సి ఉంది. కానీ ఈ దుర్ఘట న జరగడంతో విడిపోయారు. ప్రస్తుతం సునీల్ భద్రక్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనతో కలిసి ప్రయాణం చేసి తప్పిపోయిన మిత్రుడు ఆచూకీ కోసం ఆందరినీ అభ్యర్థిస్తున్నాడు. – సునీల్‌రామ్, మోతుబరి, బీహార్ స్థానిక ప్రజలు చేసిన సహాయం మరువలేనిదని రైలు ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు చేసిన సహాయం మరువలేనిదని ముఖ్యమంత్రి నవీన్ పట్నయక్ కొనియాడారు. శనివారం ఉదయం ఘటన జరిగిన ప్రాంతాన్ని సలహాదారుడు 5టీ కార్తికేయ పాండ్యన్‌తో కలిసి సందర్శించారు. అప్పటికే చేరుకున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ శ్రీ వైష్ణవ్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలేశ్వర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి వెళ్లిన సీఎం క్షతగాత్రులను పరామర్శించారు. స్థానికులు సకాలంలో ఆదుకోకపోతే తాము బతికి ఉండేవాళ్లం కాదని పలువురు బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆస్పత్రి రోదనలతో మిన్నంటడంతో సీఎం కాసేపు మౌనం వహించారు. అనంతరం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడుతూ ఘటన ప్రాంతంలో స్థానికులు అందించిన సాయం మరువలేనిదని కొనియాడారు. దారి మళ్లిన రైళ్లు.. రాయగడ: బహనాగలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం కోస్తారైల్వే పలు రైళ్లను దారి మచినట్లు ప్రకటించింది. భువనేశ్వర్, బాలేశ్వర్ మీదుగా ప్రయాణించాల్సి పలు రైళ్లు.. విశాఖపట్నం నుంచి విజయనగరం, రాయగడ, టిట్లాఘడ్, సంబల్పూర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయన్నారు. తదుపరి ఉత్తర్వులు విడుదలయ్యే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయన్నారు. ► బెంగలూర్–అగర్తల హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్(12503) టిట్లాఘడ్, విజయనగరం మీదుగా ప్రయాణిస్తుంది. ► సిలిఘాట్–తంబారం(15630) రైలు రౌర్కెలా, టాట్లాఘడ్, విజయనగరం మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ► పాట్నా–ఎర్నాకులం(62644) రైలు అంగూ ల్, విశాఖపట్నం మీదుగా చేరుకుంటుంది. ► దాఘా నుంచి విశాఖపట్నం(22873) చేరాల్సిన రైలు సంబల్పూర్, అనుగూల్ మీదుగా ప్రయానిస్తుంది. ► బెంగళూర్–గౌహతి(12509) ఎక్స్‌ప్రెస్ రైలు విజయనగరం, టిట్లాఘడ్, టాటానగర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ► సికింద్రబాద్–హౌరా(12704) రైలును తాత్కాలికంగా రద్దు చేశారు. ► గుణుపూర్–విశాఖపట్నం(08521) పాసింజర్ రైలు 3గంటలు ఆలస్యంగా విశాఖపట్నం చేరుకుంటుంది. సీఎం నవీన్‌తో ఉదయనిధి స్టాలిన్ భేటీ ముఖ్యమంత్రి నవీన్ పట్నయక్తో తమిళనాడుకు చెందిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ భేటీ అయ్యారు. ఆ రాష్ట్రమంత్రి ఎస్ఎస్ శివకుమార్‌తో కలిసి శనివారం రాత్రి భువనేశ్వర్‌లో నవీన్ నివాస్‌లో సంప్రదింపులు చేశారు. రైల్వే దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. 5టీ కార్యదర్శి కార్తికేయ పాండ్యన్ ప్రమాద వివరాలు ఉదయనిధికి వివరించారు. ఇదిలా ఉండగా.. ఘటన జరిగిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, మంత్రులు, అధికారులను ఘటనా స్థలానికి పంపించారు. చైన్నె నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి, క్షతగాత్రుల బంధువులు ఒడిశా చేరుకునే చర్యలు తీసుకున్నారు. ప్రమాద తీవ్రత పెరగడంతో స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని నవీన్ వద్దకు పంపి.. సానుభూతి ప్రకగించారు. ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్.. రైలు ప్రమాదంలో గాయపడి భద్రక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ శనివారం పరామర్శించారు. వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు చికిత్స అందించాలని సూచించారు. మంత్రి ప్రమీల మల్లిక్ పరామర్శ.. బహనగా రైలు ప్రమాద ఘటనలో గాయపడి బాలేశ్వర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ప్రమీల మల్లిక్ పరామర్శించారు. క్షతగాత్రులకు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను సంబంధిత అధికారులు పంపిణీచేస్తున్నారు. ఇందులో భాగంగా సొరొ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు రూ.50 వేలు చొప్పున అందిస్తున్నారు. రాజకీయాలకు సమయం కాదు: మమతా బెనర్జీ అంతకుముందు వచ్చిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రోటోకాల్ పక్కన పెట్టి ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది రాజకీయాల సమయం కాదని, సహాయక చర్యల సమయంగా ప్రకటించారు. మృతులలో 60శాతం మంది బెంగాలీలు ఉన్నారన్నారు. బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున్న పరిహారాన్ని బెంగాల్ ప్రభుత్వం అందజేస్తుందని ప్రకటించారు. పరామర్శించిన కేంద్రమంత్రులు.. ఘటనా స్థలాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్, కేంద్ర విద్య, మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించారు. వీరివురూ ఒడిశా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంతరం ఇరువురూ కలిసి భద్రక్, బాలాసోర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి, తెలుసుకున్నారు. సత్వర చికిత్స అందించాలని సూచించారు. వారితో పాటు కేంద్ర మాజీమంత్రి, బాలాసోర్ ఎంపీ ప్రతాప్‌చంద్ర షడంగి ఉన్నారు. -
అత్యంతఘోర రైలు ప్రమాదాలు..: మృత్యు శకటాలు
ఒడిశా రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కోరమాండల్, హౌరా రైళ్ల ప్రమాద దృశ్యాలు భారతీయుల హృదయాలను కలచివేస్తున్నాయి. మన దేశంలో 1981లో బిహార్‌లో భాగమతి నదిలో పడిపోయిన రైలు ప్రమాదం ఇప్పటి వరకు అతి పెద్దది. ఈ ప్రమాదంలో 800 మందికిపైగా మరణించారు. అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇప్పటికీ మనల్ని భయపెడుతూనే ఉన్నాయి. మన దేశ చరిత్రలో... 1. పాసింజర్ రైలు రాష్ట్రం : బీహార్ తేదీ : జూన్ 6, 1981 మృతుల సంఖ్య : 800 దేశంలో అతి పెద్దదే కాకుండా ప్రపంచంలో రెండో అతి పెద్ద రైలు ప్రమాదం ఇది. 1981 సంవత్సరం జూన్ 6న బీహార్‌లోని మన్సి నుంచి సహస్రకు వెళుతున్న పాసింజర్ రైలు భాగమతి నది వంతెనపై నుంచి వెళుతుండగా పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 800 మందికి పైగా మరణించారు. భయానకమైన తుఫాన్ బీహార్‌ను వణికిస్తున్న సమయంలో రైలులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు తేలింది. నదిలో శవాలు కొట్టుకుపోవడంతో మృతుల సంఖ్యపై భిన్నకథనాలు వెలువడ్డాయి. మృతుల సంఖ్య 2 వేల వరకు ఉండవచ్చునని కూడా వార్తలు వచ్చాయి. నాలుగు పెళ్లి బృందాలు రైల్లో ఎక్కతే ఒక్కరి ప్రాణం కూడా మిగల్లేదు. 2 కాళింది–పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ రాష్ట్రం : ఉత్తరప్రదేశ్ తేదీ : ఆగస్టు 20, 1995 మృతుల సంఖ్య : 350కి పైగా ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో రెండు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1995 సంవత్సరం ఆగస్టు 20 తెల్లవారుజమాను 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కాన్పూర్ నుంచి లక్నోకి వెళుతున్న ఈ రైలు నీల్గాయ్ సమీపంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో నిలిచింది. పూరీ నుంచి వస్తున్న పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న కాళిందిని ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. 3. అవధ్ ఎక్స్‌ప్రెస్–బ్రహ్మపుత్ర మెయిల్ రాష్ట్రం : పశ్చిమ బెంగాల్ తేదీ : ఆగస్టు 2, 1999 మృతుల సంఖ్య : 300 పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల ఉండే గైసాల్ స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ నుంచి వస్తున్న అస్సాం అవద్ ఎక్స్‌ప్రెస్, గైసాల్ రైల్వే స్టేషన్లో ఉన్న బ్రహ్మపుత్ర మెయిల్‌ని ఢీకొట్టడంతో 300 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలతో ఒకే లైన్లోకి రెండు రైళ్లు రావడంతో ప్రమాదం జరిగింది 4. ఇండోర్–పట్నా ఎక్స్‌ప్రెస్ రాష్ట్రం : ఉత్తరప్రదేశ్ తేదీ : నవంబర్ 20, 2017 మృతుల సంఖ్య : 150 మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి బీహార్‌లో పట్నా వరకు వెళుతున్న ఇండోర్ పాట్నా ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 150 మందికిపైగా మరణించారు. 5. డెల్టా ప్యాసింజర్ రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్ తేదీ : అక్టోబర్ 29, 2005 మృతుల సంఖ్య : 120 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నల్లగొండ జిల్లా వలిగొండ వద్ద సంభవించిన భారీ వరదలకు పట్టాలు కొట్టుకుపోవడంతో డెల్టా పాసింజర్ పట్టాలు తప్పింది. రైలులో 15 బోగీలు నీట మునిగాయి. ఈ ప్రమాదంలో 120 మంది వరకు జలసమాధి అయ్యారు. ప్రపంచ చరిత్రలో.. మాటలకందని మహా విషాదాలన్నో ప్రపంచ రైల్వే చరిత్రలో కన్నీటిని మిగిల్చాయి. 2004లో వచ్చిన సునామీ రాకాసి అలలు ఒక రైలునే ఏకంగా సముద్రంలో కలిపేయడం అత్యంత ఘోరమైన ప్రమాదంగా నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో 1700 మంది జలసమాధి అయ్యారు. క్వీన్ ఆఫ్ ది సీ : శ్రీలంక ఏడాది: 2004 మృతులు: 1700 ప్రపంచ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం 2004లో సునామీ వచ్చినప్పుడు శ్రీలంకలో జరిగింది. ది క్వీన్ ఆఫ్ సీ రైలు శ్రీలంక టెల్వాట్ట మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో సముద్రం అలలు ముంచేసి రైలు బోగీలను సముద్రంలోకి ఈడ్చుకెళ్లాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 1700 మంది ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ మిషెల్: ఫ్రాన్స్ ఏడాది : 1917 మృతులు: 700 ఫ్రాన్స్ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదం 1917లో జరిగింది. సెయింట్ మిషెల్–డి–మౌరినె ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 700 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ఫ్రాన్స్‌లోని ఈ రైలు సెయింట్ మిషెల్ దగ్గర పట్టాలు తప్పింది. సియారా : రుమేనియా ఏడాది : 1917 మృతులు : 600 ఒకే ఏడాది ఫ్రాన్స్, రుమేనియాలో ఒకే విధంగా రైలు ప్రమాదాలు జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అతి వేగంగా వస్తున్న రుమేనియాలో రైలు సియారా రైల్వే స్టేషన్ సమీపంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో పట్టాలు తప్పింది. అప్పుడు రైల్లో ఎక్కువగా సైనికులు, జర్మనీ శరణార్థులు ఉన్నారు. 800 మంది ప్రాణాలు కోల్పోయారు. గౌడలాజర ట్రైన్ : మెక్సికో ఏడాది : 1915 మృతులు : 600 మెక్సికోలో 2015 జనవరిలో గౌడలాజర రైలు మితి మీరిన వేగంతో వెళుతుండగా పట్టాలు తప్పింది. కొలిమా నుంచి గౌడలాజర వెళుతుండగా రైలు బ్రేకులు ఫెయిల్ కావడంతో పట్టాలు తప్పిన రైలు పక్కనే ఉన్న లోయలో పడిపోవడంతో 600 మంది మరణించారు. ఉఫా : రష్యా ఏడాది : 1989 మృతులు : 575 రష్యాలోని ఉఫా నుంచి ఆషా మధ్య రెండు పాసింజర్ రైళ్లు పక్క పక్క నుంచి వెళుతుండగా గ్యాస్ పైప్‌లైన్ పగిలిపోయి మంటలు చెలరేగాయి. క్షణాల్లో బోగీలకు అంటుకోవడంతో 575 మంది ప్రాణాలు కోల్పోయారు. -
మృతులు 300కు చేరువలో...
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా మూడు రైళ్ల ప్రమాదం దేశమంతటినీ తీవ్ర విషాదంలో ముంచేసింది. శుక్రవారం షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రాత్రి ఏడింటి ప్రాంతంలో బహనగా రైల్వేస్టేషన్ సమీపంలో మెయిన్ ట్రాక్ నుంచి లూప్ లైన్లోకి వెళ్లడం, దానిపై ఆగి ఉన్న గూడ్స్‌ను గంటకు 128 కి.మీ. వేగంతో ఢీకొనడం తెలిసిందే. దాని బోగీలు పక్క ట్రాక్‌పై పడటం, అదే సమయంలో దానిపై బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీకొని పట్టాలు తప్పడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 70 మందికి పైగా మరణించినట్టు తొలుత భావించినా మృతుల సంఖ్య భారీగా పెరిగింది. చిక్కుకుపోయిన బోగీలను విడదీస్తూ గాలింపు కొనసాగిన కొద్దీ శవాలు భారీగా బయట పడుతూ వచ్చాయి. 288 మంది మరణించినట్టు ఇప్పటిదాకా తేలింది. 1,175 మందికి పైగా గాయపడ్డారు. వారందరినీ సమీపంలోని పలు ఆస్పత్రుల్లో చేర్చారు. వీరిలో 700 మందికి పైగా డిశ్చార్జి కాగా మిగతా వారు ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరికాస్త పెరిగేలా కన్పిస్తోంది. ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి రిజర్వుడ్ ప్రయాణికులే 2,400 మంది దాకా ఉన్నారు. వీరు గాక జనరల్ బోగీల్లో భారీ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. అంతా కలిపి 3,000 మందికి పైగా ఉంటారని చెబుతున్నారు. ప్రమాదానికి సిగ్నల్ వైఫల్యమే ప్రధాన కారణమని రైల్వే శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. సమగ్ర దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేశారు. ఘటనా స్థలిని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సందర్శించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు మరో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అదనపు పరిహారాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆయన వెంట ఉన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. అంతకుముందు ఈ ఉదంతంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రైల్వేతో సహా పలు శాఖ ఉన్నతాధికారులతో మోదీ ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు ఆయనకు వివరించారు. ప్రమాద స్థలి నుంచి బాధితుల తరలింపు దాదాపుగా పూర్తయింది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్తో పాటు వేలాది మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మోదీ, రైల్వే మంత్రి బదులివ్వాల్సిన ప్రశ్నలెన్నో ఉన్నాయని విపక్ష కాంగ్రెస్ మండిపడింది. పెను విషాద సమయం గనుక సహాయక చర్యలు పూర్తవడానికే ప్రస్తుతానికి ప్రాధాన్యమిస్తున్నామని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. కోరమండల్‌కు కలిసిరాని శుక్రవారం కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం కలిసిరావడం లేదు. గత 20 ఏళ్లలో ఈ రైలు మూడుసార్లు ప్రమాదానికి గురైంది. అవన్నీ శుక్రవారమే జరిగాయి. పైగా వాటిలో రెండు ప్రమాదాలు ఒడిశాలోనే చోటుచేసుకున్నాయి. హౌరా–చెన్నై మధ్య నడిచే కోరమండల్ మూడుసార్లూ చెన్నై వెళ్తూనే ప్రమాదానికి గురైంది! 2009లో ఒడిశాలోని జైపూర్ వద్ద తొలిసారి ప్రమాదం జరిగింది. అప్పుడు 16 మంది చనిపోయారు. తర్వాత 2022 మార్చిలో నెల్లూరు వద్ద జరిగిన రెండో ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. తాజా ప్రమాదం మూడోది. లోకో పైలట్లకు గాయాలు భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో లోకోపైలట్ జీఎన్ మహంతి, సహాయ లోకో పైలట్ హజారీ బెహరా తీవ్రంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ఇరువురూ ప్రాణాలతో బతికి బయటపడ్డారు. వీరిని ఆస్పత్రిలో చేర్పించి, ఉన్నత స్థాయి చికిత్స అందిస్తున్నారు. జీఎన్ మహంతికి పక్కటెముక విరిగింది. దుర్ఘటనలో ఊపిరితిత్తులు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో అంతర్గత రక్తస్రావమైనట్లు వైద్యులు తెలిపారు. హజారీ బెహరా ఎడమకాలి ఎముక విరగడంతో శస్త్రచికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. -
వార్‌జోన్‌ను తలపించిన ప్రమాద స్థలం..
బాలాసోర్/హౌరా: మూడు రైలు ప్రమాదాల బాధితుల సహాయార్థం 200 అంబులెన్సులు, పదుల సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వ బస్సులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మొబైల్ హెల్త్ యూనిట్స్ మోహరించారు. 1,200 మంది అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ సిబ్బంది అలుపు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఒకబోగీపై మరో బోగీ పడటంతో భూమిలోకి కూరుకుపోయిన బోగీలను తీసేందుకు క్రేన్స్, బుల్డోజర్స్ ఏర్పాటు చేశారు. కానీ ఆ భారీ కోచ్‌లను తొలగించడానికి అవి పనికి రాలేదు. కోల్‌కతా నుంచి ప్రత్యేక క్రేన్లు తెప్పిస్తే తప్ప.. పైన పడ్డ బోగీలను తీయలేమని, అప్పుడే కింది వాగన్లను తొలగించడానికి వీలవుతుందని సిబ్బంది తెలిపారు. ‘బోగీలు నేలకు అతుక్కుపోయాయి. ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి గుర్తించలేనంత వికృతంగా శవాలు మారిపోయాయి. వర్ణించలేనంత భయంకరంగా అక్కడి దృశ్యాలున్నాయి’ అని ప్రయాణికుల్లో ఒకరు మీడియాతో పంచుకున్నారు. కంపార్ట్మెంట్ నుంచి విసిరేసినట్టుగా.. ‘రైల్వే ట్రాక్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. నుజ్జునుజ్జయిన బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. కొన్ని ఒకదాని మీదకు ఒకటి ఎక్కాయి. కొన్నయితే.. తాబేలు తరహాలో నేలకు అతుక్కుపోయాయి’ అని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లాకు చెందిన బ్రెహంపూర్ వాసి పీయూష్ పోద్దార్ వివరించారు. ఆయన ఉద్యోగం కోసం కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో తమిళనాడు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ‘ఉన్నట్టుండి రైలు పట్టాలు తప్పడంతో బోగీ ఒకవైపు పడిపోయింది. చాలామందిమి కంపార్టుమెంట్ బయట విసిరేసినట్టుగా పడ్డాం. ప్రమాదం నుంచి ఎలాగోలా పాక్కుంటూ బయటికి వచ్చేసరికే ఎక్కడ చూసినా శవాలే కనిపించాయి’ అని పోద్దార్ తెలిపారు. అదృష్టవశాత్తూ పోద్దార్ ఫోన్ సురక్షితంగా ఉండటంతో బంధువులకు ఫోన్ చేశాడు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ ఆయన.. ముందు ఇంటికి చేరుకుని, ఆ తరువాతే చికిత్స చేయించుకుంటానంటున్నాడు. స్థానికుల సహాయం.. ‘‘పెద్దపెద్దగా అరుపులు వినిపించడంతో ఘటన జరిగిన స్థలానికి చేరుకున్నాం. రైలు పట్టాలు తప్పి, బోగీలు పక్కకు పడి కనిపించాయి. బోగీలు నుజ్జయిపోయి ఇనుము కుప్పగా కనబడింది’’ అని ఆ పక్కనే నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు తెలిపారు. వెంటనే.. బాధితులను బయటికి లాగడం, మంచి నీటిని అందించడం, రక్తం కారుతున్నవారికి బ్యాండేజ్ కట్టడం వంటి సాయం చేశామని కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేస్తున్న 45 ఏళ్ల ఫోర్‌మెన్ దీపక్ బేరా తెలిపారు. యుద్ధ వాతావరణం.. క్షతగాత్రులను బాలాసోర్, సోరో, భద్రక్, జాజ్‌పూర్, కటక్‌లోని ఎస్సీబీ మెడికల్‌కాలేజీ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద జరిగిన చోట సహాయక చర్యల్లో పాల్గొనేందుకు భువనేశ్వర్ ఎయిమ్స్ డాక్టర్ల బృందాలను బాలాసోర్, కటక్ ఆస్పత్రులకు పంపించామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. బాధితుల విలువైన ప్రాణాలను కాపాడేందుకు వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను తాము అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. బెడ్లు, స్ట్రెచర్లు, ఆస్పత్రి కారిడార్లు.. ఎక్కడ చూసినా గాయాలతో రక్తమోడుతున్న బాధితులతో బాలాసోర్ జిల్లా ఆస్పత్రి మొత్తం వార్‌జోన్‌ను తలపించింది. ఈ ఒక్క ఆస్పత్రిలోనే 526 మందిని చేర్చారు. బాధితులంతా పలు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో భాషాపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతూనే వైద్య సిబ్బంది చికిత్స అందించారు. శవాల గుట్టలతో... ప్రమాదం కారణంగా అనేక రైళ్లు రద్దవ్వడం, కొన్ని రైళ్లు దారి మళ్లించడంతో బాధితుల బంధువులు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఆలస్యమవుతోంది. దీంతో మృతదేహాల గుర్తింపు ఇంకా పూర్తి కాలేదు. తెల్లటి వస్త్రాలు చుట్టిన శవాల గుట్టలతో ఆస్పత్రి ఆవరణ నిండిపోయింది. ఒక్కసారిగా భారీ శబ్దం.. ఆపై చీకటి! రైలు ప్రమాద బాధితుల అనుభవాలు కోల్‌కతా: మరికొద్ది సేపట్లో తమ రైలు బాలాసోర్‌కు చేరుకుంటుందనగా రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించిందనీ, బెర్త్‌లపై నుంచి తాము కిందపడిపోవడం, బోగీలో అంధకారం అలుముకుందని బెంగళూరు–హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుప్రయాణికులు కొందరు తాము ఎదుర్కొన్న భయానక అనుభవాలను వివరించారు. ఒడిశాలో ప్రమాద ఘటనలో బెంగళూరు–హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే, పట్టాలు తప్పని 17 బోగీలతో 635 ప్రయాణికులతో ఈ రైలు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హౌరాకు చేరుకుంది. అందులో క్షతగాత్రులైన సుమారు 50 మంది ప్రయాణికులకు సహాయక సిబ్బంది వైద్య చికిత్సలు అందించారు. క్షతగాత్రుల్లో అయిదుగురిని ఆస్పత్రికి తరలించారు. రైల్వే అధికారులు అందరికీ ఆహారం అందించారు. ఈ సందర్భంగా కొందరు ప్రయాణికులు పీటీఐతో తమ అనుభవాలను పంచుకున్నారు. షెడూŠయ్ల్కు మూడుగంటలు ఆలస్యంగా బెంగళూరు–హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరినట్లు మిజాన్ ఉల్ హక్ చెప్పారు. ‘బాలాసోర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉందనగా రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించింది. బోగీ అటూఇటూ కదలడం మొదలైంది. అప్పర్ బెర్త్ నుంచి కిందపడిపోయా. కంపార్ట్మెంట్లో లైట్లన్నీ ఆరిపోయాయి. చీకట్లు అలుముకున్నాయి’అని హక్ చెప్పారు. బర్దమాన్‌కు చెందిన హక్ కర్ణాటకలో జీవనోపాధి నిమిత్తం వెళ్లారు. దెబ్బతిన్న కోచ్ నుంచి అతికష్టమ్మీద బయటపడ గలిగినట్లు హక్ చెప్పారు. అప్పటికే చాలా మంది తీవ్ర గాయాలతో ప్రయాణికులు ధ్వంసమైన బోగీల్లో పడి ఉన్నారని చెప్పారు. బెంగళూరుకు చెందిన రేఖ కోల్‌కతా సందర్శనకు ఇదే రైలులో వస్తున్నారు. ‘ప్రమాదం కారణంగా అంతటా గందరగోళంగా మారింది. మా బోగీ నుంచి దిగి బయటకు వచ్చాము. ఆ చీకట్లోనే పక్కనే ఉన్న పొలాల్లో కూర్చున్నాం. హౌరా ఎక్స్‌ప్రెస్ ఉదయం తిరిగి బయలుదేరే వరకు అక్కడే ఉండిపోయాం’అని రేఖ చెప్పారు. బర్దమాన్‌కు చెందిన మరో ప్రయాణికుడు కూడా బెంగళూరు నుంచి వస్తున్నారు. ఈయనకు చాతీ, కాలు, తల భాగాలకు గాయాలయ్యాయి. కంపార్టుమెంట్ అద్దాలు పగులగొట్టుకుని బయటకు దూకామని ఆయన అన్నారు. -
రైల్వే భద్రతపై లఘు చిత్రాలతో అవగాహన
సాక్షి, హైదరాబాద్: రైల్వేభద్రతపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. రైలు ప్రమాదాల నియంత్రణ, ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లఘు చిత్రాల ద్వారా అవగాహన కల్పించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. గురువారం ఇక్కడ డీజీపీ అంజనీకుమార్ అధ్యక్షతన స్టేట్ లెవల్ సెక్యూరిటీ కమిటీ ఫర్ రైల్వేస్ (ఎస్ఎల్ఎస్సీఆర్) సమావేశం నిర్వహించారు. రైల్వే అడిషనల్ డీజీపీ బి.శశిధర్‌రెడ్డి, శాంతిభద్రతల అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్, సికింద్రాబాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ రాజారామ్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవీ.. ►రైల్వే ట్రాక్‌లపై మరణాలు, రైళ్లలో మానవ అక్రమ రవాణా, రైళ్లలో చోరీల కట్టడి, కదులుతున్న రైళ్లపై రాళ్ల దాడుల నియంత్రణకు అవసరమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ►రైల్వే ట్రాక్‌ల సమీపంలో నివాసం ఉండే ప్రజలకు రైల్వే ట్రాక్‌లపై పాటించాల్సిన జాగ్రత్తలు, ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లు, రైళ్లలో మొబైల్ చోరీలు వంటి అంశాల్లో జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా లఘు చిత్రాల నిర్మాణం ►రైళ్లో మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేసేలా మత్తు పదార్థాల రవాణా ముఠాలపై చట్టపరమైన చర్యలు, రైలు టికెట్ బుకింగ్‌లో అక్రమాల కట్టడికి చర్యలు ►రైల్వే ట్రాక్‌లు, ప్లాట్‌ఫాంలపై ప్రమాదాలతోపాటు మృతుల గణాంకాలు వెల్లడిస్తూ ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా హెచ్చరించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. -
‘వందేభారత్’ రైలుకు వరుస ప్రమాదాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
ముంబై: గుజరాత్– మహారాష్ట్ర రాజధానుల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన వందే భారత్ సెమీ స్పీడు రైలుకు వరుస ప్రమాదాలు జరుగుతుండటంపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఎవరైనా రైల్వేట్రాక్ వెంబడి పశువులను వదిలితే చట్ట పరంగా చర్యలు తప్పవని హెచ్చరించింది. ముంబై–గాంధీదీనగర్ రైల్వే మార్గం వెంబడి ఉన్న చుట్టుపక్క గ్రామాల సర్పంచ్‌లను రైల్వే భద్రతా విభాగం అధికారులు కలసి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌రైలుకు పశువులు అడ్డం వచ్చి ఆగిపోయిన వరుస ఘటనలు జరిగిన గ్రామాల పెద్దలకు నోటీసులు జారీ చేశారు. రైల్వే ట్రాక్ వెంబడి పశువులను నిర్లక్ష్యంగా వదలొద్దని, సంబంధిత పశు యజమానులతో మాట్లాడే బాధ్యతలను గ్రామ సర్పంచ్‌లకు అప్పగించారు. రైల్వే ట్రాక్‌లపై ఎవరైనా పశువుల్ని నిర్లక్ష్యంగా వదిలితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని ఈ సందర్భంగా హెచ్చరించారు. సెపె్టంబరు 30న గాం«దీనగర్– ముంబై మార్గంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్నుంచి ఇప్పటివరకు వందేభారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పశువులు ఢీకొట్టడంతో ఆటంకం ఏర్పడిన ఘటనలు తరచూ జరిగాయి. గత శనివారం గుజరాత్‌లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో పశువులను ఢీకొట్టి వందేభారత్ రైలు ఆగిపోయింది. అంతకుముందు అక్టోబర్ 6, 7 తేదీల్లో కూడా ఇవే ఘటనలు జరగడంతో రైలు ముందుభాగం కొంతమేర దెబ్బతింది. దీంతో రైల్వే భద్రతా విభాగం దృష్టి సారించింది. ఎక్కువమొత్తంలో పశువులు ఉన్న యజమానులతో ఆయా గ్రామాల పెద్దలు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది. అయినప్పటికీ పశువులను రైల్వే ట్రాక్‌లపై నిర్లక్ష్యంగా వదులుతూ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ప్రొవిజన్స్ ఆఫ్ రైల్వే యాక్టు 1989, సెక్షన్ 154, ప్రకారం ఒక ఏడాదిపాటు జైలుశిక్ష, జరిమాన, లేదా రెండింటిని అ మలు చేయవచ్చని, సెక్షన్ 147 ప్రకారం ఆర్నెల్ల పా టు జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా, లేదా రెండూ అమలు చేయవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. -
మృత్యు శకటాలు.. 8 నెలల్లో రైలు నుంచి పడి 415 మంది మృతి
సాక్షి, ముంబై: ముంబైకర్లకు లైఫ్ లైన్‌గా పేరుగాంచిన లోకల్ రైళ్లు ప్రయాణికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. గడచిన ఎనిమిది నెలల్లో సెంట్రల్, హార్బర్, పశ్చిమ రైల్వే మార్గాలలో నడుస్తున్న రైళ్ల నుంచి కిందపడి ఏకంగా 415 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఇదే ఎనిమిది నెలల్లో మూడు రైల్వే మార్గాలపై 1,605 మంది వివిధ కారణాలవల్ల మరణించినట్లు ముంబై లోకల్ రైల్వే పోలీసు రికార్డుల్లో నమోదైంది. అంటే ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రైలు నుంచి కిందపడి, వివిధ కారణాలవల్ల మొత్తం 2,020 మంది మరణించినట్లు స్పష్టమవుతోంది. కరోనా అదుపులోకి రావడంతో ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసింది. దీంతో ముంబై జనజీవనం యథాతథంగా గాడిన పడింది. కాని లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ గతంతో పోలిస్తే లోకల్ రైళ్లలో ప్రతీరోజు 20 లక్షల మంది ప్రయాణికులు తగ్గిపోయారని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో రద్దీ తగ్గిపోయి డోరు బయట వేలాడే వారి సంఖ్య తగ్గిందని రైల్వే పోలీసులు అంటున్నారు. మరోపక్క ఏసీ లోకల్ రైళ్లు ప్రవేశపెట్టడం వల్ల వాటి డోర్లు మూసుకోవడంతో రైలు నుంచి కిందపడే వారి సంఖ్య తగ్గుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. కాని వాస్తవ పరిస్ధితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో (సబర్బన్ రైల్వే స్టేషన్లలో మరియు చుట్టుపక్కల), రైలు సర్వీసులు లేవని భావించి, లైన్లు దాటడం ద్వారా ప్రజలు షార్ట్ కట్లను తీసుకుంటారని, ఇదే ప్రమాదానికి కారణమవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కోవిడ్ సమయంలో ఇలాంటి అనేక ప్రమాదాలు జరిగాయని గుర్తు చేస్తున్నారు. అయితే, రైల్వే లైన్లలో మరణాలకు అక్రమ ఎంట్రీ పాయింట్లే కారణమని పౌరులు పేర్కొంటున్నారు. ‘రైల్వేలు రెండు ప్లాట్‌ఫారమ్‌లను కలిపే ట్రాక్‌ల మధ్య కంచెలు వేయాలి, ట్రాక్ క్రాసింగ్‌ల సంఖ్యను తగ్గించాలి. రద్దీ, నడుస్తున్న రైళ్ల నుండి పడిపోయే వ్యక్తుల సమస్యను తగ్గించడానికి లోకల్ రైళ్ల తలుపులు మూయడం లాంటి మరిన్ని ప్రయోగాలు చేయాలి’ అని వారు అంటున్నారు. ఒకప్పుడు లోకల్ రైళ్లలో ఉదయం, సాయంత్రం వేళ్లలో మాత్రమే విపరీతంగా రద్దీ ఉండేది. ఇంటికి తొందర చేరుకోవాలనే తపనతో డోరు వద్ద వేలాడుతూ ప్రయాణించేవారు. కాని ఇప్పుడు అనేక ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య సంస్ధలు తమ ఉద్యోగులకు వేర్వేరు షిప్టుల్లో విధులు అప్పగించడంతో పగలు కూడా రద్దీ ఉంటుంది. ఫలితంగా పనులకు చేరుకునే సమయంలో, విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో వేలాడుతూ ప్రయాణించక తప్పడం లేదు. దీంతో ఉదయం, సాయంత్రం అని తేడా లేకుండా వేలాడుతూ ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో నడుస్తున్న రైలు నుంచి కందపడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగినట్లు స్పష్టమైతోంది. ముఖ్యంగా రైలు పట్టాలు దాటుతూ మృతి చెందుతున్న వారి సంఖ్య మొదటి స్ధానంలో ఉండగా రైలు నుంచి పడి మృతి చెందుతున్నవారి సంఖ్య రెండో స్ధానంలో ఉంది. ఎనిమిది నెలల్లో వివిధ కారణాలవల్ల మొత్తం 1,605 మంది మృతి చెందగా, అందులో పట్టాలు దాటుతూ 767 మంది మృతి చెందిన వారున్నారు. రైల్వే పోలీసులు అందించిన వివరాల ప్రకారం 2019 జనవరి నుంచి ఆగస్టు వరకు నడుస్తున్న రైలు నుంచి కిందపడి 405 మంది మృతి చెందగా అంతే సంఖ్యలో గాయపడ్డారు. అదేవిధంగా 2020లో అదే ఎనిమిది నెలల్లో 306 కిందపడి గాయపడగా 142 మంది మరణించారు. 2021లో 244 మంది గాయపడగా 142 మృతి చెందారు. కాని 2022లో ఎనిమిది నెలల్లో రైలు పట్టాలు దాటుతూ 767 మంది మృతి చెందగా 140 గాయపడ్డారు. గడచిన ఎనిమిది నెలల్లో లోకల్ రైళ్లు, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల కిందపడి గాయపడిన, మృతి చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మృతుల్లో, గాయపడిన వారిలో పురుషులే ఎక్కువ ఉన్నారు. కాగా ఈ ఎనిమిది నెలల్లో లోకల్ రైలు నుంచి కిందపడి 642 మంది గాయపడగా 415 మంది చనిపోయారు. మృతుల్లో 38 మంది మహిళలుండగా 377 మంది పురుష ప్రయాణికులున్నారు. -
బ్రేకేయకున్నా ఢీకొట్టలే!
సాక్షి, హైదరాబాద్: శుక్రవారం మధ్యాహ్నం 1.05 గంటలు.. వికారాబాద్ రైల్వే సెక్షన్ పరిధిలోని గొల్లగూడ–చిట్టిగడ్డ మధ్య ప్రాంతం.. ఒకవైపు నుంచి రైలు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది.. అదే ట్రాక్‌పై ఎదురుగా లోకో ఇంజిన్ 80 కిలోమీటర్ల వేగంతో వస్తోంది.. రెండింటి మధ్య దూరం 600 మీటర్లే.. అయినా దేనికీ బ్రేకులు వేయలేదు.. కానీ చూస్తుండగానే రెండూ ఆటోమేటిగ్గా వేగం తగ్గించుకున్నాయి. రెండింటి మధ్య 380 మీటర్ల దూరం ఉందనగా ఆగిపోయాయి. అంటే ఎదురెదురుగా దూసుకొస్తున్న రైళ్లు బ్రేకులతో ప్రమేయం లేకుండా, లోకో పైలట్ల (రైలు నడిపేవారు) జోక్యం లేకుండానే ఆగిపోయి ప్రమాదాన్ని నివారించాయి. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ‘కవచ్’ పరిజ్ఞానమే దీనికి కారణం. తొలుత టి–కాస్ పేరుతో రూపొందిన ఈ పరిజ్ఞానంపై ఎనిమిదేళ్లుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. తాజాగా మేకిన్ ఇండియాలో భాగంగా ‘కవచ్’ పేరిట పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. మరో విశేషం ఏమిటో తెలుసా.. ఇలా ఒకేట్రాక్‌పై దూసుకొచ్చిన ఓ రైలులో స్వయంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉండగా.. ఎదురుగా వచ్చిన ఇంజన్లో రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో వినయ్ కుమార్ త్రిపాఠీ ఉన్నారు. త్వరలోనే ‘కవచ్’ను దేశవ్యాప్తంగా రైళ్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో దీనిని స్వయంగా పరిశీలించేందుకు రైల్వే మంత్రి ఈ పరీక్షలో పాల్గొన్నారు. కవచ్ సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం అయిందని చెబుతున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. చిత్రంలో ఎంపీ అర్వింద్ తదితరులు కిలోమీటరుకు రూ. 50 లక్షల ఖర్చు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘కవచ్’ పూర్తిస్థాయిలో విజయవంతం కావటం గర్వకారణమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రశంసించారు. ‘‘కవచ్ అద్భుతంగా పనిచేస్తుందని ధీమాగా చెప్పగలను. అందుకే బహిరంగంగా, అందరి సమక్షంలో ప్రయోగించి చూశాం. దీన్ని దేశవ్యాప్తంగా.. ఏటా నాలుగైదు వేల కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేస్తాం. కవచ్ పరిజ్ఞానం కోసం కిలోమీటర్‌కు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఖర్చవుతుంది. అదే యూరోపియన్ పరిజ్ఞానానికైతే కిలోమీటర్‌కు రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుంది. పైగా కవచ్ వాటి కంటే సమర్థవంతమైనది. అందుకే దీన్ని సగర్వంగా ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేస్తాం’’ అని రైల్వే మంత్రి చెప్పారు. అన్ని రూల్స్.. ఆటోమేటిగ్గా.. ►తొలుత రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ విడివిడిగా రెండు రైళ్లలో బయలుదేరారు. సనత్‌నగర్ దాటాక ఒకేట్రాక్లో ముందు మంత్రి ఉన్న రైలు, వెనుక బోర్డు చైర్మన్ ఉన్న రైలు ప్రయాణించాయి. ముందున్న రైలుకు వెనకాల ఉన్న రైలు చేరువగా వచ్చే ప్రయత్నం చేసింది. లోకో పైలట్ బ్రేకు వేయకున్నా.. వెనకాల ఉన్న రైలు దానంతట అదే వేగం తగ్గి, ఆగిపోయింది. ►ఒకచోట మధ్యలో రెడ్ సిగ్నల్ పడినా లోకోపైలట్ బ్రేకు వేయకుండా ముందుకు నడిపించారు. కానీ ఆటోమేటిగ్గా బ్రేకు పడి రైలు ఆగిపోయింది. ►లెవల్ క్రాసింగ్ వద్ద నిర్ధారిత దూరం నుంచి హారన్ మోగించాలి. కానీ లోకోపైలట్ మోగించకున్నా.. నిర్ధారిత ప్రాంతానికి చేరుకోగానే ఆటోమేటిక్‌గా రైలు కూత వేసింది. ►లూప్లైన్లో వెళ్లేప్పుడు గంటకు 20 కిలోమీటర్ల లోపు వేగం ఉండాలన్న నిబంధన ఉంది. వేగంగా నడిపేందుకు లోకో పైలట్ ప్రయత్నించినా రైలు దానంతట అదే వేగం తగ్గింది. ►పెద్ద మలుపులో రైలుగరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లు మించొద్దు. అంతకన్నా వేగంగా నడిపితే రైలు ఆటోమేటిగ్గా ఆ వేగానికి తగ్గిపోయింది. ఎలా పనిచేస్తుంది? రైల్వే అనుబంధ పరిశోధన సంస్థ ‘రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)’ కవచ్ పరిజ్ఞానాన్ని రూపొందిం చింది. కొన్ని దేశీ పరిశ్రమలు పరికరాలను తయారు చేసి సమకూర్చాయి. 2013లో ట్రెయిన్ కొలీజన్ అవాయిడెన్స్ సిస్టం(టీకాస్)పేరుతో.. వికారాబాద్–వాడీ–సనత్ నగర్ సెక్షన్ల మధ్య ప్రయోగాలు చేసి, అభి వృద్ధి చేశారు. ప్రత్యేక కవచ్ యంత్రాలను రైల్వేస్టేషన్లలో, రైళ్లలో అమరుస్తారు. ట్రాక్ పై ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున ఆర్ఎఫ్ఐడీ ట్యాబ్‌లను అమర్చుతారు. రేడి యో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల కోసం నిర్ధారిత ప్రాం తాల్లో 40 మీటర్ల ఎత్తు ఉండే టవర్లను ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్ టవర్, జీపీఎస్, రేడియో ఇంటర్ఫేజ్లతో అన్నిం టినీ అనుసంధానిస్తారు. ఈ మొత్తం పరి జ్ఞానం ఎప్పటికప్పుడు రైళ్లను పరిశీలిస్తుం టుంది. లోకోపైలట్ ముందుండే స్క్రీన్‌లో సమాచారం డిస్ప్లే అవుతుంది. మంచు, రాత్రి సమయాలు, ఇతర కారణాలతో మసకగా ఉన్నప్పుడు.. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిగ్నల్ కూడా స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఏ చిన్న సమస్య చోటుచేసుకున్నా.. వెంటనే లోకోపైలట్‌ను, స్టేషన్‌లోని అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా పరస్పరం సమాచారాన్ని కూడా పంపించుకోవచ్చు. కొత్త ధైర్యం వచ్చింది ‘‘కవచ్‌తో ఎంతో దూరం నుంచి కూడా సిగ్నళ్లను తెలుసుకోగలం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రమాదాలకు అవకాశం ఉండదు. ప్రయాణికులకు పూర్తి ధైర్యం, నమ్మకాన్ని కల్పించగలం. మాకు కూడా కొత్త ధైర్యం వచ్చింది’’ – జీఎస్ ప్రసాద్, రైలు లోకో పైలట్ -
రైల్వే మరణాలు 0
న్యూఢిల్లీ: ఈ ఏడాది రైలు ప్రమాదాల వల్ల ఒక్క ప్రయాణికుడు కూడా మరణించలేదని భారత రైల్వే ప్రకటించింది. దీంతో రైల్వే చరిత్రలోనే ఈ ఏడాది చాలా సురక్షితమైనదిగా నమోదైందని అధికారులు వెల్లడించారు. సిబ్బంది చనిపోయారని, ప్రయాణికులు చనిపోలేదని తెలిపారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 16 మరణాలు, 2017–18లో 28, 2016–17 మధ్య కాలంలో 195 మరణాలు సంభవించాయి. అదే 1990–95 మధ్య కాలంలో సరాసరి ఏటా 500 రైల్వే ప్రమాదాలు జరిగేవి. ఈ ఐదేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 2,400 మరణాలు సంభవించగా, 4,300 మంది గాయపడ్డారు. 2013–18 మధ్య కాలంలో ఏటా 110 ప్రమాదాలు జరగ్గా, ఈ ఐదేళ్లలో 990 మంది చనిపోగా, 1,500 మంది గాయపడ్డారని సమాచారం. కొన్నేళ్లుగా రైల్వేలో యాక్సిడెంట్లు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. -
ప్రయాణికులకు బోగిభాగ్యం
సాక్షి, హైదరాబాద్: వేగంగా వెళ్లే రైలులో ఒక్క బోగీ పట్టాలు తప్పినా దాని వెనక ఉండే ఇతర బోగీలు పరస్పరం గుద్దుకుని ఒకదానిపై ఒకటి ఎక్కటం సహజం. ప్రతి రైలు ప్రమాదాల్లో ఈ తరహా దృశ్యాలే కనిపిస్తాయి. భారీ ప్రాణనష్టం జరగడానికి ప్రధాన కారణం కూడా ఇలా బోగీలు ఒకదానిపైకి ఒకటి దూసుకుపోవటమే. ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా రైల్వే శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టనుంది. ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు ఒకదానిపైకిఒకటి దూసుకుపోవటానికి కారణం ప్రస్తుతం ఉన్న పాత పద్ధతి కప్లింగ్సే అనే విషయాన్నీ ఆ శాఖ గుర్తించింది. దీంతో వాటిని సమూలంగా మార్చేందుకు సిద్ధమైంది. గతంలోనే దీన్ని గుర్తించి కొత్త తరహా కప్లింగ్స్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. అయితే వాటిల్లోనూ కొన్ని సమస్యలు ఉత్పన్నమవడంతో నిలిపివేసింది. తాజాగా అమెరికాలో వినియోగంలో ఉన్న కప్లర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ తరహా కప్లర్స్ ఏర్పాటు చేస్తే బోగీలు పరస్పరం ఢీకొనటం అనేది జరగదు. అలాగే ప్రయాణంలో కుదుపులు లేకుండా సౌకర్యంగా ఉండనుంది. రైల్వే ఆధునికీకరణలో భాగంగా రైల్వే శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. ఏఏఆర్ హెచ్ కప్లర్స్.. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ రైల్ రోడ్ ఫర్ హైస్పీడ్.. ఇదో విదేశీ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా బోగీలను అనుసంధానించే కప్లింగ్ వ్యవస్థతో ఉత్పన్నమవుతున్న సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక పరికరాల్ని రూపొందించింది. ప్రస్తుతమున్న సీబీసీకి దీన్ని అనుసంధానించాలని మన రైల్వే నిర్ణయించింది. ఆ పరికరం ఏర్పాటుతో వేగంగా వెళ్తున్న రైలు బ్రేకు వేసినా, నెమ్మదిగా వెళ్లే రైలు ఒక్కసారిగా వేగాన్ని పెంచినా ఏర్పడే భారీ కుదుపులను ఇది నిరోధించనుంది. ఈ పరికరం ఏర్పాటుతో రైళ్లలో కుదుపుల సమస్యకు విరుగుడు కలగనుంది. అవసరం ఏంటి..? ఇప్పటివరకు మన రైళ్లలో ఐఆర్ఎస్ స్క్రూ టైప్ సంప్రదాయ కప్లింగ్ వ్యవస్థే వాడకంలో ఉంది. ఇది తొలితరం కప్లర్. రెండు బోగీలను చివరలో కొండీలు ఉండే గొలుసు లాంటి దానితో బంధించి మధ్యలో భారీ స్క్రూను ఏర్పాటు చేస్తారు. ఇంజన్ మొదలు, బోగీల వరకు ఒకదానికొకటి అనుసంధానించే వ్యవస్థ ఇదే. బోగీలు పట్టాలు తప్పినప్పుడు ఈ లింక్ విడిపోయి బోగీలు పరస్పరం ఢీకొని ఒకదానిపైకి ఒకటి ఎక్కి భారీ ప్రాణనష్టానికి కారణమవుతోంది. దీంతో ఈ సంప్రదాయ కప్లర్స్‌ను తొలగించి వాటి స్థానంలో సెంటర్ బఫర్ కప్లర్స్‌ను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించారు. కానీ కొన్ని బోగీలకే వాటిని ఏర్పాటు చేయగలిగారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటికీ 3,378 కోచ్‌లకు సంప్రదాయ కప్లర్స్ ఉండగా, కేవలం 1,238 కోచ్‌లకు మాత్రమే సీబీసీ ఏర్పాటు చేశారు. ఇక వేగంగా మిగతా వాటికి కూడా సీబీసీలను ఏర్పాటు చేయడంతోపాటు కొత్తగా తయారయ్యే బోగీలన్నింటికీ వాటినే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ.. ఈ సీబీసీతో కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. ఇప్పుడు వాటిని అధిగమించేందుకే అమెరికా తరహా ఏఏఆర్ హెచ్ కప్లర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవి మామూలు కుదుపులు కాదు.. హైదరాబాద్‌కు చెందిన నలుగురు మిత్రులు రైలులో ఢిల్లీ బయలుదేరారు. కాసేపటికి వారి బోగీలకు టీవాలా రావటంతో వీరు కొనుక్కుని తాగుతూ మాట ల్లో పడిపోయారు. ఇంతలో రైలు బ్రేకు వేయటంతో పెద్ద కుదుపు.. చేతిలోని టీ వారి మీద ఒలికిపోయింది. ఇక రాత్రి పడుకున్నాక ఇలాగే కుదుపులు ఏర్పడి సైడ్ బెర్త్‌పై పడుకున్న వారి తలలు రైలు గోడకు కొట్టుకోవాల్సి వచ్చింది. ఇంతటి భారీ కుదుపులతో ప్రయాణికులు బెంబేలెత్తారు. అలాంటి కుదుపులతో రైలు పట్టాలు తప్పిందేమోనని భయపడి హడలి పోయారు. సీబీసీ కప్లర్స్ ఏర్పా టు చేసిన రైల్లోనే ఈ కుదుపులు ఏర్పడుతున్నాయి. దీంతో రైల్వే శాఖ మంత్రి వరకు ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన ఆరా తీయగా, కుదుపులకు సీబీసీ కప్లింగ్ వ్యవస్థనే కారణమని తెలిసింది. పట్టాలు తప్పినప్పుడు బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కకుండా చేసి ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ఇవి ఉపయోగపడుతున్నా.. ఈ కుదుపులు మాత్రం భరించలేనివిగా ఉన్నాయి. దీం తో అధికారులు ఏఏఆర్ హెచ్ పరికరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీబీసీ కప్లర్స్ ఉన్న అన్ని కోచ్‌లకు వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. వీటివల్ల కుదుపుల్లేని ప్రయాణమే కాకుండా, శబ్దం తక్కువగా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కప్లింగ్ ఏర్పాటు చేసేప్పుడు తక్కువ సిబ్బంది అవసరం పడుతుందని, మార్చే క్రమంలో సిబ్బం ది ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు. -
రైలు ప్రమాదాలు తగ్గాయ్..
సాక్షి, న్యూఢిల్లీ: రైలు ప్రమాద మృతుల సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గినట్లు రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 75 ప్రమాదాలు జరిగాయి. 40 మంది మృతి చెందారు. గత ఐదేళ్లలో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. భద్రతా పరంగా రైల్వే శాఖ తీసుకుంటున్న చర్యల ఫలితంగానే ప్రమాదాలతో పాటు మృతుల సంఖ్య కూడా తగ్గించగలిగామని రైల్వే శాఖ పేర్కొంటోంది. 2016 సెప్టెంబర్ నుంచి 2017 ఆగస్టు మధ్య 80 ప్రమాదాలు జరగ్గా 249 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. 2016 నవంబర్‌లో కాన్పూర్ దగ్గర ఇండోర్–పాట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘోర ప్రమాదంలో 150 మంది చనిపోయారు. 2017 ఆగస్టులో ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 20 మంది చనిపోయారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఉత్తరప్రదేశ్‌లో ఓ స్కూల్వ్యాన్ను రైలు ఢీకొట్టడంతో 13 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ కాలంలో ఈ రెండే పెద్ద ప్రమాదాలని రైల్వే శాఖ తెలిపింది. గాయాలయిన వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. గత సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు మధ్య రైలు ప్రమాదాల్లో గాయపడిన వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. 272 నుంచి 12కు క్షతగాత్రుల సంఖ్య తగ్గింది. మెరుగ్గా రైల్వే ట్రాక్ నిర్వహణ , పాత బోగీల స్థానంలో అధునాతన కోచ్‌ల ఏర్పాటు, బోగీల నిర్వాహణపై గత నాలుగేళ్లుగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గించగలిగామని రైల్వే శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. పట్టాలను ఎప్పటికప్పుడు మార్చడం, భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం, మెరుగైన భద్రతా చర్యల కోసం ఉద్యోగులకు నిరంతర శిక్షణ, పర్యవేక్షణ కూడా ప్రమాదాల్లో క్షతగాత్రుల సంఖ్య తగ్గడానికి కూడా కారణాలుగా చెబుతున్నారు. కాపలాలేని క్రాసింగ్ వద్ద కూడా వాహనచోదకులు నిర్లక్ష్యంగా పట్టాలు దాటడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రమాదాల సంఖ్య కూడా ఇటీవల తగ్గిందని కూడా రైల్వే శాఖ అధికారులు చెప్పారు. 2016–17లో 13 ప్రమాదాలు జరగ్గా గత సెప్టెంబర్ నుంచి ఆగస్టు వరకు ఎనిమిది మాత్రమే ప్రమాదాలు జరిగాయన్నారు. ఈ తరహా ప్రమాదాలను కూడా తగ్గించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. గాంధీ జయంతి రోజు రైళ్లలో శాకాహారమే జాతిపిత మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రైళ్లలో ఐఆర్సీటీసీ శాకాహార భోజనమే సరఫరా చేయనుంది. ఆ రోజు ప్రత్యేక శాకాహార వంటకాలను ప్రయాణికులకు అందజేయనున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ప్రయాణికులు ఆ రోజు మాంసాహారాన్ని ఆర్డర్ చేసే అవకాశం లేదని పేర్కొంది. ఇది ఆ ఒక్క రోజుకు మాత్రమే పరిమితమని ఐఆర్సీటీసీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రైల్వే బోర్డు గతవారం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అన్ని జోన్ల రైల్వే శాఖలు ఆ రోజు శాకాహార మెనును అమలు చేయనున్నాయి. ఈ స్పెషల్ మెనూలో స్టఫడ్ పరాటాలు, కుల్చా, పన్నీరు వంటకాలను భోజనంలో అందించనున్నారు. -
రైలు ప్రమాదం.. హర్షం వ్యక్తం చేసిన జనం!!
ఫొటోలు చూడగానే ఏమనిపించింది.. ఏదో విషాదం సంభవించింది అనేగా.. అయితే.. ఇక్కడ చోటుచేసుకున్నది విషాదం కాదు.. వినోదం.. ఎందుకంటే.. ఇక్కడీ రైళ్లను కావాలనే గుద్దించేశారు!! 1890–1940 మధ్య కాలంలో అమెరికాలో ఈ తరహా ‘రైలు ప్రమాదాలు’ సూపర్‌హిట్. రెండు రైళ్లు ఒకదానికెదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొంటే.. దాన్ని చూడ్డానికి జనం వేలాదిగా తరలివచ్చేవారు. టికెట్ రూ.100 చొప్పున అమ్మేవారు. జోసెఫ్ కనోలీ అనే ఆయన అయితే.. ఏకంగా 73 విజయవంతమైన షోలు చేశాడు. ఒక్కదానిలోనూ ఎవరికీ గాయాలు కాలేదట. ఈ రైళ్లు 60–70 కిలోమీటర్ల వేగంతో వచ్చి.. గుద్దుకునేవి. ఈ సమయంలో బోగీలు ఒకదానిపైకి మరొకటి ఎక్కేయకుండా వాటిని ఇనుప గొలుసులతో కట్టేవారు. బాయిలర్ పేలకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. ఈ షోల కోసం పాత రైలు ఇంజిన్లను వాడేవారు. ట్రైన్ స్టార్ట్ చేసి డ్రైవర్లు దిగిపోయేవారు. అవి గుద్దుకోగానే జనం కేరింతలు కొట్టేవారు.. వాటి దగ్గర ఫొటోలు తీసుకునేవారు. 1896లో టెక్సాస్‌లో జరిగిన ‘రైలు ప్రమాద’ షోలో మాత్రం బాయిలర్లు పేలిపోయాయి. ఇనుప ముక్కలు తగిలి ఇద్దరు చనిపోగా.. ఓ పత్రిక ఫొటోగ్రాఫర్ కన్నుపోయింది. అయినప్పటికీ.. వీటి క్రేజ్ తగ్గలేదు. మరింత పెరిగింది. తర్వాతి కాలంలో ఈ తరహా షోలు తగ్గుముఖం పట్టాయి. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
రైలు పట్టాలకు డ్రోన్ల రక్షణ!
రైల్వే ట్రాక్‌ల భద్రత, సంరక్షణకు ఇకపై లైన్మెన్లు రేయింబవళ్లు కష్టపడాల్సిన పనిలేదు. లైన్మెన్లకు ఊరటనిచ్చే ఓ సరికొత్త విధాన రూపకల్పన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఐఐటీ రూర్కీ విద్యార్థులకు అప్పజెప్పింది. రైల్వే ట్రాక్‌ని అనునిత్యం పర్యవేక్షించే డ్రోన్ల తయారీతో ఐఐటీ రూర్కీ ఈ విధానానికి రూపకల్పన చేయబోతోంది. టెలికం ఇండస్ట్రీ, రైల్వే ప్రోత్సాహంతో ఐఐటీ రూర్కీ తయారు చేసిన రైల్వే ట్రాక్‌ని పర్యవేక్షించే డ్రోన్లను ఉత్తరాఖండ్‌లో తొలిసారిగా పరీక్షించారు. త్వరలోనే రైల్వేలో ప్రవేశ పెట్టబోయే ఈ డ్రోన్లపై పేటెంట్ కోసం ఐఐటీ రూర్కీ ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ట్రాక్ పర్యవేక్షణకు మాత్రమే ఉపయోగపడే ఈ డ్రోన్లను భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆపదలో ఉన్న వారిని గుర్తించి, రక్షించేందుకు ఉపయోగించే వీలుందంటున్నారు నిపుణులు. సమర్థవంతమైన రైల్వేల నిర్వహణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించాలన్న కేంద్ర ప్రభుత్వ యోచనలో భాగంగా ఈ డ్రోన్లను తయారు చేసి త్వరలోనే ప్రవేశ పెట్టనున్నామని ఇండియన్ రైల్వే అధికార ప్రతినిధి ఆర్డీ బాజ్‌పేయ్ వెల్లడించారు. ఇప్పటికే జబల్పూర్, భోపాల్, కోటా డివిజన్లలో రైల్వే ట్రాక్ పర్యవేక్షణకు వీటిని ఉపయోగించినట్టు తెలిపారు. 2017–18లో రైళ్లు 54 సార్లు పట్టాలు తప్పాయి. గతేడాది 78 సార్లు, 2010–11లో 141 పర్యాయాలు రెళ్లు పట్టాలు తప్పాయి. 2016–17లో రైల్వే ప్రమాదాల్లో గాయపడిన వారూ, మరణించిన వారూ 607 మంది. గతేడాది రైలు ప్రమాదాల్లో మరణించిన, గాయపడిన వారి సంఖ్య 254కి తగ్గింది. ట్రాక్‌ల వీడియో దృశ్యాలూ, ఫొటోలను తీసే డ్రోన్ల ద్వారా పర్యవేక్షించే వీలుంటుంది కనుక రైలు ప్రమాదాలను భారీగా తగ్గించొచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
ప్రమాదంలో ప్రయాణం
సాక్షి, సిటీబ్యూరో : ఏపీఎక్స్ప్రెస్లో జరిగిన ప్రమాదం పగటి పూట సంభవించడంతో పెను ముప్పు తప్పింది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండే సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే మరో తమిళనాడు ఎక్స్‌ప్రెస్, గౌతమి ఎక్స్‌ప్రెస్ దారుణాలను తలపించి ఉండేది. గ్వాలియర్ సమీం లోని బిర్లా స్టేషన్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో రెండు ఏసీ బోగీలు దగ్ధమైన సంఘటన రైల్వే శాఖ డొల్లతనాన్ని, భద్రతా వైఫల్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది. కేవలం పగటి వేళ కావడంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉన్నందున సురక్షితంగా బయటపడగలిగారు. పేలుడు పదార్ధాలు, విద్యు త్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ముప్పును ముందే పసిగట్టి నివారించడంలో రైల్వేశాఖ విఫలమవుతోంది. ఈ క్రమంలో వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గతంలో మహబూబ్‌బాద్ జిల్లా, కేసముద్రం వద్ద గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో డీజిల్ సరఫరా చేస్తుండగా మంటలంటుకొని సుమారు 70 మంది మృత్యువాతపడ్డారు. ఆ ఉదంతాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే మూడేళ్ల క్రితం నెల్లూరు వద్ద తెల్లవారు జామున తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో సంభవించిన పేలుడు కారణంగా 30 మందికి పైగా చనిపోయారు. మరోవైపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తరచుగా బోగీలు కాలిపోతున్నా రైల్వే యంత్రాంగం మొద్దు నిద్రను వీడడం లేదు. బెంబేలెత్తిస్తున్న వరుస సంఘటనలు.... తమిళనాడు ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనకు ముందు నగరంలోని ఫలక్‌నుమా రైల్వేస్టేషషన్లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా డెమూ ప్యాసింజర్ రైలుకు చెందిన 3 బోగీలు దగ్ధమయ్యాయి. అంతకు కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ యార్డ్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ బోగీకి నిప్పంటుకోవడంతో దగ్ధమైంది. 2013లో నాంపల్లి రైల్వేస్టేషషన్ వద్ద నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక బోగీ కాలిపోయింది. 2007లో సికింద్రాబాద్ నుంచి నాంపల్లి స్టేషన్‌కు వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా రెండు బోగీలు కాలిపోయాయి. నగరంలో జరిగిన ఈ ప్రమాదాల్లో అదృష్టవశాత్తు ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఈ అన్ని దుర్ఘటనల్లోనూ విద్యుత్ సరఫరాలో సాంకేతిక లోపాలే ప్రధాన కారణమని రైల్వే భద్రతా కమిషన్ తేల్చిచెప్పింది. మరోవైపు గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో డీజిల్ వంటి పేలుడు పదార్ధాల సరఫరా కూడా కారణమని నిర్ధారించారు. ప్రమాదాలు జరిగినప్పుడు భద్రతా కమిటీలు కారణాలపై నివేదికలు సమర్పిస్తున్నాయి. మానవ తప్పిదాల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న అధికారులు బాధ్యులను విధుల నుంచి తప్పిస్తున్నారు. అయితే ముప్పును ముందస్తుగా గుర్తించి చర్యలు తీసుకోవడంలో మాత్రం రైల్వే యంత్రాంగం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోతోంది. అతి కీలకమైన విభాగాల్లో సిబ్బంది కొరత, నైపుణ్యం లేని కాంట్రాక్ట్ వర్కర్లు, ఎలక్ట్రికల్ విభాగంలోనూ నైపుణ్యత లోపించడం తదితర అంశాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. రైళ్లలో తగినంత మంది భద్రతా సిబ్బంది లేకపోవడంతో తేలిగ్గా పేలుడు పదార్ధాల రవాణా జరుగుతోంది. తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్–11 బోగీలో పేలుడు పదార్థాల కారణంగానే పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నట్లు గుర్తించారు. నిపుణుల కొరత... సాధారణంగా రైళ్లు బయలుదేరడానికి ముందు 6 గంటల పాటు పిట్‌లైన్‌లో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. వివిధ అంశాలపై పూర్తిగా తనిఖీ చేసిన అనంతరం ట్రైన్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ (టిఎక్స్ఆర్) బ్రేక్ పవర్ సర్టిఫికెట్‌ను అందజేస్తుంది. ఈ సర్టిఫికెట్ పొందిన అనంతరమే రైలు బయలుదేరాలి. అయితే అటు పిట్లైన్లలోనూ, ఇటు స్టేషన్న్లలోనూ సిబ్బంది కొరత కారణంగా నాణ్యత లోపిస్తోంది. పిట్‌లైన్‌లో ఒక రైలును 16 మంది ఎలక్ట్రికల్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తనిఖీ చేయాల్సి ఉండగా కేవలం 5 నుంచి 6 గురు మాత్రమే చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఎలాంటి నైపుణ్యం, కనీస విద్యార్హతలు లేని వారిని కాంట్రాక్ట్ సిబ్బందిగా నియమించి ఏసీ బోగీల నిర్వహణ వంటి కీలకమైన విధులను అప్పగించడం కూడా షార్ట్‌సర్క్యూట్‌లకు కారణమవుతున్నట్లు సమాచాఉరం. విడిభాగాలూ కరువే ... రైళ్ల మరమ్మతులకు అవసరమైన నట్లు, బోల్టుల నుంచి కీలకమైన విడిభాగాలు సైతం కరువయ్యాయి. దీంతో విశ్రాంతిలో ఉన్న రైలు విడిభాగాలను తీసి రన్నింగ్ ట్రైన్‌కు బిగిస్తున్నారు. రైలును ఆపడంలో కీలకమైన బ్రేక్బ్లాక్స్ ఒక్కొక్క బోగీకి 16 చొప్పున అవసరమవుతాయి. అయితే వీటి కొరత తీవ్రంగా ఉండటంతో ఆగి ఉన్న మరో రైలు బ్రేక్బ్లాక్స్ను తొలగించి ఉపయోగిస్తున్నారు. ఇవి కూడా చాలా వరకు అరిగిపోయి ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. షాక్అబ్జర్వర్లకు కొరత ఉందని, కోచ్‌ల మధ్య డాష్పాట్స్కు, కాంపోజిట్ రింగ్‌లకు నడుమ బిగించే కీలకమైన బఫర్ప్యాడ్స్ కూడా సరఫరా చేయడం లేదని మెకానికల్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో రైళ్లను తనిఖీ చేసేందుకు అవసరమైన హెడ్లైట్లు కూడా తగినన్ని లేకపోవడం వల్ల చీకట్లోనే తనిఖీలు నిర్వహించవలసి వస్తోందన్నారు. బోగీల్లో సీసీ కెమెరాలు అవసరం... ఇలాంటి ఘోర ప్రమాదాలు తరచూ జరుగుతున్నా రైల్వే అధికారులు గుణపాఠం నేర్వడం లేదు. ప్రతి 2 బోగీలకు ఒక టిటిఈ ఉండాల్సి ఉండగా సిబ్బంది కొరత కారణంగా ఒక టిటిఈ 4 బోగీలను పర్యవేక్షించవలసి వస్తోంది. ఈ పరిస్థితుల్లో బోగీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే కొంతవరకు నిఘా లోపాన్ని అధిగమించేందుకు అవకాశం ఉండేది. రైళ్లలో టీ, కాఫీ విక్రయించే వారు యధేచ్ఛగా బోగీల్లో హీటర్లను వినియోగిస్తున్నా రైల్వే భద్రతా సిబ్బంది వారిని నియంత్రించడం లేదు. -
రైలు ప్రమాదాల నివారణకు ‘టీసీఏఎస్’
సాక్షి, హైదరాబాద్: రైలు ప్రమాదాల నివారణకు దక్షిణ మధ్య రైల్వే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. ఒకే పట్టాలపై ఎదురెదురుగా వచ్చే రైళ్లు సిగ్నలింగ్ వ్యవస్థ లోపం, డ్రైవర్ల నిర్ల క్ష్యం కారణంగా తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో భారీగా ప్రాణనష్టం సంభవిస్తోంది. దీనిని అధిగమించేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. రెండు రైళ్లు ఒకే పట్టాలపై ఎదురెదురుగా వచ్చినా ప్రమాదం జరగకుండా నివారించే పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. అదే ‘ట్రైన్ కోలిషన్ ఎవాయిడ్ సిస్టమ్’ (టీసీఏఎస్). మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే తొలిసారి తయారు చేసిన ఈ డివైజ్‌కు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రమైంది. శనివారం లింగంపల్లి–వికారాబాద్ సెక్షన్లో జరిపిన ట్రయల్‌రన్‌ను రైల్వేబోర్డు ట్రాక్షన్ సభ్యులు ఘన్‌శ్యామ్‌సింగ్, దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. టీసీఏఎస్ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసి అమల్లోకి తెస్తే రైలు ప్రమాదాల నియంత్రణలో కీలకమైన ముందడుగు కాగల దని ఘన్‌శ్యామ్ అభిప్రాయపడ్డారు. ఎలా పని చేస్తుందంటే... టీసీఏఎస్ ఒక ఎలక్ట్రానిక్ డివైజ్. దీనిని రైలు ఇంజిన్లలో అమరుస్తారు. ఇది ఉన్న రైళ్లు ఒకదానికి ఒకటి ఎదురుగా వచ్చినప్పుడు డివైజ్‌లోని సెన్సార్లు పనిచేస్తాయి. సిగ్నలింగ్ సంకేతాలు వెలువడుతాయి. రైళ్లు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడే టీసీఏఎస్ పనిచేస్తుంది. ఒక ఇంజిన్ నుంచి మరో ఇంజిన్‌కు సంకేతాలు అందుతాయి. దీంతో రైళ్లు అకస్మాత్తుగా నిలిచిపోతాయి. దక్షిణ మధ్య రైల్వేలోని సుమారు 600కు పైగా రైళ్లకు ఈ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేయాలంటే వందల కోట్లు ఖర్చు కావచ్చని అధికారుల అంచనా. మెయింటెనెన్స్ యార్డు ప్రారంభం శనివారం లింగంపల్లి రైల్వేస్టేషన్లో మెయింటె నెన్స్ యార్డును త్వరలో రిటైర్డ్ కానున్న కార్మికుని చేతుల మీదుగా ప్రారంభించారు. గౌతమి, కోకెన డ ఎక్స్‌ప్రెస్ రైళ్లు లింగంపల్లి నుంచే నడిపేందు కు యార్డు నిర్మించినట్లు అధికారులు తెలిపారు. -
ఇక రైలు ప్రమాదాలకు చెక్
సాక్షి, న్యూఢిల్లీ: శీతాకాలంలో పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలపై ప్రయాణీకులకు ఇక ఎలాంటి బెంగ అవసరం లేదు. దట్టమైన మంచు ఆవరించినా రైళ్లు భద్రతపై రాజీపడకుండా గంటకు వంద కిమీ వేగంతో పరిగెత్తేలా రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రయాణీకుల రైళ్లలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలను అమర్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇన్ఫ్రా రెడ్, లేజర్ టెక్నాలజీతో కూడిన ఈ పరికరాలు రెండు కిలోమీటర్ల వరకూ ట్రాక్‌ల్లో ఎలాంటి లోపాలున్నాయో ఇట్టే పసిగడతాయి. త్రినేత్రగా పిలిచే ఈ పరికరం పనితీరును ఇప్పటికే పరీక్షించారు. ప్రయాణీకుల రైళ్లలో వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ పరికరంలో ఉండే ఇన్ ఫ్రా రెడ్, లేజర్ కిరణాలు రెండు కిలోమీటర్ల దూరం వరకూ ట్రాక్‌ల పరిస్థితిని పరిశీలించి, ఎలాంటి లోపాలున్నా ట్రైన్లో అమర్చిన స్ర్కీన్‌పై డిస్ప్లే చేస్తాయి. దెబ్బతిన్న ట్రాక్‌లు, పగుళ్లను కూడా ఇవి పసిగట్టి అప్రమత్తం చేయనుండటంతో రైలు ప్రమాదాలనూ అరికట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా పరీక్షించిన క్రమంలో ట్రాక్‌లపై ఉన్న చిన్న వస్తువులను సైతం కనీసం 500 మీటర్ల ముందుగా ఈ పరికరం గుర్తించిందని రైల్వే అధికారులు చెప్పారు.త్రినేత్ర పరికరం ద్వారా రైళ్లు ఢీకొనడం, పట్టాలు తప్పడం, లెవెల్ క్రాసింగ్ ప్రమాదాలు వంటి పలు అనర్ధాలను ఎదుర్కోవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి వెల్లడించారు. త్వరలోనే ఈ పరికరం అన్ని రైళ్లలో అందుబాటులోకి రానుంది. -
వీఐపీ సంస్కృతికి 650 మంది బలి
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా పట్టాలు తప్పడం వల్ల 346 రైలు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో దాదాపు 650 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో ఐదు రోజుల్లోనే పట్టాలు తప్పడం వల్ల రెండు రైలు ప్రమాదాలు జరగడంతో తాను పదవికి రాజీనామా చేస్తానని అప్పుడు రైల్వే మంత్రిగా ఉన్న సురేశ్ ప్రభు ప్రకటించారు. అప్పటికీ ఆయనకు సర్దిచెప్పిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ తర్వాత ఆ శాఖ నుంచి ఆయన్ని తప్పించారు. అప్పుడు కేంద్ర రైల్వే బోర్డుకు చైర్మన్‌గా ఉన్న ఏకే మిట్టల్ మాత్రం తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో కొత్తగా రైల్వే బోర్డు చైర్మన్‌గా ఆగస్టు 25వ తేదీన బాధ్యతలు స్వీకరించిన అశ్వణి లొహాని రైలు పట్టాలు తప్పడం వల్లనే దేశంలో ఎక్కువగా రైలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయన్న అంశంపై లోతుగా అధ్యయనం చేయడంతో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రైలు పట్టాలు ఎక్కడ తెగిపోయాయో, ఎక్కడ పగుళ్లు పట్టాయో తెలుసుకొని ఎప్పటికప్పుడు వాటిని మరమ్మతు చేయడానికి వాటిపై నిరంతర నిఘా అవసరం. అలా నిఘాను కొనసాగించి మరమ్మతులు చేసే రైల్వే సిబ్బందిని గ్యాంగ్‌మెన్ అని, ట్రాక్ మెన్ అని, రైల్వే డీ క్యాడర్ ఉద్యోగులని పిలుస్తారు. భారత రైల్వేలో దాదాపు ఇలాంటి ఉద్యోగులు రెండు లక్షల మంది పనిచేస్తున్నారు. రైల్వే గేట్లులేని క్రాసింగ్‌ల వద్ద ఉండే సిబ్బంది కూడా ఈ కోవకే వస్తారు. ప్రస్తుత అంచనాల ప్రకారం పదివేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినా రైలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ గ్యాంగ్ మేన్ లేదా ట్రాక్‌మెన్ ట్రాకులపై కాకుండా రైల్వే బోర్డు సభ్యుడు, రైల్వే జనరల్ మేనేజర్, డివిజనల్ రైల్వే మేనేజర్ స్థాయి వీఐపీల ఇళ్ల వద్ద పని చేస్తున్నారు. ఇళ్లలో కుటుంబ సభ్యుల బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, ఇళ్లు శుభ్రం చేయడం, మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు, సరకులు తెచ్చి ఇవ్వడం, వారి పిల్లలను స్కూళ్లలో వదిలి పెట్టి రావడం, మళ్లీ వారిని తీసుకరావడం. ఆ తర్వాత అవసరమైతే వారిని ట్యూషన్లకు కూడా తీసుకెళ్లడం లాంటి పనులు వీళ్లు చేస్తున్నారు. ఒక్కొక్కరి వీఐపీ ఇంట్లో ఒక్కొక్కరు కాకుండా ఆరుగురి నుంచి పది మంది గ్యాంగ్మెన్లు పనిచేస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తోంది. ప్రోటోకాల్ లేదా వీఐపీ సంస్కృతి పేరిట ఈ విష సంస్కతిని రైల్వే అధికారులు అనుభవిస్తూ వచ్చారు. దీనిపై కొత్తగా రైల్వే బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అశ్వణి లొహాని కేంద్ర మంత్రిత్వ శాఖకు ఓ నివేదికను అందజేసి ఆ శాఖ అనుమతి మేరకు రైల్వే ఉద్యోగాలందరికి ఈ వీఐపీ సంస్కృతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల నుంచి ఎలాంటి బహుమతులు తీసుకోరాదంటూ కింది తరగతి, ముఖ్యంగా డీ కేటగిరీ ఉద్యోగులకు సూచనలు చేశారు. వివిధ స్థాయి ఉద్యోగులను తానే స్వయంగా కలుసుకుంటూ వారి మధ్య విధుల నిర్వహణలో సంయమనం ఉండేందుకు కృషి చేస్తున్నారు. ఆయన నివేదికను పరిగణలోకి తీసుకున్న రైల్వే శాఖ అధికారులు కూడా శనివారం కూడా విధులకు హాజరుకావాల్సిందిగా రైల్వే ఉన్నతాధికారులను ఆదేశించారు. వారింత వరకు వారానికి రెండు రోజుల సెలవులను అనుభవిస్తున్నారు. గ్యాంగ్మెన్లు రోజుకు 12 గంటల షిప్టు పనిచేయాల్సి రావడం, రెండు, మూడు కిలోమీటర్లు పట్టాలు మరమ్మతుచేసే పనిముట్లు మోసుకెళ్లాల్సి రావడం, ప్రమాదాల్లో ఏడాదికి 200 మంది గ్యాంగ్మెన్లు మరణిస్తుండడం తదితర కారణాల వల్ల వారు తమ విధులను విస్మరించి అధికారుల ఇళ్లలో పనిచేయడానికే అలవాటుపడ్డారు. ఇష్టపడ్డారు. ఇక నుంచైనా ఈ పరిస్థితిని మార్చేందుకు ఇతర కార్మికుల్లాగానే వారి షిప్టులను కూడా 8 గంటలకు కుదించాలి. పాశ్చాత్య దేశాల్లోలాగే తేలికైనా, ఆధునిక పనిముట్లను వారికి అందజేయాలి. వారు నడచిపోవాల్సిన అవసరం లేకుండా, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా, ప్రస్తుత రైలు పట్టాల పక్కన వారి వాహనాల కోసం ప్రత్యేకంగా చిన్న ట్రాక్‌లను నిర్మించాలి. -
పినాకిని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం