పట్టాలు దాటుతుండగా ఢీకొట్టిన రైలు..
హైదరాబాద్: రైల్వే క్రాసింగ్ లేని చోట పట్టాలు దాటుతున్న మహిళను వేగంగా వస్తున్న రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. శుక్రవారం నగరంలోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇదే ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు మృతిచెందినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రెండేళ్ల క్రితమే ఫ్లై ఓవర్ మంజూరైంది. కాని ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. దీంతో ఆ ప్రాంతంలో తరచు ప్రమాదాలు జరగుతున్నాయి. ఇప్పటికైన అధికారులు నిద్ర వదలి వెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయాలని స్థానికులు ఆందోళన నిర్వహించారు.