అనంతపురం : కొందరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. చేసేది తప్పని తెలిసినా పదేపదే చేస్తుంటారు. కళ్లెదుటే ఘోరాలు జరుగుతున్నా...వారికి కనువిప్పు కలగదు. అసలే వర్షం కురుస్తోంది. రైల్వే ఫ్లాట్ఫారం తడిగా ఉంది. ఏమాత్రం పట్టు తప్పినా ప్రమాదానికి గురికాక తప్పదు.
అయినప్పటికీ కొందరు కదులుతున్న రైలెక్కే సాహసం చేశారు. వారిలో మహిళలూ ఉండడం గమనార్హం. కాలు పట్టుజారిందా...ఏకంగా మృత్యువు దరికే. చిన్నపాటి నిర్లక్ష్యమే నిండు జీవితాలను బలి తీసుకుంటాయి. అయినా వారి తీరు మారదు.ఈ దృశ్యాలు మంగళవారం అనంతపురం రైల్వేస్టేషన్లో కన్పించాయి.