గతేడాది రైలుప్రమాదాల్లో 25వేల మంది మృతి
- రైలు ప్రమాదాలకు సంబంధించి 2014లో మొత్తం 28,360 కేసులు నమోదయ్యాయి.
- అవి అంతకు ముందు సంవత్సరం వాటి కంటే మాత్రం 9.2 శాతం తక్కువే.
- ఎక్కువగా 61.6 శాతం ప్రమాదాలు రైళ్లలోంచి పడిపోవడం లేదా రైలు పట్టాల మీద వేరే వాహనాలతో రైళ్లు ఢీకొనడం వల్ల జరిగాయి.
- ఇలాంటి ప్రమాదాలు మహారాష్ట్రలో ఎక్కువగా జరిగాయి.
- మొత్తం కేసుల్లో 42.5 శాతం ఇక్కడివే ఉన్నాయి.
- మెకానికల్ వైఫల్యాల వల్ల.. అంటే డిజైన్ సరిలేకపోవడం, ట్రాక్ వైఫల్యాలు, బ్రిడ్జిలు/సొరంగాల సమస్యల కారణంగా 469 ప్రమాదాలు సంభవించాయి.
- ఇలాంటి రైల్వే మెకానికల్ వైఫల్యాల వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 385 మంది మరణించారు.
- ఉగ్రవాదులు/తీవ్రవాదుల దుశ్చర్యల కారణంగా 18 ప్రమాదాలు సంభవించాయి. వాటిలో 18 ప్రాణాలు పోయాయి.
- డ్రైవర్ల తప్పిదాల కారణంగా 60 ప్రమాదాలు సంభవించగా, 67 మంది మరణించారు.