ఢిల్లీ: ఒడిశా రైల్వే ప్రమాదం తర్వాత రైల్వేలో తీసుకున్న భద్రతా ప్రమాణాలపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రైల్వేలు అమలు చేయడానికి ప్రతిపాదించిన రక్షణ చర్యల గురించి తెలియజేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం అటార్నీ జనరల్‌ను కోరింది. ఆటోమెటిక్ రక్షణ వ్యవస్థ 'కవాచ్'ను పాన్-ఇండియా ప్రాతిపదికన ప్రవేశపెడితే ఎదురయ్యే ఆర్థికపరమైన చిక్కుల గురించి కూడా ధర్మాసనం ప్రశ్నించింది.
రైల్వేలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి నిర్దిష్ట ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. రైల్వేలో 'కవచ్' వ్యవస్థను తక్షణమే అమలు చేయడానికి మార్గదర్శకాలను జారీ చేయాలని పిటిషనర్ కోరారు. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (కవాచ్)ను దేశమంతటా ఇప్పటికీ అమలు చేయలేదని న్యాయస్థానానికి తెలిపారు.
ఒడిశాలోని బాలాసోర్‌లో గత కొద్ది నెలల క్రితం రెండు ప్యాసింజర్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 293 మంది మరణించారు. 1,000 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవలి కాలంలో దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇది ప్రధానమైంది.
ఇదీ చదవండి: మణిపూర్‌లో భద్రతా దళాలపై ముష్కరుల దాడి
Comments
Please login to add a commentAdd a comment