న్యూఢిల్లీ: కాపలా లేని లెవల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు జరక్కుండా హెచ్చరికలు తెలిపే వ్యవస్థను రైల్వే ఏర్పాటు చేయనుంది. ఆరుతూ వెలిగే రెండు లైట్లు, సైరన్‌తో కూడిన ఈ వ్యవస్థ.. క్రాసింగ్‌కు రైలు కిలోమీటరు దూరంలో ఉండగానే ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది. ఇది కోయంబత్తూరు-మెటుపల్లాయమ్ సెక్షన్ వద్ద ప్రయోగాత్మకంగా పరిశీలించగా.. మూడు నెలలు చక్కగా పనిచేసింది. దీంతో దీన్ని అన్ని రైల్వే జోన్లలోనూ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాని రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్(ఆర్‌డీ ఎస్‌వో), రైల్వేస్ రీసెర్చ్ వింగ్ సిఫారసు చేశాయని అధికారులు తెలిపారు.
రైలు ప్రమాదాల్లో 40 శాతం క్రాసింగ్ వద్ద జరిగినవే. రైలు ప్రమాదాల్లో 60 శాతం మంది క్రాసింగ్, ఓవర్ బ్రిడ్జిలు, భూగర్భ రైలు మార్గంలో జరిగిన దుర్ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారే. దేశవ్యాప్తంగా ఉన్న 30,348 క్రాసింగ్స్‌లో 11,563 చోట్ల కాపలా లేని దుస్థితి నెలకొని ఉంది.
కాపలా లేని క్రాసింగ్‌ల వద్ద హెచ్చరిక వ్యవస్థ
Published Mon, Oct 26 2015 2:24 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement