న్యూఢిల్లీ: ఈ ఏడాది రైలు ప్రమాదాల వల్ల ఒక్క ప్రయాణికుడు కూడా మరణించలేదని భారత రైల్వే ప్రకటించింది. దీంతో రైల్వే చరిత్రలోనే ఈ ఏడాది చాలా సురక్షితమైనదిగా నమోదైందని అధికారులు వెల్లడించారు. సిబ్బంది చనిపోయారని, ప్రయాణికులు చనిపోలేదని తెలిపారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 16 మరణాలు, 2017–18లో 28, 2016–17 మధ్య కాలంలో 195 మరణాలు సంభవించాయి. అదే 1990–95 మధ్య కాలంలో సరాసరి ఏటా 500 రైల్వే ప్రమాదాలు జరిగేవి. ఈ ఐదేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 2,400 మరణాలు సంభవించగా, 4,300 మంది గాయపడ్డారు. 2013–18 మధ్య కాలంలో ఏటా 110 ప్రమాదాలు జరగ్గా, ఈ ఐదేళ్లలో 990 మంది చనిపోగా, 1,500 మంది గాయపడ్డారని సమాచారం. కొన్నేళ్లుగా రైల్వేలో యాక్సిడెంట్లు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment