
న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో 204 ఐసోలేషన్ కోచ్‌లను ఏర్పాటుచేసింది. అందులో 54 కోచ్ లను ఢిల్లీలోని షకుర్బస్తి రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో ఢిల్లీలో 500 కోచ్‌లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లో 70 కోచ్‌లు, తెలంగాణలో 60 కోచ్‌లు (సికింద్రాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్‌లలో 20 చొప్పున), ఆంధ్రప్రదేశ్ (విజయవాడ)లో 20 కోచ్‌లను ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ 240 కోచ్‌లు కావాలని, తెలంగాణ 60 కోచ్‌లు కావాలని గతంలో రైల్వే శాఖను కోరాయి.
Comments
Please login to add a commentAdd a comment