సాక్షి, విశాఖపట్నం: దేశంలో రైల్వే లైన్లు, రైళ్ల సంఖ్య పెరుగుతున్నాయి. ప్రమాదాలూ అదేస్థాయిలో చోటుచేసుకుంటున్నాయి. తూర్పు కోస్తా రైల్వే చరిత్రలో హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనే అతి పెద్దది. ఈ ప్రమాదంలో 40 మంది మృత్యువాత చెందగా.. 71 మందికిపైగా గాయాలయ్యాయి.
దేశంలో ఘోర రైలు ప్రమాదాలను ఒకసారి గమనిస్తే..
► 1981 జూన్ 6: బిహార్‌లోని సహర్సా వద్ద ప్యాసింజర్ రైలు భాగమతి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 800 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
► 1995 ఆగస్టు 20: ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ వద్ద పురుషోత్తం ఎక్స్‌ప్రెస్, కాళింది ఎక్స్‌ప్రెస్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 358 మంది చనిపోయారు.
► 1999 ఆగస్టు 2: అస్సాంలోని గైసాల్ వద్ద అవధ్–అస్సాం ఎక్స్‌ప్రెస్, బ్రహ్మపుత్ర మెయిల్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 268 మంది మృతిచెందారు.
► 1998 నవంబరు 26: పంజాబ్‌లోని ఖాన్నా వద్ద జమ్మూ తావీ–సీల్డా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. 212 మంది మరణించారు.
► 2010 మే 28: పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌జిల్లాలో లోకమాన్య తిలక్ జ్ఞానేశ్వరి సూపర్ డీలక్స్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 170 మంది తుదిశ్వాస విడిచారు.
► 1964 డిసెంబర్ 23: తమిళనాడులో పాంబన్–ధనుష్కోటి ప్యాసింజర్ రైలు ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 150 మంది చనిపోయారు.
► 2002 సెప్టెంబర్ 9: హౌరా–న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ బిహార్‌లోని గయ వద్ద పట్టాలు తప్పింది. 140 మంది కన్నుమూశారు.
► 2003 జూలై 2: వరంగల్ స్టేషన్ వద్ద గోల్కొండ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. 21 మంది మృతిచెందారు.
► 2005 అక్టోబర్ 29: తెలంగాణలోని వలిగొండ వద్ద మూసి నదిపై బ్రిడ్జి కూలిపోయింది. అదే బ్రిడ్జిపై వెళ్తున్న డెల్టా ప్యాసింజర్ నదిలో పడిపోయింది. 114 మంది ప్రయాణికులు కన్నుమూశారు.
ఎన్నో ప్రమాదాలు.. వేలాది మృతులు
Published Mon, Jan 23 2017 3:00 AM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM
Advertisement
Advertisement