రేపు తీవ్ర తుపానుగా మారే అవకాశం
ఏపీలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు
Cyclone dana: తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. పారాదీప్‌కు ఆగ్నేయంగా 650 కిలోమీటర్లు దూరంలో ఇది కేంద్రీకృతమైంది. 24వ తేదీకి తుపానుగా, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఇది 24వ తేదీన పూరి–పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలో తీరం దాటుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.
తీరం దాటే సమయంలో తీరం వెంబడి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
తుపాను కారణంగా నేడు, రేపు పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఈస్ట్ కోస్ట్ రైల్వేకు ‘దనా’ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు.
నేడు రద్దయిన రైళ్లు
కామాఖ్య–బెంగళూరు (12552), సిల్‌చార్–సికింద్రాబాద్ (12514), డిబ్రుగర్–కన్యాకుమారి (22504), సికింద్రాబాద్–భువనేశ్వర్ (17016), చెన్నై సెంట్రల్–హౌరా (12840), పుదుచ్చేరి–హౌరా (12868), చెన్నై సెంట్రల్–షాలీమార్ (22826), పుదుచ్చేరి–భువనేశ్వర్ (12897), బెంగళూరు–భువనేశ్వర్ (18464), ముంబై–భువనేశ్వర్ (11019), బెంగళూరు–గౌహతి (12509), హైదరాబాద్–హౌరా (18046), కన్యాకుమారి–డిబ్రుగర్ (22503), సికింద్రాబాద్–హౌరా (12704), బెంగళూరు–హౌరా (22888), సికింద్రాబాద్–మాల్దాటౌన్ (03429), యశ్వంత్‌పూర్–హౌరా (12864), తిరునెల్వేలి–షాలీమార్ (06087) రైళ్లను బుధవారం పూర్తిగా రద్దు చేశారు.
రేపు రద్దయ్యే రైళ్లు...
హౌరా–సికింద్రాబాద్ (12703), ఖరగ్‌పూర్–విల్లుపురం (22603), హౌరా–భువనేశ్వర్ (12073), షాలీమార్–హైదరాబాద్ (18045), సత్రగచ్చి–మంగుళూరు సెంట్రల్ (22851), షాలీమార్–చెన్నై సెంట్రల్ (12841), హౌరా–తిరుచ్చిరాపల్లి (12663), హౌరా–బెంగళూరు (12863), షాలీమార్–వాస్కోడిగామా(18047), హౌరా–చెన్నై సెంట్రల్ (12839), పాట్నా–యర్నాకులం (22644), సత్రగచ్చి–చెన్నై సెంట్రల్ (06090), చెన్నై సెంట్రల్–హౌరా (12842), చెన్నై సెంట్రల్–సత్రగచ్చి (22808), బెంగళూరు–ముజఫర్‌పూర్ (15227), తాంబరం–సత్రగచ్చి (06095), బెంగళూరు–హౌరా (12246), పూరి–తిరుపతి (17479) రైళ్లను 24న పూర్తిగా రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment