పవన్ హన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్ (పీహెచ్హెచ్ఎల్) సంస్థ ప్రముఖ యాత్ర స్థలాలు, పర్యాటక కేంద్రాలల్లో అనుమతి లేకుండా హెలిప్యాడ్లను నిర్మించిందని ద కంప్ట్రొలర్ అడిటర్ జనరల్ (కాగ్) ఆదివారం న్యూఢిల్లీలో వెల్లడించింది. గతేడాది జూన్లో ఫాత (అమర్నాథ్), కట్రా, పోర్ట్ బ్లయిర్, గంగాటక్,పాట్నా, కొరాపూట్, గడ్చిరోలిల్లో హెలిప్యాడ్లను ఏర్పాటు చేసిందని ఉదాహరించింది.
ప్రయాణికులు లేదా లగేజీతో వెళ్లే విమానం,హెలికాప్టర్లు తమ స్వరీసులను విమానాశ్రయాల్లో దిగాలన్న, బయలుదేరాలన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి అవసరమని పేర్కొంది. అందులోభాగంగానే హెలిప్యాడ్ల నిర్మాణంలో కూడా అనుమతి కోరాలని తెలిపింది. అయితే ఆ విషయంలో పీహెచ్హెచ్ఎల్ పూర్తిగా పక్షపాతధోరణితో వ్యవహరించిందని కాగ్ ఆరోపించింది.
ప్రయాణికుల భద్రతపై కొంచమైన శ్రద్ధ లేకుండా వ్యవహారిస్తుందని ఆ సంస్థను కాగ్ ఈ సందర్భంగా తీవ్రంగా ఆక్షేపించింది. ఈశాన్య భారతంలో ఆ సంస్థ నడుపుతున్న విమాన సర్వీసుల అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. అలాగే 2011,ఏప్రిల్లో పీహెచ్హెచ్ఎల్ సంస్థకు చెందని హెలికాప్టర్ 17 మంది ప్రయాణికులతో వెళ్తు తవాంగ్ వద్ద జరిగిన ప్రమాద సంఘటనపై పౌరవిమానయాన సంస్థ ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతిని కాగ్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. పవన్ హన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్ సంస్థపై కాగ్ రూపొందించిన నివేదికను గత వారం కాగ్ పార్లమెంట్కు నివేదించిన సంగతి తెలిసిందే.