గౌతమ్ బాంబావాలే
సాక్షి, బీజింగ్ : భారత్, చైనాలు నిర్భయంగా.. ఎలాంటి దాపరికాలు లేకుండా చర్చించడం ద్వారానే రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని చైనాలోని భారత రాయబారి గౌతమ్ బాంబావాలే అన్నారు. డోక్లాంలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయన్నారు. చైనాకు చెందిన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.చైనా గత సంవత్సరం భారత భూభాగమైన డోక్లాంలోకి చొచ్చుకురావడం వల్లే విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.
చైనా బీజింగ్ నగరం నుంచి డోక్లాం మీదుగా రోడ్డు మార్గాన్ని నిర్మించాలనుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడి, ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందన్నారు. చైనా తన బలగాలను సరిహద్దు ప్రాంతాల్లో మోహరించడంతో భారత్ కూడా తన బలగాలను సరిహద్దుకు చేర్చిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఇరు దేశాలు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇది వరకు చాలా చర్చలు జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వలేదని, డోక్లంపై దాపరికం లేని చర్చలు మరిన్ని జరగాలన్నారు. సున్నిత ప్రాంతాల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడమే ఇరు దేశాలకు మంచిదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment