న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కావాలని భావించారు. అయితే ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ కారణంగా వాంగ్ యీతో మోదీ భేటీ సాధ్యపడదని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రధాని మోదీతో భేటీ కావాలన్న చైనా విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించింది.
పాకిస్తాన్ పర్యటన ముగించుకుని గురువారం వాంగ్ యీ భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. మరుసటి రోజు(శుక్రవారం) ఆయన ప్రధాని మోదీతో భేటీ కావాలని భావించారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరు కావాల్సిన షెడ్యూల్ ముందుగానే ఖరారైంది.
దీని కారణంగా చైనా విదేశాంగ మంత్రితో భేటీ సాధ్యం కాదని సున్నితంగా పేర్కొంది. శుక్రవారం వాంగ్ యీ భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సమయంలో కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాంగ్ యూ.. భారత్‌లో పర్యటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment