సరిహద్దుపై అర్థవంతమైన చర్చలు సాగాలి: చైనా | Maintain restraint on border disputes: China tells India | Sakshi
Sakshi News home page

సరిహద్దుపై అర్థవంతమైన చర్చలు సాగాలి: చైనా

Published Tue, May 30 2017 9:59 AM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

Maintain restraint on border disputes: China tells India

బీజింగ్‌: చైనాతో సరిహద్దు వివాద పరిష్కారం కోసం ప్రశాంత వాతావరణంతో కూడిన అర్థవంతమైన విధానాన్ని భారత్‌ అవలంభించాలని ఆ దేశం సూచించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో సరిహద్దు వివాదంపై చైనా వైఖరి స్పష్టమని, ఎప్పటికీ మారదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ పేర్కొన్నారు.

ఇటీవల అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లను కలిపే బ్రిడ్జిని భారత ప్రధాని ప్రారంభించడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా భారత్‌లు సరిహద్దు సమస్యను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. సినో-ఇండియా సరిహద్దు తూర్పు భాగంపై తమ వైఖరి స్పష్టంగా ఉందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement