నరేంద్ర మోదీ, జీ జిన్‌పింగ్ (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ/బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో భేటీ కానున్నారు. ఈ నెల 27న చైనాలోని హువాన్ నగరంలో మోదీ-జిన్‌పింగ్ సమావేశం అవుతారని కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది. నాలుగు రోజుల చైనా పర్యటనలో భాగంగా శనివారం సుష్మా బీజింగ్ చేరుకున్నారు. ఆదివారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ఆమె భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు.
భారత్‌తో సరిహద్దు వివాదంపై చర్చించేందుకు ఓ ప్రత్యేక ప్రతినిధిని ఏర్పాటు చేసినందుకు చైనా మంత్రి వాంగ్‌ను కేంద్ర మంత్రి సుష్మా అభినందించారు. మానస సరోవర యాత్రకు వెళ్లే వారి కోసం నాథులా పాస్ మార్గాన్ని పున:ప్రారంభిస్తామని సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు సమస్య పరిష్కారానికి ముందడుగు పడనుందని ఇరుదేశాల అధికారులు భావిస్తున్నారు. ఇటీవల షాంఘైలో భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)కు చెందిన అధికారులు సమావేశమై సరిహద్దు సమస్యలపై చర్చించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment