చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి
న్యూ ఢిల్లీ: అణు సరఫరా దేశాల కూటమి(ఎన్ఎస్జీ)లో సభ్యత్వం విషయంలో భారత్కు మోకాలడ్డిన చైనా.. ఇప్పుడు భారత సహాయం కోరుతోందా. అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి.. వచ్చేవారం ఢిల్లీకి రాబోతున్నారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీ వెనకున్న ప్రధాన ఉద్దేశం మాత్రం ఇటీవల దక్షిణ చైనా సముద్రం విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో చైనాకు తగిలిన ఎదురుదెబ్బే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దక్షిణ చైనా సముద్రం విషయంలో అంతర్జాతీయంగా చైనాకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆ సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని అమెరికాతో సహా చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో చిక్కుల్లో పడిన చైనా.. ఈ విషయంలో భారత్ సపోర్ట్ను కోరుకుంటుంది. అలా కాకున్నా.. మిగతా దేశాలతోపాటు బారత్ వ్యతిరేక స్వరం వినిపించకూడదని చైనా కోరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్లో చైనాలో జరగనున్న జీ 20 సదస్సులో ఇతర దేశాలతో పాటు.. బారత్ కూడా తమకు వ్యతిరేక గళం వినిపంచకుండా మోదీ, జి జిన్పింగ్ల మధ్య సమావేశానికి బ్యాక్గ్రౌండ్ సెట్చేయటమే.. వాంగ్ యీ భారత్ పర్యటన లక్ష్యం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.