ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించకపోతే ఏజెన్సీలను తొలగిస్తామని మండల విద్యాశాఖాధికారి గంగప్ప పేర్కొన్నారు.
హిందూపురం టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించకపోతే ఏజెన్సీలను తొలగిస్తామని మండల విద్యాశాఖాధికారి గంగప్ప పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో మండలంలోని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదనే సమాచారం తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి ఏజెన్సీలను తొలగిస్తామని హెచ్చరించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని లేనిపక్షంలో బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించారు.